Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gundeninda Gudigantalu Serial Today August 5th Episode: రోహిణి చాప్టర్ క్లోజ్.. ఏం బతుకే నీది.. పీక పట్టుకుని పిసికేసిన ప్రభావతి

Gundeninda Gudigantalu Serial Today August 5th Episode: రోహిణి చాప్టర్ క్లోజ్.. ఏం బతుకే నీది.. పీక పట్టుకుని పిసికేసిన ప్రభావతి

Telugu Samayam 5 days ago

Gundeninda Gudigantalu Serial 2026 August 5th Episode Preview గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో బుధవారం నాటి ఎపిసోడ్‌లో రోహిణి బండారం బట్టబయలైంది.

మాణిక్యంను ఇంటికి తీసుకు వస్తాడు బాలు. రోహిణి చేసిన మోసాలు, చెప్పిన అబద్దాలు, వేయించిన నాటకాలకు సంబంధించిన నిజాల్ని మాణిక్యం చెబుతాడు. మాణిక్యం చెప్పిన విషయాలకు ప్రభావతి, మనోజ్ షాక్ అవుతారు. భార్య చేతిలోనే మోసపోయా రా నేను పెద్ద ఫూల్‌ని అని మనోజ్ బాధ పడుతుంటాడు. ఇక ప్రభావతి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది.


పెళ్లి కొడుకు మేనమామ అని చెప్పాను కదా.. మీకు సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశాడ్రా అని బాలు, మీనాలతో రంగా చెప్తాడు. ఇంతలో పూల దండలు పట్టుకుని బ్యాండ్ మేళంతో మాణిక్యం వస్తాడు. అలా మాణిక్యంను చూసి బాలు, మీనా షాక్ అవుతారు. ఇతనే పెళ్లి కొడుకు మేనమామ.. మాణిక్యం.. ఇక్కడే ముప్పై ఏళ్ల నుంచి మటన్ కొట్టు ఉంది.. మనకు కావాల్సినట్టుగా చౌకకు ఇస్తాడు.. పెళ్లి మొత్తాన్ని ఇతనే చూసుకున్నాడు.. భోజనం కూడా ఈయనే చేశాడు.. మటన్ కొట్టు మాణిక్యం అని కూడా అంటారు.. ఈయనకు నాటకాలు వేయడం కూడా తెలుసు.. సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నాడు అని మాణిక్యం గురించి రంగా, కామాక్షి చెబుతుంటారు. ఇక మాణిక్యం మలేషియా మామగా చేసిన చేసిన ఓవర్ యాక్షన్‌ను బాలు గుర్తు చేసుకుంటాడు. మాకు ఎంత చక్కటి మామ దొరికాడు.. మలేషియా మాయమైంది. అస్తికలు వచ్చాయి.. ఇప్పుడు ఇలా దొరికావ్.. అసలు సన్మానం చేయాల్సింది మాకు కూడా మామకే అని ఆ దండలు మాణిక్యం మెడలో వేస్తాడు బాలు. మా ఇంటికి తీసుకు వెళ్తా మామయ్య అని మాణిక్యంని తీసుకు వెళ్తాడు బాలు.రోహిణికి చెలికత్తేలా కూడా మీనా పని చేయదు

ఛీ ఛీ నా స్థాయి.. ఏంటి.. పూలమ్ముకునే దాని స్థాయి.. ఏంటి అని ప్రభావతి అటూ ఇటూ తిరుగుతూ చిరాకు పడుతుంటుంది. ఇంతలో సత్యం వస్తాడు. మనకు ముగ్గురు కోడళ్లు సమానమే అని సత్యం అంటే.. ఏంటి.. మలేషియాలో పుట్టిన రోహిణికి, బస్తీలో పుట్టిన మీనాది ఒకటేనా? ఏం మాట్లాడుతున్నారు.. చనిపోయిన వాళ్ల నాన్న ఆస్తి కేస్ క్లోజ్ అయితే.. మలేషియా మామ.. ఆ ఆస్తిని మనకు పువ్వుల్లో పెట్టి ఇస్తే.. రోహిణికి చెలికత్తేలా కూడా మీనా పని చేయదు అని ప్రభావతి ఓవర్ చేస్తుంటుంది. ఇంత అహంకారమా? అని సత్యం తిట్టేలోపు బాలు, మీనా వస్తారు. ఏమే కాఫీ ఇవ్వాలని తెలీదా? అని వచ్చిన మీనాతో దురుసుగా మాట్లాడుతుంది ప్రభావతి.


చీపురు కట్టతో కొట్టింది..

కాఫీయా.. మీ మలేషియా కోడలు పెడుతుంది.. అని మీనా అంటుంది. పెళ్లి ఎలా జరిగింది.. అని విశేషాలు అడుగుంటే.. మన ఇంట్లో కూడా ఓ పెళ్లి జరుగుతుంది నాన్నా.. అని అందరినీ పిలుస్తాడు బాలు. అమ్మ కోసం వాటర్ బాటిల్ రెడీగా పెట్టు.. అంబులెన్స్‌కి ఫోన్ చేసి పెట్టు.. అని బాలు అంటాడు. ఏంట్రా అలిసిపోయి పడుకుంటే పిలుస్తావ్ అని మనోజ్ అంటాడు. ఏం పని చేశావ్ అని రా అలిసిపోతావ్ అని బాలు తిడతాడు. ఏమైంది అన్నయ్య అని రవి అడుగుతాడు. ఏమైంది కోట్ల ఆస్తి కలిసి వచ్చిందా? పూలమ్ముకునే వాళ్ల అమ్మ.. కోట్లు పంపించి ఉంటుంది అని రోహిణి అంటుంది. ఇలా ఎగతాళి చేసినందుకు ఒకరిని వీధిలో చీపురు కట్టతో కొట్టింది మా అమ్మ.. పిలవాలా? అని మీనా అంటుంది.


మేక మందలో పట్టి..

నిజంగానే రోహిణికి సన్మానమా? అని శ్రుతి అంటే.. శ్రుతి అని అరుస్తుంది రోహిణి. ఏంటి అరుస్తున్నావ్.. నీ మొహానికి అంత లేదు.. నీ నోటికి మూత పడే రోజు వచ్చింది.. అని మీనా అంటుంది. అప్పుడేనా? ఇంకా పాత్రను ప్రవేశ పెట్టనేలేదు అని బాలు అంటాడు. వీళ్లిద్దరికీ ఏదో అయింది.. హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోండి అని రోహిణి అంటుంది. అవును.. ఆల్రెడీ ముగ్గురు పట్టేంత అంబులెన్స్ రెడీగానే పెట్టా.. అని బాలు అంటాడు. ఎవరా ముగ్గురు అని రవి అంటే.. నాలుగో వ్యక్తి వచ్చాక తెలుస్తుందని బాలు అంటాడు. ఎవరా నాలుగో వ్యక్తి అని శ్రుతి అడిగితే.. మేక మందలో పట్టి.. మలేషియా వరకు ఎదిగిన.. శ్రీ శ్రీ మేక మామ.. మలేషియా మాణిక్యం గారు.. విచ్చేండయ్యహో.. అని అంటాడు బాలు.


మలేషియాలో మనం కేసు గెలిచినట్టేనా?

మాణిక్యంని చూసి.. మీరా ఎప్పుడు వచ్చారు అని ప్రభావతి అడుగుతుంది. ఇప్పుడే.. పార్లరమ్మ తండ్రి వాడకుండా వదిలేసిన విమానంకి పంక్చర్ వేసుకని.. ఎయిర్ పోర్టులో ఎకరం కొని.. ఇలా ల్యాండ్ అయ్యాడు.. అంతే కదా మేక మామ.. అని బాలు అంటాడు. మీ మొహం కళకళలాడుతోంది.. అంటే మలేషియాలో మనం కేసు గెలిచినట్టేనా? అని ప్రభావతి ఆశగా అడుగుతుంది. ఆ వచ్చినట్టే.. సొంత విమానంలో నోట్ల కట్టలు సరిపోవడం లేదని, అద్దె విమానం తీసుకుని మరీ వస్తున్నారు.. అని బాలు అంటాడు. నేను పెట్టుబడి కోసం కొన్ని లక్షలు అడిగాను.. ఆస్తి మొత్తం ఇప్పుడు మనకే వచ్చిందా? అని మనోజ్ ఆశపడతాడు.


మామయ్య.. నువ్వు ముందు వెంటనే వెళ్లిపో

అసలు ఇదంతా ఏంటి అని సత్యం, రవి అంతా అడుగుతారు. మామయ్య.. మీరు ఏ హోటల్‌లో దిగారో.. ఆ హోటల్‌కి వెళ్లిపోండి.. నేను అసలు మీతో మాట్లాడదల్చుకోలేదు అని రోహిణి అంటుంది. ఎందుకు అని రోహిణిని మనోజ్ అడిగితే.. ఈయన ఆస్తి కోసం వేసిన కేసుల్ని ఫాలో అవ్వడం లేదు అని రోహిణి అంటుంది. అవునా? మేకమామ అని ఏమీ తెలియనట్టుగా నాటకం ఆడతాడు బాలు. అలా చేయడం తప్పు కదా? అని బాలు అంటే.. ఎవ్వరూ కూడా కోసిన మేకను మళ్లీ మళ్లీ కోయరు బాలు అని మాణిక్యం అంటాడు. మామయ్య.. నువ్వు ముందు వెంటనే వెళ్లిపో అని రోహిణి అంటే.. మాణిక్యంను బాలు ఆపుతాడు. కదిలితే కాళ్లు విరిచేసి.. నీతోనే పాయ సూప్ చేయిస్తా అని బాలు వార్నింగ్ ఇస్తాడు.


ఆ మలేషియా భ్రమ నుంచి బయటకు రాలేదా?

ఈ గాడిద కొడుకు ఎవరో తెలుసా? సుందరిని పెళ్లి చేసుకున్న కిషోర్ మేనమామ.. అని బాలు నిజం చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీరు సుందరి వాళ్లకి చుట్టాలు అవుతారా? అని ప్రభావతి ఇంకా భ్రమలోనే ఉంటుంది. నువ్వు ఇంకా ఆ మలేషియా భ్రమ నుంచి బయటకు రాలేదా? అని బాలు తిడతాడు. వీడు ఫ్రాడ్ అని బాలు అంటే.. వాడు వీడు ఏంట్రా.. తాగొచ్చావా? అని ప్రభావతి అంటే.. లేదు.. కాసేపు ఆగితే మీరే నీళ్లు తాగుతారు అని మీనా కౌంటర్ వేస్తుంది. రంగారావు మామ మనకు పరిచయం చేస్తానన్న పెళ్లి కొడుకు మేనమామ ఇతనే నాన్నా అని సత్యంకి బాలు చెప్తాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇద్దరూ ఒక్కరేనా? అని రవి, మనోజ్ అడుగుతారు.


నిజం బయట పెట్టడానికి ఫ్రాడ్ పార్లరమ్మ

రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. ఆయన రోహిణి మేనమామ.. మలేషియాలో ఇంపోర్ట్స్, ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు అని మనోజ్ అంటాడు. మటన్ కొట్టు మాణిక్యం రా.. అని బాలు అంటాడు. కావాలనే మా మామయ్యని అవమానిస్తున్నారు అని రోహిణి అంటే.. మరి మీ మామ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు అని బాలు అంటాడు. అసలేం జరుగుతోంది రా అని సత్యం, ప్రభావతి అడుగుతాడు. ఇంత జరుగుతుంటే ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావ్ మామయ్య అని రోహిణి అంటుంది. నిజం బయట పెట్టడానికి ఫ్రాడ్ పార్లరమ్మ అని బాలు అంటాడు. అందరూ వినండి.. ఇతను మలేషియా మేనమామ కాదు.. కనీసం ఇతనికి పాస్ పోర్ట్ కూడా లేదు.. నేను ఊహించినట్టుగానే మన ఊర్లోనే మటన్ కొట్టు.. అని నిజాలు చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది.


ఆ రోజు మాస్క్ పెట్టుకున్నాడు..

దీంతో ప్రభావతి, మనోజ్ నీళ్లు తాగుతారు. ఈ కొత్త కథ ఏంటి? అని శ్రుతి అడుగుతుంది. కొత్త కథ కాదు.. అసలు కథ.. నోరు ఎత్తితే మలేషియా కోడలు, కోట్లు తెచ్చే కోడలు అని అనే అత్తయ్య అవాక్కయ్యారే.. అని మీనా అంటుంది. పూలు అమ్ముకునే నన్ను పక్కన పెట్టి.. మోసగత్తెని నమ్మినందుకు నిజం మింగుడు పడటం లేదా? అని మీనా అంటుంది. రంగారావు చెప్పిన మాటల్ని సత్యం గుర్తు చేసుకుంటాడు. నేను కూడా మటన్ తీసుకు వచ్చా.. కానీ ఆ రోజు మాస్క్ పెట్టుకున్నాడు.. ఇంకోసారి రోడ్డు కనిపిస్తే ఫాలో అయ్యా.. కానీ మిస్ అయ్యాడు.. మీ అబ్బాయికి కూడా చెప్పా అని మీనా అంటుంది. నాకు కళ్లు తిరుగుతున్నాయ్.. మీరు నిజం చెప్పండి.. రోహిణికి మేనమామ కాదా? అని అడుగుతుంది ప్రభావతి.


నాలుగు మేకలు, ఆరు గొర్రెలు అనే జీవితం నాది

కాదు.. అని మాణిక్యం అంటాడు. అయ్యా.. బాలు చెప్పిందంతా నిజం.. మలేషియా మొఖం కూడా తెలీదు.. రోహిణి మేనమామని కాను.. సుందరి భర్తకి మేనమామని అని నిజం చెప్తాడు మాణిక్యం. అంటే ఆ ఆస్తికలు అని అడుగుతాడు మనోజ్. అది మా మేక తలకాయ అస్తికలు.. అని మాణిక్యం చెబుతాడు. గొర్రె కోసేవాడ్ని.. నమ్మినట్టు.. మీరు నన్ను నమ్మారు.. నేను మిమ్మల్ని ఏనాడూ మోసం చేయలేదు.. చేసిందంతా మీ కోడలే.. అని మాణిక్యం అంటాడు. ఇదంతా ఎందుకు చేశారు అని సత్యం అడిగితే.. నాలుగు మేకలు, ఆరు గొర్రెలు అనే జీవితం నాది.. ఒకరోజు విద్య.. ఈ రోహిణిని తీసుకు వచ్చింది.. మలేషియా మామ పాత్ర అని చెప్పి.. నన్ను తీసుకు వచ్చారు..


నాటకం నడిపించింది రోహిణియే..

మలేషియా మామలా రమ్మన్నారు.. అందుకే మీ ఊరికి వచ్చా.. సినిమా అవకాశాల కోసం అలా చేశాను.. కానీ ఈ ప్రభావతి గారు ఆస్తి కోసం ఒత్తిడి తెచ్చినప్పుడల్లా.. నన్ను మలేషియా నుంచి రప్పించినట్టుగా.. రప్పించేది.. తండ్రి జైల్లో ఉన్నాడని చెప్పించింది రోహిణియే.. చనిపోయాడని బూడిద తెప్పించింది రోహిణియే.. నాటకం నడిపించింది రోహిణియే.. అని మాణిక్యం చెప్తాడు. ఇక ప్రభావతి మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మాణిక్యం, రోహిణి కలిసి చేసిన నాటకాల్ని మనోజ్, ప్రభావతి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏంటి అత్తయ్య.. ఇప్పుడేమీ మాట్లాడటం లేదే అని మీనా అంటుంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam