Dailyhunt
ఏపీ రైలు ప్రయాణికులకు గమనిక.. ఆ ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ ఇక రెగ్యులర్, పూర్తి వివరాలివే

ఏపీ రైలు ప్రయాణికులకు గమనిక.. ఆ ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ ఇక రెగ్యులర్, పూర్తి వివరాలివే

Telugu Samayam 2 weeks ago

పీలో ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది.. ఏపీలో పలు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ చేసింది. సికింద్రాబాద్ - అనకాపల్లి (17043/17044), నరసాపురం - తిరుపతి (17427/17428) స్పెషల్ రైళ్లను రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తూ ఉత్తర్వులు చేశారు.

సికింద్రాబాద్ - అనకాపల్లి (17043/17044) రైలు చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలిలో ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైలు ప్రతి ఆదివారం ఉంటుంది.. అనకాపల్లి నుంచి వెళ్లే రైలు ప్రతి సోమవారం అందుబాటులోకి ఉంటాయి. నరసాపురం - తిరుపతి (17427/17428) రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లులో ఆగుతాయి.

చర్లపల్లి నుంచి అనకాపల్లికి నడిచే మరో రైలును (17045/17046) కూడా రెగ్యులర్ చేశారు. ఈ రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలిలో ఆగుతాయి. కాకినాడ టౌన్-లింగపల్లి మరో రైలును (12775/12776) రెగ్యులర్ చేశారు. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, బెగంపేటలో ఆగుతాయి. తిరుపతి నుంచి అకోలకు మరో రైలును (17429/17430) రెగ్యులర్ చేశారు. ఈ రైలు పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్డు, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్డు, మహబూబ్‌నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, హజుర్ సాహిబ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి డెక్కన్, వాషిమ్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.
రైళ్ల లిస్ట్
తిరుపతి చర్లపల్లి మధ్య మరో రైలును (17441/17442) రెగ్యులర్ చేశారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్డు, మిర్యాలగూడ, నల్గొండలో ఆగుతుంది. మరో రైలును తిరుపతి చర్లపల్లి (17443/17444) మధ్య రెగ్యులర్ చేశారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్డు, మిర్యాలగూడ, నల్గొండలో ఆగుతుంది.

చర్లపల్లి అనకాపల్లి మధ్య మరో రైలును (17053/17054) రెగ్యులర్ చేశారు. ఈ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలిలో ఆగుతుంది. చర్లపల్లి నరసాపురం మధ్య మరో రైలును (17061/17062) రెగ్యులర్ చేశారు. ఈ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లులో ఆగుతుంది. వీటితో పాటుగా మరికొన్ని రైళ్లను రెగ్యులర్ చేశారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam