Dailyhunt
Brahmamudi Today మే 05 ఎపిసోడ్: 'రేపే నా కొడుకుతో ఇందూ పెళ్లి' ఊహించని జలక్ ఇచ్చిన రేఖ! ఇక రాజు ఎంట్రీ తప్పదు..

Brahmamudi Today మే 05 ఎపిసోడ్: 'రేపే నా కొడుకుతో ఇందూ పెళ్లి' ఊహించని జలక్ ఇచ్చిన రేఖ! ఇక రాజు ఎంట్రీ తప్పదు..

Telugu Samayam 1 week ago

Brahmamudi Today May 05: మొత్తానికీ రేఖ, భూషణ్‌లకు దుగ్గిరాల వారి లాయర్ షాకిచ్చాడు. 'మీరు ఇందూతో వేలిముద్రలు వేయించున్నంత మాత్రాన్న ఆస్తి మీకు చెల్లదు..

ఆల్ రెడీ రాజ్, కావ్యలు వేరే వీలునామా రాసి ఆ వివరాలు నా దగ్గరే దాచారు.. ఇందూకి పెళ్లి అయితే ఆస్తి మీద ఇందూకి హక్కు వస్తుంది.. అప్పుడే తన వేలు ముద్రలకు విలువ ఉంటుంది' అని షాకిచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. (photo courtesy by star maa and Jio Hotstar)


Brahmamudi May 05 Episode: బ్రహ్మముడి సీరియల్ ఉత్కంఠగా మారింది. రేఖ వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఇందూతో వేలు ముద్రలు వేయించుకుని.. ఆస్తి చెల్లదని తెలుసుకుని నిస్సహాయంగా వెనుతిరిగింది. దుగ్గిరాల వారి లాయర్ సత్యదేవ్ అనే వ్యక్తి.. రేఖ, భూషణ్‌లకు.. రాజ్, కావ్యల వీలునామా గురించి చెప్పి జలక్ ఇవ్వడంతో.. ఆస్తి దక్కడంలేదని దిగులుతో ఇంటికి చేరతారు రేఖ, భూషణ్‌లు. ఇక మరోవైపు ఇందూ.. స్వాతీ, అపర్ణా దేవి, సుభాష్‌ల ముందు అసలు విషయం రివీల్ చేస్తుంది. 'నాకు తెలుసు.. నాకు ముందే తెలుసు.. నేను వేలు ముద్రలు వేసినంత మాత్రాన్న రేఖ ఆంటీకి ఆస్తి దక్కదు అని. నాకు నిన్న రాత్రే లాయర్ సత్యదేవ్ అంకుల్ కాల్ చేసి.. అమ్మానాన్నలు రాసిన వీలునామా గురించి చెప్పారు. దాని బట్టి నాకు పెళ్లి అయితే కానీ.. రేఖ ఆంటీకి ఆస్తి దక్కదు.. అయినా మొదట్లో నాకు మీ ప్రాణాలే ముఖ్యం అనిపించేది. కానీ మా అమ్మ జీవిత చరిత్ర చదివాక.. మీ ప్రాణాలతో పాటు మన ఆస్తి కూడా నాకు ముఖ్యమే అని అర్థమైంది.. నాకు ధైర్యం వచ్చింది.. రేఖ ఆంటీకి చిల్లుగవ్వ కూడా ఆస్తిని దక్కనివ్వను' అంటూ చెబుతుంది.సంతోషంగా సుభాష్, అపర్ణా దేవీ..

ఇక సత్యదేవ్ కాల్ చేసిన విషయం.. రాజ్, కావ్యలు రాసిన వీలునామా గురించి తెలుసుకున్న స్వాతీ, సుభాష్, అపర్ణా దేవి ముగ్గురూ చాలా సంతోషిస్తారు. 'అమ్మా ఇందూ నిన్ను చూస్తుంటే మీ అమ్మే బతికి వచ్చి మాట్లాడుతున్నట్లు ఉంది.. చాలా సంతోషంగా ఉంది నీలో ఈ ధైర్యాన్ని చూసి' అంటూ సుభాష్, అపర్ణా దేవీలు పొంగిపోతారు. మరోవైపు రేఖ, భూషణ్, భ్రమరాంబలు రగిలిపోతూ.. తలలు పట్టుకుని కూర్చుంటారు. అప్పుడే శేషు మూడు కర్ఛిఫ్‌లు పట్టుకుని వచ్చి.. మొదట భ్రమరాంబ నెత్తిన, తర్వత భూషణ్ నెత్తిన వేస్తాడు.


రాజ్, కావ్యలను పొడిగిన శేషు..

ఇక మరో కర్చిఫ్‌ని శేషు.. నవ్వుతూ రేఖ నెత్తిన వేయడానికి వెళ్తుంటే.. రేఖ కోపంగా హేయ్.. అని అరుస్తుంది. ఆగిపోతాడు. భ్రమరాంబ, భూషణ్‌లు తమ నెత్తిన ఉన్న కర్చిఫ్‌లు తీసి పారేస్తారు. ఇక శేషు.. 'ఆహా .. ఓహో.. అసలు చనిపోయిన అమ్మానాన్నలే ఇప్పుడు ఇందూకి శ్రీరామరక్ష అయిపోయారు కదా.. దేవుడా.. ఎంతైనా ఆ రాజ్, కావ్యల తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను' అంటూ మాట్లాడుతూనే ఉంటాడు శేషు. దాంతో భ్రమరాంబ కోపంగా.. 'శేషు ఆపు.. వచ్చి కూర్చో' అనడంతో వచ్చి కూర్చుని.. ఎలాగో బాధలో ఉన్నారు కదా కాస్త కామెడీ చేద్దాం అనుకున్నాను అంతే.. మరి ఇప్పుడు ఆస్తి మనది కానట్లేగా.. ఏం చేస్తాం ఇంకా?' అంటాడు శేషు.


నాకు మరో ప్లాన్ రెడీ... కంగారుపడొద్దు..

అప్పుడే భ్రమరాంబ.. రేఖ మీద కోపంతో.. 'సగం తెలుసుకుని మమ్మల్ని కూడా ముంచేశావ్.. ఆస్తి వస్తుందని మనం తపిస్తుంటే.. ఇప్పుడు చూడు రేఖా.. నీ వల్ల చిప్ప కూడా మిగిలేలా లేదు.. ఛా' అని తిడుతుంది. 'ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆ ఇందూ కానీ ఆ ముసలి వాళ్లు( సుభాష్, అపర్ణా దేవిలు) కూడా ఊరుకోరు రేఖ' అంటాడు భూషణ్. వెంటనే రేఖ నవ్వుతూ.. 'మీరంతా షాకయ్యేలా నా దగ్గర మరో ప్లాన్ ఉంది.. చూస్తూ ఉండండి.. రేపటి కల్లా ఆ ప్లాన్ అమలు చేస్తాను' అని చెప్పి కూల్‌గా వెళ్లిపోతుంది.


రేఖ కొడుకు ఎంట్రీ..

ఇక సీన్ కట్ చేస్తే మరునాడు ఉదయాన్నే రేఖ కొడుకు మదన్.. దుగ్గిరాల వారి ఇంటి ముందు ఉంటాడు. చుట్టూ రేఖ, స్వప్న కూతురు ఐశ్వర్య, భ్రమరాంబ, శేషు, భూషణ్ ఇలా అంతా ఉంటారు. వెంటనే మదన్.. 'ఏంటి మమ్మీ అమెరికాలో ఉన్న నన్ను రాత్రికి రాత్రి బయలుదేరి ఎందుకు రమ్మన్నావ్' అంటాడు విసుగ్గా. 'నీకు లగ్జరీ లైఫ్ కావాలంటే ఏం కావాలి' అంటుంది రేఖ. 'డబ్బు.. ఈ ఆస్తి' అంటాడు మదన్ కూల్‌గా. 'కానీ ఈ ఆస్తి.. ఇందూకి పెళ్లి అయితే కానీ మనకు దక్కదట' అంటుంది రేఖ. 'అయితే నేనేం చెయ్యాలి.. ఎవరో ఒక తింగరివాడ్ని చూసి ఇందూకి పెళ్లి చెయ్యండి' అంటాడు మదన్.


ఇందూతోనే నీ పెళ్లి.. రేఖ ఫిక్స్..

'ఎవరో ఒకడ్ని తీసుకొచ్చి చేశాకా.. వాడు మనకు వ్యతిరేకంగా మారిపోతే అప్పుడేం చేస్తాం.. అందుకే.. ఇందూని నువ్వే పెళ్లి చేసుకో' అంటుంది కొడుకుతో రేఖ. అంతా షాక్ అవుతారు. 'ఏం మాట్లాడుతున్నావ్' అంటూ ఐశ్వర్యతో సహా అంతా రేఖను ప్రశ్నిస్తారు. మదన్ అయితే.. 'అమ్మో ఆ ఇందూని అది జిడ్డు ముఖం మమ్మీ.. దాన్ని చేసుకుంటే నా ఫ్రెండ్స్ అంతా ఏడిపిస్తారు నన్ను వద్దు మమ్మీ' అంటాడు. అయితే రేఖ కూల్‌గా.. 'ఇంతకు మించి అవకాశం లేదు.. కావాలంటే పెళ్లి అయిన ఏడాదికి విడాకులు ఇప్పిస్తాను.. అప్పటికి ఆస్తి లాక్కుంటే.. దాన్ని విడాకులిచ్చి గెంటెయొచ్చు' అంటుంది రేఖ.


రేపే ఇందూతో నా కొడుకు పెళ్లి..

దాంతో మదన్.. అయిష్టంగానే రేఖ మాటలకు ఒప్పుకుంటాడు. ఇందూని పెళ్లి చేసుకుంటాను అంటాడు. తీరా కమింగ్ అప్‌లో.. పంతుల్ని పిలిపించి ముహూర్తాలు చేపిస్తుంది రేఖ. 'ముహూర్తాలు దేనికీ?' అని అపర్ణా దేవి అడిగితే.. 'ఇందూకి నా కొడుకు మదన్‌తో రేపే పెళ్లి' అంటూ షాకిస్తుంది. అక్కడే ఉన్న ఇందూ బిత్తరపోతుంది. 'రేపే గుడిలో పెళ్లి' అని రేఖ మరోసారి వాళ్లకు క్లారిటీ ఇవ్వడంతో అపర్ణా దేవి, సుభాష్‌లు.. 'ఇది మాకు ఇష్టం లేదు' అని వాదిస్తారు. 'మీ ఇష్టంతో నాకు పనిలేదు.. పెళ్లి జరిగి తీరాలి' అని వార్నింగ్ ఇస్తుంది రేఖ. మొత్తానికీ ఇందూ ఇరుక్కుపోయింది. మరి ఇప్పుడైనా రాజ్ వస్తాడా? ఇందూని కాపాడతాడా? అనేది ఉత్కంఠగా మారింది. నిజానికి ఇందూ.. రాజు భార్య అని చిన్నప్పుడే నిర్ణయించబడింది. చూద్దాం ఇందూ ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam