Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold Rate Today: గుడ్‌న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. ఆగస్టు 28న హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే?

Gold Rate Today: గుడ్‌న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. ఆగస్టు 28న హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే?

Telugu Samayam 1 month ago

Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. దేశీయంగా బంగారం ధరలు వరుస సెషన్లలో దిగివస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.

ఈ సమయంలో బంగారం, వెండి రేట్లు తగ్గడం కొనుగోలుదారులకు భారీ ఊరటగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడం, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, అమెరికా జాబ్స్ డేటా వంటి పలు అంశాలు బంగారం ధరలు దిగివచ్చేందుకు కారణమవుతున్నాయి. వరుసగా రెండు సెషన్లలో బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో రేట్లు దిగిరావడం దేశీయంగా ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఆగస్టు 28వ తేదీన గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో బంగారం, వెండి రేట్లు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు క్రితం సెషన్‌లో తులానికి రూ.220 తగ్గగా ఈరోజు మరో రూ.770 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,62,980 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు రెండు సెషన్లలో రూ.900 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ.1,49,400 వద్దకు పడిపోయింది. ఇక వెండి రేటు రెండు రోజుల క్రితం రూ.10 వేలు తగ్గి అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలోకు రూ.2,65,000 వద్ద అమ్ముడవుతోంది.

విజయవాడ, విశాఖలో బంగారం, వెండి రేట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన వాణిజ్య నగరాలైన విశాఖపట్నం, విజయవాడలో ఈరోజు పసిడి రేట్లు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.700 తగ్గి రూ.1,49,400 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ.770 తగ్గి రూ.1,62,980 వద్ద ట్రేడవుతోంది. అలాగే కిలో వెండి రేటు రూ.2,65,000 మార్క్ వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.

గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో మళ్లీ తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఈరోజు మరో 13 డాలర్ల మేర తగ్గింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4584 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయితే, సిల్వర్ ధర మాత్రం మరింత పెరిగింది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.26 శాతం మేర పెరిగి 68.91 డాలర్ల వద్దకు చేరింది.

గమనిక: పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు ఉదయం పది గంటల తర్వాత మారవచ్చు. అలాగే ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. కొనుగోలు చేసే ముందు స్థానికంగా ఉండే రేట్లు తెలుసుకుని కొనడం మంచిది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam