Gundeninda Gudigantalu Serial Today Episode గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ప్రభావతి నోరు అదుపు తప్పుతుంది. రాఖీ కట్టడానికి వచ్చిన శివని, మీనాని తక్కువ చేసి మాట్లాడుతుంది.
ఇక మౌనిక ఇంటికి బాలు వెళ్తే.. అక్కడ వీడి చేతులు విరిచేస్తారు అని ప్రభావతి అంటుంది. మా ఆయన చేతులు విరిచే మగాడు ఉన్నాడు.. ఇటుకెత్తి కొట్టానంటే.. పుచ్చలేచిపోద్ది అని మీనా ఫైర్ అవుతుంది. ఏంటే రౌడీలా మాట్లాడుతున్నావ్ అని భయపడిపోద్ది ప్రభావతి.
ఏదో చిన్న తప్పు చేస్తే నువ్వు నన్ను మోసగత్తె అని ముద్ర వేస్తావా? అని బాలుతో రోహిణి అంటుంది. అమ్మ నిన్ను కొట్టింది.. తిట్టింది.. అప్పుడే మర్చిపోయావా? అని బాలు కౌంటర్లు వేస్తాడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు రా అని బాలుని సత్యం అంటాడు. నాన్నా.. వాడికి నోరు ఎక్కువ అవుతోంది అని మనోజ్ అంటాడు. అమ్మని ఎలా అన్నావో.. వాడ్ని కూడా నోరు మూసుకోమని చెప్పు నాన్నా అని సత్యంతో మనోజ్ గురించి బాలు అంటాడు. ఇక ఇంతలో బాలుని పక్కకి తీసుకు వెళ్తుంది మీనా. అత్తయ్య గారు చెప్పినట్టు మౌనికకు చాలా పని ఉందేమో.. అందుకే రావడం లేదేమో అని అంటుంది మీనా. లేదు.. నా చెల్లి ఎంత పని ఉన్నా కూడా ఈ రోజు ఇక్కడకు వస్తుంది.. మాకు రాఖీ కడుతుంది అని బాలు అంటాడు. ఇక అందరూ హాల్లోనే మౌనిక కోసం ఎదురు చూస్తుంటారు. నిజంగానే మౌనిక పెళ్లి తర్వాత మారిపోయిందా? ఇక రాదా.. ఇంట్లో నిజంగానే పని ఎక్కువగా ఉండి ఉంటుందా? వచ్చి రాఖీ కట్టదా? అని బాలు తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఎంతసేపు రా అని మనోజ్ అంటాడు. నేను అసలే బిజీ పర్సన్.. బిజినెస్ మెన్ అని అంటాడు మనోజ్. పార్కులో పడుకున్నప్పుడు తెలీదా? అని బాలు అంటాడు. వెయిట్ చేయడం తప్పు కాదు.. ఏ టైంకి వస్తుందో కూడా తెలియాలి కదా అని శ్రుతి అంటుంది. ఇంతలో శివ వస్తాడు.చెప్పులు ఇచ్చి మరీ కొట్టించుకోవడం

మళ్లీ ఏం పట్టుకుపోదాం అని వచ్చాడు.. ముందేమో బైక్.. ఆ తర్వాత నా బ్యాగ్ అని శివ గురించి ప్రభావతి అంటుంది. ఈ సారి మా అమ్మని ఎత్తుకెళ్లరా.. ఆ గోదాట్లో పారేసి రారా శివ అని అంటాడు బాలు. రేయ్ అని ప్రభావతి అంటుంది. మన ఇంట్లోనే దొంగల ముఠాని పెట్టుకుని వాడ్ని అంటున్నావా? అని బాలు తిడతాడు. దీన్నే చెప్పులు ఇచ్చి మరీ కొట్టించుకోవడం అంటారు.. కాస్త నోటికి తాళం వేస్తావా? అని తిడతాడు సత్యం. ఇంటికి వచ్చిన గెస్టుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలీదు అని శ్రుతి తిడుతుంది.
కామాక్షి అత్త ఇంటికి వెళ్లి రా

ప్రతీ ఏడాది నువ్వు రాఖీ కట్టిన తర్వాతే నేను బయటకు వెళ్లేదాన్ని కదా అక్కా.. నువ్వు రాలేకపోతావే ఏమో అని నేనే వచ్చా.. అని శివ అంటాడు. నేను కూడా రావాలనే అనుకున్నా రా.. కానీ పని ఎక్కువగా ఉండి రాలేదు. నీ కోసం రాఖీ కూడా కొని పెట్టి ఉంచా అని అంటుంది మీనా. అబ్బో అంటూ ప్రభావతి గారాలు తీస్తుంటుంది. నువ్వు చూడలేకపోతే కాసేపు కామాక్షి అత్త ఇంటికి వెళ్లి రా అని బాలు అంటాడు. లేకపోతే నోటికి తాళం వేసుకుని ఉండు అని సత్యం ఫైర్ అవుతాడు.
రూపాయా? అంటూ చిన్న చూపు..

శివకి రాఖీ కడుతుంటుంది మీనా. మనోజ్, రోహిణి, ప్రభావతి మొహాలు మాత్రం మాడిపోయినట్టుగా పెడతారు. ఇక శివ డబ్బులు తీసి హారతి పళ్లెంలో పెడతారు. ఓ రూపాయి కాయిన్ కింద పడుతుంది. డబ్బులు, డబ్బులు అనుకుంటూ ఆత్రుతగా వెళ్తుంది ప్రభావతి. రూపాయా? అని తీసి పారేస్తుంది ప్రభావతి. అయినా వీళ్ల గురించి తెలిసి.. బంగారు కాయిన్ పెడతారని అనుకున్నా చూడు నాది తప్పు అని ప్రభావతి అంటుంది. ఎంత పెట్టారని కాదు.. ప్రేమతో ఏం ఇచ్చారన్నది చూడాలి. మేం ఎంత పెట్టినా సరే దాని మీద రూపాయి ఇవ్వడం అలవాటు.. అందుకే మా తమ్ముడు వంద మీద రూపాయి ఇచ్చాడని అంటుంది మీనా.
పూల వ్యాపారమే కదా..

ఎప్పుడూ ఇలా ఆరోగ్యంగా ఉండాలి రా అని శివను దీవిస్తుంది మీనా. ఎందుకు ఇంకా దోచుకోడానికా? అని గుణుగుతుంది ప్రభావతి. ఏంటి? అని సత్యం అంటే.. ఏం లేదు అని ప్రభావతి అంటుంది. నువ్వెప్పుడూ ఇలానే మీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి అని సత్యం అంటాడు. ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నాడు నాన్నా అని శివ గురించి అంటాడు బాలు. పూల వ్యాపారమే కదా.. పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడు అని కౌంటర్లు వేస్తుంది ప్రభావతి. ఇక నేను వెళ్లి వస్తానక్కా అని అంటాడు శివ. ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి రా అని మనోజ్ అంటాాడు.
రాజ భోగాలు అనుభవిస్తోంది..

నాలాంటి బిజీ బిజినెస్ మెన్ ఎంత సేపు వెయిట్ చేయాలి అని మనోజ్ అంటాడు. రేయ్ కొడతారా అని బాలు అంటే.. ఎప్పుడు వస్తారో తెలీకుండా ఎంత సేపు వెయిట్ చేస్తామని మనోజ్ అంటే.. అది కూడా కరెక్ట్ కదా అని రవి అంటాడు. అంతే అంటావా అని బాలు అంటాడు. నేను అదే మాట అంటే నువ్వు కోప్పడ్డావ్ కదా అని ప్రభావతి అంటుంది. అయినా నా కూతురు అక్కడ రాజ భోగాలు అనుభవిస్తోంది.. కూర్చుంటే పని మనుషులు, ఇంటి నిండా ఏసీ.. అని ప్రభావతి గొప్పగా చెప్పుకుంటుంది.
ఏంటి అలా చూస్తున్నావ్.. తగ్గు..

మీరు, మీ అబ్బాయి కూడా ఇదే రాజ భోగాల్ని అనుభవించాలని అనుకున్నారు.. రోహిణి నిజంగానే మలేషియాలో పుట్టి ఉంటే.. కోట్లు ఉండుంటే.. వాళ్ల నాన్న బతికి ఉండుంటే.. ఆ కోట్లన్నీ తెచ్చుకుని.. అలానే బతకాలని అనుకున్నారు కదా.. కాకపోతే మీరు ఊహల్లోంచి బయటకు వచ్చారు.. రియాల్టీ తెలిసిపోయింది కదా అని అంటుంది శ్రుతి. దీంతో గుర్రుగా చూస్తుంది రోహిణి. ఏంటి అలా చూస్తున్నావ్.. తగ్గు.. ఆంటీనే లెక్క చేయను.. నువ్వు కోపంగా చూస్తే భయపడిపోతానా? అని అంటుంది శ్రుతి. దీంతో రోహిణి సైలెంట్ అవుతుంది.
పుచ్చ లేచిపోద్ది..

మరి మౌనిక రాదా?అని బాలు అడిగితే.. శివ వచ్చినట్టు మీరు కూడా అక్కడికే వెళ్లండని మీనా అంటుంది. వాడు అక్కడికి వెళ్తే చేతికి రాఖీ కాదు.. ఆ చేతిని విరిచేస్తారు.. కట్టు కట్టుకుని వస్తాడు అని ప్రభావతి అంటుంది. నా మొగుడి మీద చేతి వేసే మగాడు ఉన్నాడా? తీసుకు రండి.. చూస్తా.. ఇటుకెత్తి కొట్టానంటే పుచ్చలేచిపోద్ది.. అని మీనా ఫైర్ అవుతుంది. ఏంటే.. రౌడీలా మాట్లాడుతున్నావ్ అని భయపడుతుంది ప్రభావతి. నా భర్త జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోను.. వాడి చేతిని విరిచేస్తా అని అంటుంది మీనా. ఒకసారి ఆంటీ మీద ట్రై చేద్దామా? అని శ్రుతి కామెడీ చేస్తుంది.
మా ఆయనకు అదే పని..

వీడు అక్కడికి వెళ్తే ఏం గొడవ చేస్తాడో.. అని భయంగా ఉంది. ఇప్పటి వరకు ఆరు నెలలకి ఒకసారైనా మౌనిక ఇంటికి వస్తోంది.. వీడు ఇప్పుడు వెళ్లి గొడవ చేస్తే ఎలా అని ప్రభావతి అంటుంది. మా ఆయనకు అదే పని.. తెల్లారి లేస్తే గొడవలు పడటమే అని మీనా అంటుంది. నువ్వు ఎవరిని అంటున్నావే అని ప్రభావతి అంటుంది. బాలునే.. మిమ్మల్ని అన్నట్టుగా అనిపించిందా? ఆంటీ అని శ్రుతి కౌంటర్లు వేస్తుంది. లాస్ట్ ఇయర్ అల్లుడు వస్తే.. మన బాలునే కదా.. బాగా చూసుకున్నాడు.. మర్యాదలు చేశాడు అని సత్యం అంటాడు.
సరే నాన్నా.. మాట ఇస్తున్నా..

రేయ్ బాలు నాకు ఒక మాట ఇస్తావా.. అక్కడ ఉంది నీ చెల్లి.. అది నీ చెల్లి అత్తిల్లు.. అక్కడకు వెళ్లేది రాఖీ కట్టించుకోడానికి మాత్రమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడొద్దు సరేనా అని సత్యం అంటాడు. సరే నాన్నా.. మాట ఇస్తున్నా.. నేను అక్కడ ఎలాంటి గొడవలు పడను అని అంటాడు బాలు. ఈ చీర ఇవ్వండని బాలుకి మీనా ఇస్తుంది. ఐదు వేల కంటే తక్కువ పెడితే బాగోదు అని రవికి శ్రుతి వార్నింగ్ ఇస్తుంది. నేనేమైనా మనోజ్ గాడిలా పిసినారి అనుకున్నావా? అని రవి అంటాడు. నువ్వు కూడా తగ్గొద్దు మనోజ్ అని రోహిణి అంటే.. నీకు అవసరమా? నువ్వు సలహాలు ఇవ్వకు.. నా ప్లానింగ్స్ నాకున్నాయ్ అని మనోజ్ అంటాడు.
నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి.. ప్రమోషన్స్ చేసుకుంటా

ఇంకో సంజు అక్కడ పోజులు ఇస్తుంటాడు. నీలకంఠం ఏమో సంజు యువజన నాయకుడు అవుతున్నాడు.. ఎమ్మెల్యేని చేయాలని వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుంటాడు. చూశారా అత్తయ్య.. నేను బయటకు వెళ్తానని పార్టీ ఆఫీసులో పెట్టాల్సిన ప్రోగ్రాం మన ఇంటి ముందే పెట్టాడు అని సువర్ణతో మౌనిక అంటుంది. ఇంతలో బాలు, మనోజ్, రవి దిగుతారు. అంత దూరం నుంచి రావడం అవసరమా? అని మనోజ్ అంటే.. నీకు ఇష్టం లేకపోతే రాకు అని బాలు అంటాడు. రేయ్ చాలా మంది ఉన్నారు.. నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి.. ప్రమోషన్స్ చేసుకుంటా అని మనోజ్ కక్కుర్తి పడతాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 'పొదరిల్లు' టుడే ఎపిసోడ్: ఆదికి రాఖీ కట్టిన మహా.. అన్నాచెల్లెళ్ల కంటతడి.. చివరి క్షణంలో తారుమారు

