Dailyhunt
ఫలించిన 15 ఏళ్ల నిరీక్షణ.. అభిషేక్ శర్మ రేంజ్‌లో స్పెషల్ నోట్‌తో రఘు శర్మ సెలబ్రేషన్స్

ఫలించిన 15 ఏళ్ల నిరీక్షణ.. అభిషేక్ శర్మ రేంజ్‌లో స్పెషల్ నోట్‌తో రఘు శర్మ సెలబ్రేషన్స్

Telugu Samayam 2 days ago

క్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రఘు శర్మ సెలబ్రేషన్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌పై సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ శర్మ ఏ రేంజ్‌లో అయితే ఓ చిటీ మీద రాసుకొచ్చి మరీ సెలబ్రేషన్స్ చేశాడో..

రఘు శర్మ కూడా అదేలా సెలబ్రేషన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

మ్యాచ్ అనంతరం అందరూ అసలు ఎవరీ రఘు శర్మ. ఎందుకు ఇలా రాసుకొచ్చాడు. 15 ఏళ్ల ఎదురుచూపులకు ఇన్నాళ్లకు బ్రేక్ పడింది అంటూ తనకు అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్‌కు థాంక్స్ చెబుతూ ఆ నోట్‌లో పేర్కొన్నాడు. 33 ఏళ్ల రఘుశర్మ ఐపీఎల్ కెరీర్‌లో తన రెండో మ్యాచ్ ఆడి మొదటి వికెట్ తీసుకున్న సందర్భంగా ఒక చీటీ మీద రాసుకొచ్చి తన ఆనందాన్ని తెలియజేశాడు.

పంజాబ్‌లోని జలంధర్‌కి చెందిన రఘు శర్మ 33 సంవత్సరాల వయస్సులో ఐపీఎల్‌లో అవకాశం పొందాడు. దేశీయ ఆటగాళ్లను పైకి తీసుకు రావడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ మరోసారి ఈ మట్టిలోని మాణిక్యాన్ని వెలుగు తీసింది. ఆల్‌మోస్ట్ కెరీర్ ఎండ్ అయ్యే సమయంలో కొనుగోలు చేయడమే కాకుండా వరుసగా రెండు మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చింది. దాంతో ముంబైకి థాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ రాసుకొచ్చాడు.


"ఆ దేవుడు దయవల్ల పదిహేను సంవత్సాల ఎదురుచూపులకు ఇప్పటికీ బ్రేక్ వచ్చింది. తనకు ఈ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్‌కి రుణపడి ఉంటాను" అంటూ రాధే రాధేతో మొదలుపెట్టి జై శ్రీరామ్‌తో ముగించాడు.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రఘు శర్మ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. లక్నో డెబ్యూ ప్లేయర్ అక్షత్ రఘువంశీని కాట్ అండ్ బౌల్ చేసి కెరీర్‌లో తన తొలి వికెట్ దక్కించుకున్నాడు. సీఎస్కే మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రఘు శర్మ చెన్నైపై కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో రాణిస్తున్న రఘు శర్మకు ముంబై మరిన్ని ఛాన్స్‌లు ఇచ్చే అవకాశం ఉంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam