Brahmamudi Today April 07: ఇందూకి తన తల్లి గురించి, ఆమె ధైర్యం గురించి తెలియాలని చెప్పి కావ్య గురించి కళ్యాణ్ రాసిన పుస్తకాన్ని ఇందుకి ఇస్తుంది అపర్ఱ.
మరోవైపు ఇందూ సంతకంతో దుగ్గిరాల ఆస్తి తన సొంతం కాబోతుందని రేఖ కలలు కంటుంది. ఆస్తిని, తల్లిదండ్రుల ఆశయాల్ని ఎలా కాపాడాలా? అని బాధపుడుతున్న ఇందూకి.. పుస్తకం చదువుతున్నప్పుడే.. కావ్య ఆత్మరూపంలో కనిపిస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. అక్కడితో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం (ఏప్రిల్ 07) ఏం జరిగిందో చూద్దాం. (photo courtesy by star maa and Jio Hotstar)
Brahmamudi April 07 Episode: అర్ధరాత్రి ఇందూ గదిలో ఒంటరిగా బాధపడుతుండగా, ఆమె ముందు తల్లి కావ్య ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఇందూ కన్నీళ్లతో "నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు అమ్మా?" అని కావ్య ఆత్మను అడుగుతుంది. దీనికి కావ్య.. "నేను ఎక్కడికీ వెళ్ళలేదు ఇందూ. నీ మనసులోనే ఉన్నాను, నీ ప్రతి ఆలోచనలోనూ ఉన్నాను. అసలు నువ్వెందుకు అంతగా భయపడుతున్నావు?" అంటుంది కావ్య ఆత్మ. దాంతో ఇందూ.. "ఆ రేఖ ఆంటీ.. తాతయ్య వాళ్ళని చంపేస్తానని బెదిరిస్తోంది అమ్మా. ఆస్తి కోసం సంతకం పెట్టమని వేధిస్తోంది. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా దగ్గర నీ అంత ధైర్యం, నీ అంత తెలివి లేవు" అని చెప్పి బాధపడుతుంది. దాంతో కావ్య ఆత్మ.. "ఇందూ.. జవాబు దొరకని ప్రశ్న అంటూ ఈ లోకంలోనే లేదు. నువ్వు నా రక్తం.. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు" అని చెబుతుంది. దీనికి ఇందూ.."నేను ఓడిపోయాను, వాళ్లను కాపాడుకోవడం కోసం ఆస్తి మొత్తం ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాను. నీ ఆశయాన్ని నాశనం చేశాను, నీ కూతురిగా ఉండే అర్హత నాకు లేదని" చెప్పి బాధపడుతూ ఇందూ కావ్య ఆత్మ ఒడిలో పడుకుంటుంది. ధైర్యాన్ని ఇచ్చిన కళావతి ఆత్మ..

కావ్య ఆత్మ ఇందూని ఓదారుస్తూ.."నువ్వు సంతకం పెట్టినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. యుద్ధంలో గెలవాలంటే కొన్నిసార్లు సమయం కోసం వేచి చూడాలి. నిన్ను నువ్వు నమ్ము.. అప్పుడే ప్రకృతి నీకు అండగా నిలుస్తుంది. నీకో మార్గం దొరుకుతుంది" అని ఇందూకి ధైరాన్ని ఇస్తుంది. తల్లి ఇచ్చిన ధైర్యంతో ఇందూ కళ్ళు తుడుచుకుని, రేఖను ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకుంటుంది. ఉదయాన్నే రేఖ, భ్రమరాంబ, భూషణ్ లు కలిసి ఇందూ గదిలోకి నెమ్మదిగా వచ్చి గట్టిగా అరుస్తూ బర్త్‌డే విష్ చెబుతారు. అందర్ని ఒక్కసారిగా చూడగానే ఇందూ భయపడుతుంది.
శేషు చురకలు.. రేఖ ప్రేమ..

ఒక్కసారిగా వాళ్లని చూసి ఉలిక్కి పడి లేచి.. దొంగ ,దొంగ అంటూ కేకలు పెడుతుంది. దాంతో స్వాతీ, అపర్ణలతో పాటు శేషు కూడా పరుగున వస్తాడు. 'ఏంటమ్మా ఇందూ.. మీ పిన్నిని దగ్గరగా చూసి దొంగ అనుకున్నవా?' అంటూ భ్రమరాంబపై పంచులు వేస్తాడు. రేఖ మాట్లాడుతూ.."హ్యాపీ బర్త్ డే ఇందూ. నీ కోసం గెస్ట్ హౌస్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాను. పెద్ద పెద్ద వీఐపీలు వస్తున్నారు" అని చెబుతుంది. ఇందూ మేజర్ కావడంతో ఇందూతో మంచిగా నటించి , ఆస్తి పేపర్ల మీద సంతకం చేయించుకోవాలన్నది రేఖ ప్లాన్.
పార్టీకి వెళ్లకు ఇందూ.. అపర్ణాదేవి సలహా..

ఇదంతా గమనించిన అపర్ణ.. "ఏంటి రేఖ ఇదంతా? ఇన్ని రోజులు లేని ప్రేమని ఈరోజు కురిపిస్తున్నావు..? ఏంటీ నాటకం?" అని కోపంగా అంటుంది. దీనికి రేఖ ..'చూశారా .. ప్రేమ చూపించకపోతే రాక్షసి అంటారు, చూపిస్తే నటన అంటారు. ఏది ఏమైనా ఈ పార్టీ బాగా జరగాల్సిందే' అంటూనే.. స్వాతితో.. 'స్వాతీ.. నువ్వు ఇందూని దగ్గరుండి రెడీ చేసి తీసుకురా' అని చెప్పి రేఖ అక్కడి నుంచి భూషన్ వాళ్లను తీసుకుని వెళ్లిపోతుంది. అప్పుడే అపర్ణ ఇందూతో మాట్లాడుతూ.."దాని నక్క తెలివితేటలకు మోసపోవద్దు. అసలు ఆ బర్త్ డే పార్టీకే వెళ్లొద్దని" చెబుతుంది. స్వాతీ కూడా అక్కడే ఉంటుంది.
ఏం చేస్తావ్ ఇందూ.. స్వాతీలో కంగారు..

అపర్ణ మాటాలకు ఇందూ సమాధానం ఇస్తూ.. "నేనేం చేయాలో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను, దానిని ఎవ్వరూ మార్చలేర"ని చెబుతుంది. నువ్వు ఏమైనా చెయ్.. కానీ ఆస్తి మాత్రం ఆ రేఖ చేతిలోకి వెళ్లనీయొద్దు, మనల్ని నమ్ముకున్న వాళ్లకి అన్యాయం చేయొద్దని అని చెప్పి అపర్ణ దేవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడే ఉన్న స్వాతీ.. ఇందూ దగ్గరకు వచ్చి.. 'ఇందూ నువ్వు ఏం చేయబోతున్నావు.. సంతకం పెడతావా?' అని అడుగుతుంది. దానికి ఇందూ.. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను . నేను పార్టీకి వెళ్తాను, కేక్ కట్ చేస్తాను.. కానీ సంతకం మాత్రం పెట్టను" అని సమాధానం ఇస్తుంది. స్వాతి షాక్ అవుతూ.. "అదెలా సాధ్యం ఇందూ? సంతకం పెట్టకపోతే వాళ్ళు ఊరుకోరుగా?" అని ప్రశ్నిస్తుంది.
ఇందూ కూడా ఐశ్వర్య బాటలోనే.. కిడ్నాప్‌కి సిద్ధం..

స్వాతి అడిగిన ప్రశ్నకు ఇందూ కూల్‌గా రియాక్ట్ అవుతూ "అందుకే.. నేను పార్టీ మధ్యలో నుండి మాయం అయిపోతాను. నన్ను నేనే కిడ్నాప్ చేసుకుంటాను. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారంటే.. ఆ రేఖ ఆస్తి పేపర్ల మీద సంతకం చేయించుకోలేదు, అలాగని తాతయ్య వాళ్ళని ఏమీ చేయలేదు. నా కోసం వెతకాల్సిందే. నాకు కావాల్సిన సమయం దొరుకుతుంది" అని తన ప్లాన్‌ని బయటపెడుతుంది. ఇందూ మాటలకు స్వాతి షాక్ అవుతుంది. ఐడియా బాగుంది కానీ కిడ్నాప్ చేసేవాళ్లు ఎవరు? అంటుంది స్వాతి. 'నువ్వే హెల్ప్ చెయ్యాలి స్వాతీ' అని రిక్వస్ట్ చేస్తుంది ఇందూ. మొదట బయపడిన స్వాతీ.. చివరికి సరే.. ఇద్దరు తెలిసిన వాళ్లు ఉన్నారు వాళ్లతో మాట్లాడతాను అని చెబుతుంది.
మీరిలా డైరెక్ట్‌గా వస్తే ప్రమాదం కదా? ఐశ్వర్య కంగారు..

అయితే అప్పటికే డబ్బు కోసం ఇందూని కిడ్నాప్ చేయాలని లక్కీ, స్వరాజ్‌లతో ఐశ్వర్యలు డీల్ మాట్లాడుకుంటుంది. ఎలాంటి మాస్క్ లేకుండా వచ్చిన స్వరాజ్, లక్కీలను చూసిన ఐశ్వర్య కంగారుపడుతుంది. స్వరాజ్, లక్కీలను చూసి ఐశ్వర్య .. "మీరిద్దరూ ఇక్కడికి వస్తే అందరూ గుర్తుపడతారు. ఏదైనా తేడా వస్తే అందరం ఇరుక్కుంటాం" అని కోపపడుతుంది. స్వరాజ్ రియాక్ట్ అవుతూ.."అందుకే మేము వెయిటర్స్ గెటప్‌లో వెళ్తున్నాం ఐశ్వర్య. ఎవరికీ అనుమానం రాదు" అని బదులిస్తాడు. దానికి లక్కీ.."ఏంట్రా.. వెయిటర్ గెటప్ ఏంటి? ఏదైనా సినిమా హీరో గెటప్ వేద్దాం అనుకున్నానే" అంటూ కామెడీగా మాట్లాడతాడు.
రేఖ సంబరం.. అంతా అప్పుల వాళ్లే..

మొత్తానికీ రాజ్, లక్కీలు.. అక్కడున్న వైటర్స్ సాయంతో వాళ్ల డ్రెస్‌లు తాము తీసుకుని.. ఎంట్రీ ఇస్తారు. ఐశ్వర్య ముందుకు వచ్చి ముఖాలకు మాస్కులు పెట్టుకుని... ఇప్పుడు మమ్మల్ని గుర్తుపట్టడం కష్టం అని చెబుతారు. ఐశ్వర్య కూడా ఊరిపి పీల్చుకుంటుంది. మరోవైపు గెస్ట్ హౌస్‌లో పార్టీ సందడి మొదలవుతుంది. ఇక పార్టీకి వచ్చిన వారిలో అప్పులు వాళ్లు ఎక్కువ ఉంటారు. ఇక రేఖ.. అందరికీ ఆహ్వానం పలుకుతూనే.. చాలా సంతోషంగా భర్తతో... "భూషణ్ ఇన్నాళ్లు మనం అప్పులు ఎగ్గొడతామేమో అని వీళ్ళు యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఇందూ సంతకం పెడితే.. నేను ఛైర్మన్ అయ్యాక కొత్త అప్పులు ఇవ్వడానికి క్యూ కడతారు" అని తన ప్లాన్‌ని బయటపెడుతుంది.
రేఖ నమ్మకం.. ఇందూ సంతకం పెట్టాల్సిందే భూషణ్..

ఇంతలో చక్రీ అనే వ్యక్తి వచ్చి.. రేఖ ముందు గొడవ చేస్తాడు. చక్రీ ఆవేశంగా "నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు రేఖ గారు?" అని గట్టిగా నిలదీస్తాడు. రేఖ గర్వంగా.."ఇంకొక్క గంట ఓపిక పట్టు చక్రీ. ఒక్కసారి నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఛైర్మన్ అయ్యాక.. నువ్వు ఇచ్చిన అప్పు నా ప్రాజెక్ట్ ఖర్చులో ఒక పర్సెంట్ కూడా ఉండదు..ఇచ్చేస్తా" అంటూ పొగరుగా సమాధానం ఇస్తుంది. భూషణ్ మాత్రం కంగారుపడుతుంటాడు. "ఆ ఇందూ సంతకం పెట్టడంలో ఏమైనా తేడా వస్తుందా? అని రేఖని చిన్నగా అడుగుతాడు. అలా జరగదు అని నమ్మకంగా చెబుతుంది రేఖ.
ఇందూ ప్రేమలో పడిపోయిన రాజ్..

ఇంతలో స్వరాజ్, లక్కీలు వెయిటర్స్ గెటప్‌లో ఇందూని కిడ్నాప్ చేయడానికి లోపలికి వెళ్తారు. అక్కడితో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. అయితే కమింగ్ అప్‌లో.. ఇందూ లంగా ఓనీ వేసుకుని బుట్టబొమ్మలా కారు దిగుతుంది. రాజ్, స్వరాజ్‌లు చాటుగా గమనిస్తుంటారు. ఇందూ చాలా అందంగా ఉండటం చూసిన రాజ్.. 'ఇంతకాలం నోరు వేసుకుని పడిపోతుంటే దీన్ని చూసి రాక్షసి అనుకునేవాడ్నిరా' అంటాడు రొమాంటిక్‌గా ఇందూ వైపు చూస్తూ. 'మరి ఇప్పుడు ఏమనిపిస్తుందిరా.' అంటాడు లక్కీ అనుమానంగా. 'అందాల రాక్షసిలా కనిపిస్తోందిరా' అంటాడు రాజ్... ఇందూపై ప్రేమ మొలకెత్తిన వాడిలా మెలికలు తిరుగుతూ. మొత్తానికీ ఇందూ అందానికి పడిపోయాడు రాజ్. మరోవైపు ఇందూ, ఐశ్వర్యల టార్గెట్ కిడ్నాపే కావడంతో.. స్వాతీ మనుషులు వచ్చి ఇందూని తీసుకుని వెళ్లేలోపు.. స్వరాజ్, లక్కీలను స్వాతీ ఏర్పాటు చేసిన కిడ్నాపర్స్ అనుకుని.. వాళ్లతో పాటు ఇందూ పారిపోతుందేమో చూడాలి. అన్నట్టు నేటితో బ్రహ్మముడి సీరియల్ 1000 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసింది. బ్రహ్మాండం బద్దలు కొట్టిన బ్రహ్మముడిపై ప్రత్యేక కథనం చూసేయండి. 'గుండెనిండా గుడిగంటలు' ఏప్రిల్ 07 ఎపిసోడ్: మనోజ్‌ని ముంచేసిన ముఖేష్.. రసవత్తరంగా సకుటుంబ సపరివార సమేత డ్రామా

