ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆహారశుద్ధి, ఫుడ్ బిజినెస్, ఆక్వా రంగాల్లో మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రొడక్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.