Ghatkesar Couple Suicide Twist: ఐదు రోజుల క్రితం ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలో ఊహించని, అత్యంత షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బియ్యం వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని పక్కింటి దంపతులే మానసికంగా, ఆర్థికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మతం మారాలంటూ వాళ్లు చేసిన తీవ్రమైన ఒత్తిళ్లు, అది కుదరకపోవడంతో వ్యాపారం పేరిట ఏకంగా రూ. 20 లక్షలు వసూలు చేసి మోసగించడం వల్లే రవికుమార్, శిరీష దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా మృతుల కుమారులు సుశాంత్, విద్వాన్స్, అలాగే శిరీష తల్లిదండ్రుల నుంచి పోలీసులు వివరాలు సేకరించగా ఈ విస్తుపోయే విషయాలు వెల్లడి అయ్యాయి.
మత మార్పిడి వేధింపుల వల్లే..!
మతం మారలేదని రూ. 20 లక్షల మోసం
ఇల్లు ఖాళీ చేసినా వదలని పైశాచికత్వం..!
పక్కింటి వారి వేధింపులను భరించలేక రవికుమార్ దంపతులు.. తమ సొంత ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోని సామాన్లన్నీ మూటలు కట్టి సిద్ధం చేసుకున్నారు. అయితే జూలై 2వ తేదీ సాయంత్రం ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోకి వెళ్లిన దంపతులు.. ఆత్మహత్యకు సరిగ్గా అరగంట ముందు కూడా నిందితుడు వెంకట్‌తో ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. ఆ ఫోన్ కాల్ ముగిసిన వెంటనే మనస్తాపంతో రవికుమార్, శిరీష దంపతులు ఒకరినొకరు హత్తుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా దంపతుల మరణవార్త తెలియగానే నిందితులు వెంకట్, ప్రమీల తమ ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
