Gold Rate Today: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో బంగారం ఒక భాగమైపోయింది.
పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పర్వదినాలు అంటూ ప్రత్యేకదినాల్లో బంగారం కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే మన దేశంలో ఏడాది పొడవునూ బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారత్ నిలుస్తోంది. అయితే గత ఏడాది కాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో కాస్త దిగివచ్చినా ఇప్పుడు మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. గత వారం రోజుల్లో భారీగా పెరిగిన పసిడి రేట్లు ఈరోజు మాత్రం భారీగా దిగివచ్చాయి. ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో పసిడి రేట్లు, ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో బంగారం, వెండి రేట్లు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఈరోజు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఏకంగా రూ.2890 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,58,240 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.2650 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,45,050 వద్దకు దిగివచ్చింది. మరోవైపు కిలో వెండి రేటు ఈరోజు రూ.5000 మేర తగ్గింది. దీంతో కిలో సిల్వర్ ధర రూ.2,60,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది.విజయవాడ, విశాఖలో బంగారం వెండి రేట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు భారీగానే తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు తులానికి రూ. 2890 మేర తగ్గడంతో తులం రేటు రూ.1,58,240 వద్దకు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఒక్కరోజే రూ.2650 మేర పడిపోయింది. దీంతో తులం ధర రూ.1,45,050 వద్దకు తగ్గింది. ఇక వెండి ధర చూసుకుంటే ఈరోజు రూ.5000 మేర తగ్గి కిలోకు రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు
అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు భారీగానే తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు (31 గ్రాములు) 24 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4453 డాలర్ల వద్దకు తగ్గింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.98 శాతం తగ్గడంతో 66 డాలర్ల వద్దకు తగ్గింది.| లోహం | హైదరాబాద్ | విజయవాడ | విశాఖపట్నం |
| బంగారం (24 క్యారెట్లు) | రూ.1,58,240 | రూ.1,58,240 | రూ.1,58,240 |
| బంగారం (22 క్యారెట్లు) | రూ.1,45,050 | రూ.1,45,050 | రూ.1,45,050 |
| వెండి (కిలో) | రూ.2,60,000 | రూ.2,60,000 | రూ.2,60,000 |
గమనిక: పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు ఆగస్టు 30వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. బులియన్ మార్కెట్లో ధరలు ఉదయం 10 గంటల తర్వాత మారిపోతుంటాయి. కొనుగోలు చేసే వారు స్థానికంగా ఉండే ధరలను తెలుసుకోవడం మంచిది.

