Government Denies Petrol Hike: కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లుగా వస్తున్న ఊహాగానాల్ని కొట్టిపారేసింది.
మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ విభాగం నుంచి ధరల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదని.. నకిలీ ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫేక్ సోషల్ మీడియా పోస్టుల్ని కోట్ చేస్తూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 'ఈ ఆర్డర్ నకిలీది. భారత ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వుల్ని అసలు జారీ చేయలేదు.' అని అందులో పేర్కొంది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు ఈ నకిలీ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
దేశంలో పెట్రోల్ ధర రూ. 10, డీజిల్ ధర రూ. 12.50 పెరిగినట్లు.. భారత పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నుంచి సర్క్యులర్ వచ్చినట్లుగా ఉన్న ప్రెస్ నోట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీనినే నకిలీది అని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి నకిలీ వార్తల్ని, ప్రకటనల్ని నమ్మొద్దని.. ఇలాంటి వార్తల్ని ధ్రువీకరించుకునేందుకు ఎల్లప్పుడూ అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఛానెళ్లను చూడాలని స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు.. @PIBFACTCHECK టీమ్‌కు ట్యాగ్ చేయాలని కోరింది.
దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.
ఎన్నికల తర్వాత ధరల పెంపు?
నాలుగేళ్ల గరిష్ఠానికి క్రూడాయిల్ ధరలు..

