ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముల్లాన్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో రెండు జట్లూ కూడా తుది జట్టులో ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.
సన్ రైజర్స్ ప్రఫుల్ హింగేన బరిలోకి దించింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్.. రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు కల్పించింది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది
మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచులో ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. దీంతో ఆర్సీబీ ఐపీఎల్ 2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే..
ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ 23 మ్యాచ్‌లలో ఆడాయి. అందులో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ కేవలం 9 మ్యాచ్‌లలోనే గెలిచింది. ఈ ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు..
సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సమరన్ రవిచంద్రన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఎషాన్ మలింగ, షాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే
ఇంపాక్ట్ ప్లేయర్లు: సలీల్ అరోరా, అనికేత్ వర్మ, లివింగ్ స్టోన్, హర్ష్ దూబె, హర్షల్ పటేల్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవాన్ ఫెరీరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేశ్ శర్మ, యశ్ రాజ్ పుంజా
ఇంపాక్ట్ ప్లేయర్లు: శుభమ్ దూబె, సుశాంత్ మిశ్రా, అమన్ రావ్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే

