Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi Today జూన్ 04 ఎపిసోడ్: లక్ లేని లక్కీ.. ఇందు మీద ద్వేషంతో ఐశ్వర్య కొత్త ప్లాన్.. రేఖకు షాక్ తప్పదా?

Brahmamudi Today జూన్ 04 ఎపిసోడ్: లక్ లేని లక్కీ.. ఇందు మీద ద్వేషంతో ఐశ్వర్య కొత్త ప్లాన్.. రేఖకు షాక్ తప్పదా?

Telugu Samayam 5 days ago

Brahmamudi Serial 2026 June 4th Episode Preview బ్రహ్మముడి సీరియల్‌లో గురువారం నాడు ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమీ జరగలేదు. రేఖ సీఈవో చైర్ కోసం ఇందుతో ఓ ప్లాన్ వేస్తుంది.

ఇందు సీఈవో కావడం ఏంటి? అని ఐశ్వర్య రగిలిపోతుంది. మరో వైపు ఇందు ఆనందంగా ఉందో లేదో అని సుభాష్, అపర్ణ అనుకుంటూ ఉంటారు. ఇంతలో రాజు వచ్చి వారికి భరోసానిస్తాడు. ఇంకో వైపు లక్కీ తన అమ్మ రేఖ ఫోటోని జస్ట్‌లో మిస్ అవుతాడు.


కళ్లు నెత్తికి ఎక్కాయా? అని ఇందుని ఐశ్వర్య ఆడిపోసుకుంటుంది. పెళ్లి అయింది అని, ఆ రాజు గాడ్ని చూసుకుని రెచ్చిపోతోన్నావా? అని ఐశ్వర్య అంటాడు. రాజుని అలా వాడు వీడు అని అనకు అని ఇందు అంటుంది. ఏ.. వాడ్ని నువ్వు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావ్ కదా.. ఎలా పిలిస్తే నీకు ఏంటి?. అయినా నీకు నోరు కూడా లేస్తోంది అని ఐశ్వర్య అంటుంది. ఇంట్లో నువ్వు పని మనిషివే అది గుర్తు పెట్టుకో అని అవమానిస్తుంది. నేను కనీసం పని అయినా చేస్తున్నాను అని ఇందు కౌంటర్లు వేస్తుంది. అంటే నేను పనీపాట లేకుండా ఖాళీగా ఉంటున్నాను అని అంటున్నావా? దెప్పిపొడుస్తున్నావా? అని ఐశ్వర్య అంటుంది. దెప్పి పొడవడం ఏంటి? నిజమే కదా అని ఇందు అంటుంది. నేను ఏం చేసినా నెగెటివ్‌గానే చూస్తావ్.. చేసే పనులన్నీ నువ్వు చేసి నన్ను అంటున్నావ్.. నన్ను అనే ముందు నీ స్థితి, స్టేటస్ ఏంటి? అన్నది నీది నువ్వు చూసుకో అని ఐశ్వర్యకి ఇందు కౌంటర్లు వేస్తుంది. నీ సంగతి చెప్తానే.. అని ఇందు గురించి ఐశ్వర్య అనుకుంటుంది.మిస్ అయిన లక్కీ..

మరో వైపు ఆంటోని తప్పతాగి పడుకుని ఉంటాడు. వాడి డ్రెస్ నుంచి ఓ ఫోటో పడుతుంది. ఆ ఫోటోని లక్కీ చూసే లోపు ఆంటోనీ లాక్కుంటాడు. ఇది నా పర్సనల్.. నా పర్సనల్ విషయాల్ని టచ్ చేయొద్దు అని నీకు చెప్పాను కదా అని ఆంటోని వార్నింగ్ ఇస్తాడు. నేను తీయలేదు.. అదే పడిపోయింది అని లక్కీ అంటాడు. అయినా సరే నువ్వు చూడొద్దు అని ఆంటోనీ అంటాడు. మా అమ్మని కనిపెడతా అన్నావ్.. ఎవరినో కలవడానికి వెళ్తా అన్నావ్ అని ఆంటోని అంటాడు. వెళ్తాను.. అంత కంటే ముందు నాకు ఉప్మా పెసరట్టు తీసుకు రా పో అని పంపించేస్తాడు. ఆ ఫోటో ఏంటి? అని లక్కీకి కూడా అనుమానం వస్తుంది.


అనుమానించిన అపర్ణ

ఇంకో వైపు సీఈవో పోటీ కోసం ఇందు రెడీ అవుతుంది. తాతయ్య, నానమ్మ వద్ద ఆశీర్వాదం తీసుకుంటుంది. నువ్వు ఇలా సంతోషంగా ఉండటం చూస్తే మాకు ఆనందంగా ఉందమ్మా అని సుభాష్, అపర్ణ అంటారు. రాజు చాలా మంచివాడు.. నిన్ను చాలా ఇష్టపడుతున్నట్టుగా ఉంది.. అందుకే స్టోర్ రూంలో ఉన్న నిన్ను ఏసీ గదిలోకి తీసుకు వెళ్లాడు.. రూపంలోనే కాదు. గుణంలోనూ మీ నాన్నలానే రాజు ఉన్నాడు అమ్మా అని సుభాష్ అంటాడు. దీంతో అసలు నిజాన్ని దాచానే అని ఇందు బాధపడుతుంటుంది. నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావ్ కదా? అని ఇందుని అపర్ణ అడుగుతుంది.


కవర్ చేసిన రాజు..

అదే టైంలో రాజు వచ్చి కవర్ చేస్తాడు. మేం సంతోషంగా ఉన్నాం.. మీ మనవరాల్ని సంతోషంగా చూసుకుంటున్నాం.. అప్పుడప్పుడు నా కాలు తొక్కుతూ ఉంటుంది అది వేరే విషయం లేండి అని రాజు కామెడీ చేస్తాడు. మీరేమీ ఆలోచించకండి.. మేం సంతోషంగా ఉన్నాం తాతయ్య అని అంటాడు. ఈ రోజు మేం ఆఫీస్‌కి వెళ్లాలి.. నేను సీఈవోగా పోటీ చేస్తున్నా కదా అని రాజు అంటాడు. మా మనవడు ఉండాల్సిన స్థానం అది.. నిన్ను చూస్తుంటే మా మనవడ్ని చూసినట్టే ఉంది అని రాజుని అపర్ణ పట్టుకుంది. ఈవిడ స్పర్శ ఏంటి నాకు ఇలా ఉంది.. నాకు తెలిసిన వారిలానే ఉంది.. అమ్మో వీళ్ల ఎమోషనల్ ట్రాప్‌లో మనం పడొద్దు అని రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.


రేఖ ప్లాన్ ఇదే..

ఇంకో వైపు సీఈవో పోటీ గురించి భ్రమరాంబ, భూషణ్, శేషు, రేఖ మాట్లాడుకుంటారు. అసలు వాడ్ని ఈ పోటీలోకి ఎందుకు రానిచ్చావ్.. మొదట్లోనే ఆపాల్సింది కదా అని భ్రమరాంబ అంటుంది. అలా చేస్తే వాడు ఆగిపోతాడా? అని రేఖ అంటే.. ఇంకా రెచ్చిపోయేవాడు అని శేషు అంటాడు. అందుకే నా ప్లాన్స్‌లో నేను ఉన్నాను.. నా లెక్కలు నాకు ఉన్నాయి.. ఇందుని ఆఫీస్‌కి తీసుకు వెళ్తాను.. ఇందుని సీఈవో చేస్తా అని రేఖ అంటుంది. ఈ విషయాలన్నీ ఐశ్వర్య వింటుంది. అది సీఈవో అవ్వడం ఏంటి అని చిరాగ్గా అక్కడి నుంచి వెళ్తుంది.


పరంధామయ్యతో..

బోర్డ్ మెంబర్స్‌లో ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తారు.. ఇంకో ఇద్దరు చేయరు.. పరంధామయ్య మాత్రం దుగ్గిరాల కుటుంబం కోసం ఉంటాడు.. నేను ఈరోజు ఇందుని నాతో పాటు తీసుకు వెళ్తా.. అక్కడ ఇందుని చూసి కావ్య అని ఆయన సంబరపడి నాకే సపోర్ట్ చేస్తాడు అని రేఖ అంటుంది. ప్లాన్ అదిరింది అని భూషణ్ అంటాడు. వర్కౌట్ అవుతుందా అని భ్రమరాంబ అనుమానిస్తుంది. ఏదైనా చివరి నిమిషంలో తేడా కొడితే ఎలా అని భ్రమరాంబ ఉద్దేశం అంటూ శేషు కవర్ చేస్తాడు. ఏం జరగదు అన్నయ్య అని రేఖ అంటుంది.


కొత్త ప్లాన్..

అసలు రేఖ ఆంటీకి బుద్ది ఉందా.. ఇంత వరెస్ట్‌గా ఆలోచిస్తోంది.. అది సీఈవో అవ్వడం ఏంటి?, అది ఇంకా ఆగదు..నా మీదే పొగరు చూపిస్తుంది.. దాన్ని వెంటనే ఆపాలి.. అని ఐశ్వర్య డిసైడ్ అవుతుంది. వెంటనే రౌడీలకు ఫోన్ చేసి ప్లాన్ వేస్తుంది. ఇద్దరు రౌడీలు కావాలి.. ఎంతైనా ఇస్తా.. లొకేషన్ పంపిస్తా అని ఐశ్వర్య అంటుంది. ఇంకో వైపు సూటుబూటు వేసుకుని రాజు రెడీ అవుతాడు. ఇక శేషుతో రకరకాల ఫోటోలు తీయించుకుంటాడు. రాజు పోజులు పెడుతుంటే శేషు ఫోటోలు తీస్తుంటాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam