Dividend Stocks: మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. మీరు స్టాక్ మార్కెట్లో ఈజీ మనీ సంపాదించవచ్చు. కేవలం షేర్లు కొనడం ద్వారానే అదనపు డబ్బులు అందించేందుకు 33 స్టాక్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
ఆయా కంపెనీలు అర్హులైన షేర్ హోల్డర్లకు డివిడెండ్ చెల్లిస్తున్నాయి. ఇందుకోసం జుల్ 3, 2026ను రికార్డ్ తేదీగా ప్రకటించాయి. అంటే ఈ డివిడెండ్ డబ్బులు అందుకునేందుకు అర్హత సాధించాలంటే జులై 2వ తేదీ గురువారం రోజు మార్కెట్లు ముగిసేలోపు ఆయా కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సెబీ T+1 సెటిల్మెంట్ సైకిల్ ప్రకారం ఇన్వెస్టర్లు రికార్డ్ తేదీకి ఒక రోజు ముందే షేర్లు కొనుగోలు చేసి ఉండాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన షేర్లు డీమ్యాట్ ఖాతాల కనిపించేందుకు సమయం పడుతుంది. అందుకే ముందు రోజు కొన్నవారికే అర్హత లభిస్తుంది. అందుకోసమే ఎం అండ్ ఎం, స్వరాజ్ ఇంజిన్స్ వంటి 33 కంపెనీలు అందిస్తున్న డివిడెండ్ సొమ్మును అందుకునేందుకు అర్హత సాధించాలంటే జులై 2వ తేదీ ట్రేడింగ్ ముగిసేలోపు కొనాల్సి ఉంటుంది. ఈరోజు కొన్న షేర్లు శుక్రవారం రోజు డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి కాబట్టి వారికి మాత్రమే అర్హత ఉంటుంది. జులై 3న కొన్నవారికి డివిడెండ్ డబ్బులు రావు.
మహీంద్రా అండ్ మహీంద్రా డివిడెండ్
టెక్ మహీంద్రా, యూబీఐ, శ్రీరామ్ ఫైనాన్స్
- భారత్ ఫోర్జ్ కంపెనీ రూ.6.50 చొప్పున చెల్లిస్తోంది.
- ఎస్కార్ట్స్ కుబోటో కంపెనీ రూ.33 చొప్పున ఇస్తోంది.
- మ్యాక్స్ హెల్త్ కేర్ కంపెనీ రూ.2 చొప్పున చెల్లిస్తోంది.
- రేమాండ్ రియాల్టీ సంస్థ రూ.2 చొప్పున ఇస్తోంది.
- రెడింగ్టన్ కంపెనీ రూ.6 చొప్పున అందిస్తోంది.
- స్వరాజ్ ఇంజిన్స్ కంపెనీ ఒక్కో షేరుకు రూ.110 చెల్లిస్తోంది.
- జేఎస్‌డబ్ల్యూ డలక్స్ కంపెనీ రూ.50 చొప్పున అందిస్తోంది.
- అకుమ్ డ్రగ్స్ రెండు విధాలుగా రూ.3 చొప్పున ఇస్తోంది.
- అలుఫ్లోరైడ్ రూ.4 చొప్పున అందిస్తోంది.
- బాలాజీ అమైన్స్ రూ.11 చొప్పున చెల్లిస్తోంది.
- బీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ రూ.10 చొప్పున ఇస్తోంది.
- బయోకాన్ రూ.0.50 చొప్పున ఇస్తోంది.
- క్యాన్ ఫిన్ హోమ్స్ రూ.8 చొప్పున చెల్లిస్తోంది.
- దాల్మియా భారత్ సుగర్ అండ్ ఇండస్ట్రీస్ రూ.1.50 చొప్పున ఇస్తోంది.
- డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ రూ.0.40 చొప్పున చెల్లిస్తోంది.
- ఎక్సైడ్ ఇండస్ట్రీస్ రూ.2 చొప్పున చెల్లిస్తోంది.
- గ్లోస్టర్ రూ.20 చొప్పున ఇస్తోంది. కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ రూ.8.50 చొప్పున ఇస్తోంది.
- గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ రూ.0.40 చొప్పున అందిస్తోంది.
- ఇండస్ ఫైనాన్స్ రూ.0.60 చొప్పున చెల్లిస్తోంది.
- ఆన్‌వార్డ్ టెక్నాలజీస్ రూ.8 చొప్పున అందిస్తోంది.
- సాగర్ సాఫ్ట్ రూ.1.50 చొప్పున చెల్లిస్తోంది.
- ఎస్‌కేఎఫ్ ఇండియా ఇండస్ట్రియల్ రూ.10 చొప్పున పే చేస్తోంది.
- ఎస్‌కేఎఫ్ ఇండియా రూ.40 చొప్పున చెల్లిస్తోంది.
- ఎస్ఎంఎల్ మహీంద్రా రూ.23.50 చొప్పున అందిస్తోంది.
- థెర్మాక్స్ రూ.20 చొప్పున చెల్లిస్తోంది.
- ట్రాన్స్ కార్ప్ ఇంటర్నేషనల్ రూ.0.40 చొప్పున అందిస్తోంది.
- ఎల్‌స్పన్ ఎంటర్ ప్రైజెస్ రూ.3 చొప్పున ఇస్తోంది.
- సిద్దికా కోటింగ్స్ రూ.4 చొప్పున చెల్లిస్తోంది.
Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం ఇచ్చేందుకే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. స్టాక్ మార్కెట్ అంటే హైరిస్క్ తో కూడుకుని ఉంటుంది. డివిడెండ్ వస్తుందని పెట్టుబడి పెడితే స్టాక్ పడిపోతే నష్టపోవాల్సి వస్తుంది. ఎంచుకున్న స్టాక్ గురించి అన్ని వివరాలు ముందుగానే తెలుసుకోవడం మంచిది.

