Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold Prices: ఒక్కరోజులో సీన్ రివర్స్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు హైదరాబాద్‌లో రేట్లు ఇవే

Gold Prices: ఒక్కరోజులో సీన్ రివర్స్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు హైదరాబాద్‌లో రేట్లు ఇవే

Telugu Samayam 2 weeks ago

Gold Prices: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, అమెరికా ఇన్‌ఫ్లేషన్, జాబ్ డేటా, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ పుంజుకోవడం వంటి చాలా అంశాలు బంగారం ధరలు పడిపోయేందుకు కారణమవుతున్నాయి.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు పెరుగుతాయన్న భయాలూ బంగారం ధరలను పడేస్తున్నాయి. జూన్ నెలలో పసిడి ధరలు ఏకంగా 13 శాతం మేర పడిపోయిన సంగతి తెలిసింది. ఇప్పుడు జులై నెల ప్రారంభంలోనూ ధరలు దిగిరావడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే, పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం రేట్లలో ఎప్పుడు ఏ మార్పు ఉంటుందో సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. జులై 2వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త చల్లారడంతో బంగారం రేట్లు పెరిగాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 39 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4064 డాలర్ల వద్దకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.57 శాతం మేర పెరిగి 59.78 డాలర్ల స్థాయికి ఎగబాకింది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1260 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ. 1,40,780 వద్దకు తగ్గింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1150 మేర తగ్గడంతో తులం రేటు రూ. 1,29,050 వద్దకు దిగివచ్చింది.

వారం రోజులుగా స్థిరంగానే వెండి

బంగారం ధరల్లో భారీ మార్పులు జరుగుతున్నా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గత వారం రోజులుగా సిల్వర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 2,45,000 మార్క్ వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది. అయితే గ్లోబ్ల మార్కెట్లో ధరలు పెరిగిన క్రమంలో దేశీయంగానూ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Update: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి బంగారం ధరలు సడెన్ షాకిచ్చాయి. దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు జులై 2వ తేదీన ఉదయం 10 గంటల తర్వాత మారాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఏకంగా రూ. 3770 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 1,44,550 వద్దకు దూసుకెళ్లింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ. 3450 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ. 1,32,500 వద్దకు చేరింది. మరోవైపు.. వారం నుంచి స్థిరంగా ఉన్న వెండి ధరలు ఇవాళ రూ. 5000 పెరిగాయి. దీంతో కిలో వెండి రేటు రూ. 2,50,000 మార్క్ తాకింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam