Cupid Share: స్టాక్ మార్కెట్లో 'డబ్బులు సంపాదించడం ట్రేడింగ్‌లో లేదు.. వేచి చూడడంలో ఉంటుంది' అనే ఒక సామెత ఉంది. దీనిని నిజం చేస్తూ ఫార్మా, కన్స్సూమర్ గూడ్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ క్యుపిడ్ లిమిటెడ్ (Cupid Ltd) షేరు తమ ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్స్ చూస్తే ఔరా అనాల్సిందే. క్యుపిడ్ స్టాక్ గురించి సమిర్ నందన్ అనే ట్రేడర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్లో ఓపికతో ఉండడం ఎంత లాభమో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
'రూ.5000 పెట్టుబటి రూ.5,50,000 పైన మారింది. ఈ ఆట పూర్తిగా ఓపిక, సహనానికి సంబంధించింది. ఎవరైతా ఓపికతో తమ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ ప్రాసెస్‌ను నమ్మి ముందుకు సాగుతారో దీర్ఘకాలంలో హైరిటర్న్స్ అందుకుంటారు. ఏ మొత్తమూ తక్కువ కాదని నేను మళ్లీ చెప్తున్నాను. అందుకు క్యుపిడ్ లైవ్ ఉదాహరణ.' అంటూ సమిర ప్రధాన్ పోస్ట్ చేశారు. క్యూపిడ్ షేరులో తన పెట్టుబడి వివరాలు పంచుకున్నారు. రూ.5425 పెట్టుబడితో మొత్తం 2500 షేర్లు కొంటే ఇప్పుడు ఆ విలువ 10,071.89 శాతం పెరి రూ.5,46,400 స్థాయికి చేరుకున్నట్లు రాసుకొచ్చారు.
క్యుపిడ్ షేరు ధర
Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం అందించేందుకే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. క్యుపిడ్ కంపెనీ స్టాక్ భారీ ర్యాలీ వివరాలు అందించాం. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. ఎవరికో లాభాలు వచ్చాయని గుడ్డిగా ఇన్వెస్ట్ చేయవద్దు. మార్కెట్ నిపుణుల సలహా తీసుకుని, ఎంచుకునే స్టాక్ గురించి అన్ని వివరాలు ముందే తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.

