Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో పేదలకు 'అమ్మహస్తం' తరహా రేషన్ పథకం

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో పేదలకు 'అమ్మహస్తం' తరహా రేషన్ పథకం

Telugu Samayam 5 hrs ago

ఎల్‌నినో ప్రభావం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన 'అమ్మహస్తం' తరహా ఉచిత/ సబ్సిడీ రేషన్ పథకాన్ని పునరుద్దరించే ఆలోచనలో ఉంది.

2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్న డి. శ్రీధర్ బాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. రేషన్ షాపుల ద్వారా గోధుమలు/ అట్టా, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం, పసుపు, ఉప్పు వంటి నిత్యావసరాలను సబ్సిడీపై ఈ పథకం ద్వారా అందించారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రేషన్ (PDS) వ్యవస్థ ద్వారా గోధుమ పిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం తదితర నిత్యావసర వస్తువులను తిరిగి పంపిణీ చేసే దిశగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొడానికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉప-సంఘాన్ని ఏర్పాటు చేసింది. కరువు పరిస్థితులను ఎదుర్కొడానికి ఈ కమిటీ సూచనలు, సలహాలు అందజేయనుంది.

పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం తెలంగాణపై అధికంగానే ఉంది. 1951 తర్వాత తొలిసారి ఆ స్థాయిలో ఎల్ నినో ఉగ్రరూపం దాల్చినట్టు వాతావరణ సంస్థలు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య తీవ్ర అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని లేకుంటే.. భారీ నష్టం తప్పదని అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు కార్యాచరణను ప్రారంభించాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం ఎల్ నినోను ఎదుర్కొడానికి సిద్ధమైంది. నీటి పొదుపు చర్యలను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam