టాలీవుడ్ 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్, 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
గతంలో వీరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కాంబోలో మరో ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కబోతోంది. భారతీయ ఇతిహాసాల నేపథ్యంతో 'గాడ్ ఆఫ్ వార్' (God of War) అంటూ ఒక భారీ పౌరాణిక యాక్షన్ డ్రామాను తెరకెక్కించేందుకు మేకర్స్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. స్కంద పురాణంలోని కార్తికేయుడి (సుబ్రహ్మణ్యస్వామి) గాథను ఆధారంగా చేసుకుని ఈ కథను త్రివిక్రమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
* ఓవర్‌గా రియాక్ట్ అవ్వకు.. నీ పనేంటో నువ్వు చూసుకో - ప్రకాష్‌రాజ్‌కి బండ్ల గణేష్ కౌంటర్
బాలీవుడ్ సీనియర్ హీరోతో త్రివిక్రమ్ స్కెచ్
ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన మరియు కథను మలుపు తిప్పే ప్రత్యేక పాత్ర ఉన్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ఈ పాత్ర కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోను రంగంలోకి దించాలని చిత్ర బృందం భావిస్తోందట. సదరు హిందీ సీనియర్ హీరో నటిస్తే సినిమాకు జాతీయ స్థాయిలో మరింత మైలేజ్ రావడంతో పాటు, ఉత్తరాది మార్కెట్‌లోనూ భారీ క్రేజ్ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఆ బాలీవుడ్ స్టార్ పోషించబోయే పాత్ర కథలో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అది థియేటర్లలో ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌లా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాకుండా, కథలోని దైవిక అంశాలకు తగ్గట్టుగా మరికొందరు ప్రముఖ నటీనటులు దేవుళ్ల పాత్రల్లో సర్‌ప్రైజ్ అతిథులుగా మెరవనున్నారని టాక్. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, లోతైన ఎమోషన్స్‌తో విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలచబోతున్నారు.
* వాళ్ల రేంజ్ మారిపోయింది.. అందుకే కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు - రాధా రవి
వివాదంలో ప్రాజెక్ట్.. సీమాన్ తీవ్ర హెచ్చరికలు
ఒకవైపు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, మరోవైపు ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఒక వివాదం ముసురుకుంది. ఈ చిత్రంపై తమిళనాడుకు చెందిన 'నామ్ తమిళర్ కట్చి' (NTK) పార్టీ ముఖ్య నేత, ప్రముఖ దర్శకుడు, నటుడు సీమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్తికేయుడు (మురుగన్) తమిళుల ప్రాచీన ఆది దైవమని, ఆయన సంస్కృతితో తమిళులకు విడదీయరాని బంధం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, కార్తికేయుడు ఉత్తరాది రాష్ట్రంలో జన్మించారనే తప్పుడు భావన కలిగేలా ఈ చిత్ర బృందం ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. కల్పనాత్మక సృజన పేరుతో చరిత్రను, దైవిక అంశాలను వక్రీకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేకర్స్‌ను హెచ్చరిస్తూ సీమాన్ ఒక ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

