Dailyhunt
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా? మూడేళ్ల వ్యవధికి ఎస్బీఐ సహా ఏ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా? మూడేళ్ల వ్యవధికి ఎస్బీఐ సహా ఏ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Telugu Samayam 2 weeks ago

Banks FD Rates: మీరు సంపాదించే దాంట్లో నుంచి పొదుపు చేస్తూ.. పెట్టుబడులు పెడుతున్నారా? పెట్టుబడుల కోసం మరి ఏం ఎంచుకుంటున్నారు.. ఇక్కడ మన కోసం చాలానే ఆప్షన్లు ఉంటాయి.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి మొదలుకొని పోస్టాఫీస్ పథకాలు, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏది ఎంచుకున్నామనేదే ముఖ్యం. పెట్టుబడి సామర్థ్యం, రిస్క్, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి.. ఎంత ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది. అయితే ఎలాంటి రిస్క్ లేనివి అంటే పోస్టాఫీస్ పథకాలు.. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ఇక్కడ పోస్టాఫీస్ పథకాల్లో అందరికీ వడ్డీ రేట్లు ఒకేలా ఉంటాయి. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్లు అయితే సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు సుమారు 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ వస్తుంది.

>> ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి మంచి పొదుపును ప్రోత్సహించడంతో పాటుగా.. స్థిర ఆదాయం వచ్చేలా ఉంటుంది. రిస్క్ కోరుకోని సీనియర్ సిటిజెన్లు ఇంకా ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. ఇక్కడ కాల పరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో కంటే ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటి కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇంకాస్త ఎక్కువ వడ్డీ అందుతుంది.

ఇప్పుడు 3 సంవత్సరాల వరకు వ్యవధి డిపాజిట్లపై సీనియర్ సిటిజెన్లకు వడ్డీ రేట్లు ఎందులో ఉన్నాయో తెలుసుకుందాం. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై అత్యధికంగా మూడేళ్ల వ్యవధిపై 8 శాతం వడ్డీ అందిస్తుంది. ఇక్కడ టెన్యూర్ రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు వ్యవధి డిపాజిట్లపై సీనియర్ సిటిజెన్లకు ఈ వడ్డీ వర్తిస్తుంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 375 రోజుల నుంచి 400 రోజుల వ్యవధి ఎఫ్‌డీపై 8 శాతంగా వడ్డీ రేటు ఉంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో అధికంగా 30 నెలల ఎఫ్‌డీ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. ఐదేళ్లకు ఇక్కడ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది.

మూడేళ్ల డిపాజిట్లపై ఇతర బ్యాంకుల్లో చూస్తే ఎస్బీఐలో 2-3 ఏళ్ల వ్యవధి డిపాజిట్ వడ్డీ రేట్లు 6.90 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రెండేళ్ల 11 నెలల ఒక రోజు నుంచి 3 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6.95 శాతంగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకులో 2 ఏళ్ల ఒక రోజు నుంచి 3 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6.95 శాతంగానే ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులోనూ వడ్డీ రేట్లు ఇదే స్థాయిలో ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam