Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్పీ ఆఫీస్ పక్కనే దొంగతనం.. మొత్తం దోచేశారు, ఒంగోలులో వరుస చోరీలు!

ఎస్పీ ఆఫీస్ పక్కనే దొంగతనం.. మొత్తం దోచేశారు, ఒంగోలులో వరుస చోరీలు!

Telugu Samayam 1 week ago

పోలీసులు ఆ ఏరియాల్లో ఉన్నారంటే కాస్త టెన్షన్ పడుతుంటాం.. మనం తప్పు చేసినా, చేయకపోయినా టెన్షన్ టెన్షన్‌గానే ఉంటాం. దొంగలయితే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు.

అలాంటిది ఎస్పీ ఆఫీస్ పక్కనే దొంగతనం చేసి పోలీసులకే సవాల్ విసిరారు ఆ దొంగలు. షట్టర్ పగులగొట్టి మరీ అందినకాడికి దోచుకుని వెళ్లారు. దాంతో ఏం చేయాలో అర్థంగాక పోలీసులు తలలు పట్టుకుని కూర్చున్నారు.

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు ఎస్పీ కార్యాలయం ప్రధాన ద్వారం పక్కనే ఉన్న దుకాణంలో దొంగతనం జరిగింది. దాంతో ఒక్కసారిగా నగరం అలెర్ట్ అయింది. ఇదే కాకుండా వరుసగా చోరీలు జరగడంతో ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే వరుస చోరీలు జరుగుతుండటంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

READ ALSO రొట్టెల పండగకి వెళ్లిన కుటుంబం.. ఇంటికి తిరిగొచ్చేసరికి ఊహించని షాక్, తేరుకునేలోపే గుడ్ న్యూస్


పది మీటర్ల దూరంలోనే ఎస్పీ కార్యాలయం మెయిన్ గేట్.. ఇంకో 200 మీటర్ల దూరంలో తాలూకా పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ప్లేస్‌లో ఉన్నామంటే మనం ఎంత సేఫ్‌గా ఉంటామో చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మంగళవారం రాత్రి స్థానిక శివసాయి ఎంటర్‌ప్రైజెస్ దుకాణం షట్టర్ పగులగొట్టి మరీ దొంగలు లోపలికి ప్రవేశించి, రూ. 40 వేల నగదును అపహరించుకుని వెళ్లారు. గతంలో ఇదే ప్రాంతంలో రెండుసార్లు చోరీలు జరగడం గమనార్హం.

అదేవిధంగా కర్నూలు రోడ్డులోని వర్మ గ్రాండ్ హోటల్ సమీపంలోని భూలక్ష్మి కార్ డెకార్స్‌లోనూ ఇదే తరహా చోరీకి పాల్పడ్డారు. షట్టర్‌ను పగలగొట్టి మరీ కౌంటర్‌లో ఉన్న రూ. 36 వేల నగదును అపహరించారు. బుధవారం ఉదయం ఓనర్లు షాప్‌కి వచ్చి తాళాలు తీసే సమయానికి దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కొప్పోలు రోడ్డులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో బుధవారం పట్టపగలే దొంగతనం జరిగింది. నాలుగో లైన్‌లో నివసించే గుర్రం వరలక్ష్మి అనే మహిళ మార్కాపురం జిల్లా కనిగిరిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే, సాయంత్రానికి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెకు సమాచారం ఇచ్చారు. బీరువాలోని రూ. 50 వేలు చోరీకి గురైనట్లు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలా ఒకే రోజు వరుస దొంగతనాలు జరగడంతో ఒంగోలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam