నువ్వుంటే నా జతగా సీరియల్‌ని అర్దాంతరంగా ముగించేసిన సంగతి తెలిసిందే. ఆ సీరియల్‌లో అర్జున్ కళ్యాణ్, అనుమితా దత్తా జంటగా నటించారు. కథ మధ్యలో హీరోయిన్‌కి నచ్చలేదని, అందుకే కథను అటూ ఇటూ తిప్పి మధ్యలోనే ముగించారు అని అర్జున్ కళ్యాణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
సీరియల్ స్టార్టింగ్‌లో అందరికీ ఇంట్రెస్ట్ కలగాలి, అందరూ చూడాలనే ఉద్దేశంతో కొంత మంది సెలెబ్రిటీలను తీసుకు వస్తారు.
తండ్రిగా, తల్లిగా కొంత ఫేమస్ అయిన స్టార్ సెలెబ్రిటీలను తీసుకు వస్తారు. అలా రాజా రవీంద్రను గతంలో జానకి కలగనలేదు సీరియల్‌లో తీసుకున్నారు. ఆ తరువాత ఆ పాత్ర చనిపోయినట్టుగా, ఆ ఫోటోని చూపిస్తూనే సీరియల్ అంతా లాగించేశారు. ఇక ఇప్పుడు కూడా అలానే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. గోదావరి ప్రోమోని చూస్తుంటే కొన్ని ఎపిసోడ్స్ వరకే రాజా రవీంద్ర ఉండేలా కనిపిస్తున్నాడు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోని చూస్తుంటే కథకు సంబంధించిన హింట్స్‌ను వదిలారు. నలుగురు కూతుళ్లు, వారి జీవితాల్లో జరిగే సంఘర్షణ ఈ సీరియల్‌కి ప్రాణంలా కనిపిస్తోంది. మహానది అనే కన్నడ సీరియల్‌కు రీమేక్‌గా ఈ గోదావరి సీరియల్‌ను రూపొందించారని తెలుస్తోంది.
ఇక ఈ సీరియల్‌లో పెద్ద కూతురు, హీరోయిన్ పాత్రలో అనుమితా దత్తా కనిపించనున్నారు. నువ్వుంటే నా జతగా తరువాత అనుమితా రెండో సీరియల్ ఇదే. మరి ఈ సీరియల్ అయినా పూర్తి స్థాయిలో నడుస్తుందా? లేదా? అన్నది చూడాలి.
ఇక నలుగురు కూతుళ్లు, వారికి సమస్యలు, పెళ్లి విషయంలో ఏర్పడే మనస్పర్థలు, పిల్లల జీవితాల్లో జరిగే ఘటనలకు తండ్రి మనస్థాపం చెంది కన్ను మూసినట్టుగా కనిపిస్తోంది. తండ్రి లేకున్నా కూడా తండ్రి స్థానంలోకి అక్క వచ్చి ఆ కుటుంబాన్ని ఎలా నడిపిస్తుంది.. చెల్లెళ్ల పెళ్లి విషయంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో సీరియల్‌ను ముందుకు నడిపించేలా ఉన్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ సీరియల్‌ను సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం చేయనున్నారు. నిండు మనసులు సీరియల్‌ను చిన్ని స్థానంలో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ గోదావరి సీరియల్ తెలుగు ఆడియెన్స్‌ను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam