Chukkala Amavasya 2026: హిందూ మతంలో పుష్య నక్షత్రంలో వచ్చే చుక్కల అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏయే పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆషాఢ అమావాస్య రోజున రావిచెట్టుకు, శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రావి చెట్టు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంది. అలాగే రాగి చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి. అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మాణులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి నుంచి దరిద్రం తొలగిపోయి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు

ఆషాఢ అమావాస్య రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి చెట్టును పూజించడం చాలా ముఖ్యమైనదిగా గ్రంథాలలో పేర్కొనబడింది. ఈరోజున 108 సార్లు తులసి పరిక్రమాలు చేస్తే దరిద్ర్యం తొలగిపోతుందని పండితులు చెబుతారు. మరోవైపు తులసి చెట్టుకు తెల్లవారుజామున నీరు పోసి నుదుటిపై తులసి మట్టితో తిలకం రాయాలి. సాయంత్రం పూట తులసి పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి.
ప్రతికూల శక్తుల నివారణకు

ఆషాఢ అమవాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు, రాళ్ల ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుందని చాలా మంది చెబుతారు. అమావాస్య రోజున సాయంత్రం అర లీటర్ నీటిలో 50 గ్రాముల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
కుటుంబంలో ఐక్యత కోసం

ఆషాఢ అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల, మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని, కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని పండితులు చెబుతారు. అంతేకాదు ఈ పరిహారాన్ని చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి, మీ కోరికలన్నీ నెరవేరొచ్చు. నిరుద్యోగులు ఈ పరిహారం చేయడం వల్ల త్వరలోనే మంచి ఉద్యోగం గురించి శుభవార్తలు వినొచ్చు. ఉదయాన్నే నిమ్మకాయను బాగా శుభ్రం చేసి మీ ఇంట్లోని పూజా గదిలో వేలాడదీయాలి. అనంతరం ఆ నిమ్మకాయను రాత్రి పూట ఏడుసార్లు నిరుద్యోగి తలపై నుంచి దిష్టి తీసేయాలి. అనంతరం ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి, వాటిని ఒక్కో దిక్కులో పడేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
సంధ్యా సమయంలో

చుక్కల అమావాస్య సాయంకాలం సంధ్యా సమయంలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. పత్తికి బదులు కలపనే ఉపయోగించాలి. దీంతో పాటు దీపంలో కొన్ని కుంకుమ పువ్వలు వేయాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుందని పండితులు చెబుతారు. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ''సమయం తెలుగు'' దృవీకరించడం లేదు.
Read Latest Religion News and Telugu News

