Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వివాహ వేడుక.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ సందడి..

డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వివాహ వేడుక.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ సందడి..

Telugu Samayam 3 months ago

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె మోహన వివాహ వేడుక హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ హాల్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్ తో మోహన వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఇటీవల ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా.. జూన్ 1న గ్రాండ్ గా వివాహ వేడుక నిర్వహించారు.

మెహర్ రమేష్ కూతురి వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజెనోవా కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.


* 'అఖండ' కోసం బాలయ్య ఎంత నిష్ఠగా ఉన్నారో.. 'నాగబంధం'కి నేనూ అంతే నియమబద్ధంగా ఉన్నా: హీరో విరాట్ కర్ణ

హీరో వెంకటేష్, దర్శకులు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, ఎన్. శంకర్, వీర శంకర్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, ఏఎం రత్నం, బీవీఎస్ రవి, కోన వెంకట్, మురళీ మోహన్, సి. అశ్వినీదత్, యాంకర్ సుమ కనకాల, ప్రభుదేవా తదితరులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, గంటా శ్రీనివాస్, అంబటి రాంబాబు వంటి రాజకీయ నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.



మెహర్ రమేష్‌కు మెగా ఫ్యామిలీతో బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి పిన్ని కొడుకే మెహర్. అంజనా దేవి, మెహర్ తల్లి సొంత అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచే చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబులతో మెహర్ రమేష్ కి మంచి బాండింగ్ ఉంది. మెగా కుటుంబానికి అన్ని విషయాల్లోనూ మెహర్ చేదోడు వాదోడుగా ఉంటారు. చిరుతో ఆయన 'భోళా శంకర్' అనే రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించారు.

పూరీ జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన మెహర్ రమేష్.. కన్నడలో 'వీరకన్నడిగ', 'అజయ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించారు. తెలుగులో 'కంత్రి', 'బిల్లా', 'షాడో', 'భోళా శంకర్' చిత్రాలను తెరకెక్కించారు. మహేష్ బాబుతోనూ ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. 'బాబీ' సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో మెహర్ రమేష్ నటించారు.
* 'రావు బహదూర్' చూసి మహేష్ బాబు 40 నిమిషాలు మాట్లాడారు.. నా కల నెరవేరింది: హీరో సత్యదేవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam