Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఈ జిల్లాలలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

ఏపీ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఈ జిల్లాలలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

Telugu Samayam 3 months ago

విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆగస్ట్ ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భోగాపురం ఎయిర్‌‍పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు శనివారం (ఆగస్ట్ ఒకటి) సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సెలవుకు బదులుగా మరో రోజు ఎప్పుడైనా కాంపన్సేటరీ వర్కింగ్ డేగా మారుస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు విజయనగరం జిల్లాలో శుక్రవారం కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇచ్చారు.

మరోవైపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతోంది. ఈ కార్యక్రమం కోసం చుట్టుపక్కల ఉన్న 34 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సుమారుగా 4800 బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. సభా ప్రాంగణంలో పది పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. 30 వైద్య శిబిరాలు, 22 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.

ఇక భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం బస్సులకు బయల్దేరే సమయంలో పులిహోర, పొంగల్, టమాటా బాత్ వంటి అల్పహారం, మంచినీళ్లు అందిస్తారు. మధ్యాహ్నం సభ పూర్తి అయిన తర్వాత.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల ద్వారా భోజన ఏర్పాట్లు చేశారు.

ఇందుకోసం పదికి పైగా ప్రత్యేక భోజన స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయం చేరుకుంటారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటుగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపడతారు. మధ్యాహ్నానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుని ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam