Gundeninda Gudigantalu Serial 2026 April 14 Episode కామాక్షి ఇంట్లోని రెండు లక్షలను మీనాయే దొంగతనం చేసిందని ప్రభావతి నిందలు వేసిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత గుణ గ్యాంగ్ మీనాని కిడ్నాప్ చేసేలా రోహిణి ప్లాన్ వేసింది. అయితే బాలు మాత్రం చాకచక్యంగా మీనాని కాపాడేశాడు. ఆ తరువాత కామాక్షి ద్వారా బాలు, మీనాలు నిజం తెలుసుకున్నారు. ప్రభావతి కాస్తా లక్షావతి అయిందని బాలు, మీనాలు ఇంట్లో నిజం బయట పెట్టారు. దీంతో ఆ రెండు లక్షల సంగతి గురించి ప్రభావతిని సత్యం నిలదీశాడు. ఆ తరువాత చివరకు వాటిని దొంగిలించిన రోహిణినే సాయం చేయమని ప్రభావతి అడుగుతుంది.
:చెడపకురా చెడేవు అంటే ఇదే.. ప్రభావతి దెబ్బకు ఇరుకున పడ్డ రోహిణి.. రెండు లక్షల కోసం ఏం చేసిందంటే?" title="Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 14 ఎపిసోడ్:చెడపకురా చెడేవు అంటే ఇదే.. ప్రభావతి దెబ్బకు ఇరుకున పడ్డ రోహిణి.. రెండు లక్షల కోసం ఏం చేసిందంటే?" />గుణ అండ్ గ్యాంగ్ నుంచి మీనాని బాలు కాపాడి ఇంటికి తీసుకు వస్తాడు. అప్పటికే ఆ రెండు లక్షలు లాయర్ నుంచి ప్రభావతి తీసుకున్న విషయాన్ని బాలు, మీనాలు తెలుసుకుంటారు. ఇక ఈ విషయం మీద ఇంట్లో అందరి ముందు ప్రభావతిని బాలు, మీనాలు కడిగిపారేస్తారు. అసలు నిజం తెలుసున్న సత్యం తన భార్య ప్రభావతికి పనిష్మెంట్ ఇస్తాడు. నీ వల్ల జరిగిన నష్టం మొత్తం అంటే ఐదు లక్షల్ని బాలుకి ఇవ్వాల్సిందే అని ప్రభావతిని సత్యం హెచ్చరిస్తాడు. దీంతో డబ్బు సాయం కావాలని చివరకు రోహిణినే అడుగుతుంది ప్రభావతి. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు దొంగతనం చేసిన దొంగే చివరకు ఆ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో కర్మ సిద్దాంతం, కర్మ ఈజ్ బ్యాక్ అనే దాన్ని చూపించాడు. ఇక రోహిణి డబ్బు కోసం ఏం చేసింది? రోహిణి స్నేహితురాలు విద్య చెప్పిన మంచి మాటలు ఏంటి? దొంగతనం చేసిన చోటుకే వెళ్లి మళ్లీ డబ్బుని ఇచ్చేందుకు కామాక్షితో రోహిణి మాట్లాడిన మాటలు ఏంటి? అసలు ఈ రోజు ఎపిసోడ్‌లో బాలు, మీనాలు ఏం చేశారు? ఎలా సాగిందో చూద్దాం.భార్యను నిలదీసిన సత్యం..

'ఎక్కడిది ఆ డబ్బు? నాదా? కాదు.. మనోజ్‌దా?.. కాదు.. కోడళ్లదా?.. కాదు.. కామాక్షిది కూడా కాదంటున్నావ్.. మరి ఆ డబ్బు ఎక్కడిది.. ఎవరింట్లో దొంగతనం చేశావ్? అని ప్రభావతిని సత్యం నిలదీశాడు. 'ఏమండీ.. ప్రాణం పోయినా నేను ఆ పని చేయను' అని ఎంతో అమాయకంగా భర్త సత్యంకి చెప్పింది ప్రభావతి. ఇంతలో మీనా అందుకుని 'నేను కూడా ప్రాణం పోయినా ఆ పని చేయను.. మరి నన్నెందుకు దొంగని చేశారు?' అని ప్రభావతిని అడిగింది. 'మీ తమ్ముడు దొంగతనం చేయలేదా? బండి ఎత్తుకుపోలేదా?' అని ప్రభావతి ప్రశ్నించింది. ఆ తప్పు తెలుసుకుని.. క్షమించమని అడగడానికి వస్తే దొంగతనం మోపలేదా? అప్పుడు దొంగతనం చేసింది ఎవరు? హనీమూన్ టికెట్ల కోసం నీ పెద్ద కొడుకు దొంగతనం చేశాడు? మరి నన్ను ఇప్పుడు దొంగని ఎందుకు అనాలి.. మనోజ్ ఆ దొంగతనం చేసి ఉండొచ్చు కదా? నాది దొంగల కుటుంబం అయితే.. నా నగలు తీసి మీరు మీ పెద్ద కొడుక్కి ఇచ్చారు.. 40 లక్షలు ఎత్తుకుపోయారు.. ఇంటి పత్రాలు ఎవ్వరికీ తెలియకుండా తీసుకెళ్లి తాకట్టు పెట్టారు.. ఎవర్ని దొంగ అంటున్నారు.. ఎవరిది దొంగల కుటుంబం అంటున్నారు.. అని ప్రభావతిని కడిగి పారేసింది మీనా. 'ఏయ్..' అని ప్రభావతి రెచ్చిపోతోంటే.. 'ఆ.. ఏంటి?..' అని రివర్స్‌లో అనే సరికి ప్రభావతి బిత్తరపోయింది. 'నోరు పెద్దది చేస్తే తగ్గుతానని అనుకున్నారేమో.. మంటలో ఎవ్వరినీ లెక్క చేసేదే లేదు' అని మీనా తెగేసి చెప్పింది. ఇక ఇంతలో బాలు అందుకుని.. 'ఇంతకీ ఆ రెండు లక్షలు కామాక్షి అత్తవేనా?' అని ప్రభావతిని అడిగేశాడు. 'చెప్పండి అత్తయ్య గారు.. అవి ఎక్కడి నుంచి వచ్చాయో నేను చెప్పనా?.. మావయ్య.. మా తమ్ముడి మీద పెట్టిన కేసుని ఎందుకు వెనక్కి తీసుకున్నారో తెలుసా? ' అని సత్యంని మీనా అడిగింది.
రెండు లక్షలు పోయాయ్ అని కేసు పెడదాం..

'మీ తమ్ముడి చదువు, భవిష్యత్తు పాడవుతుందని..' అని సత్యం చెప్పే లోపు.. మీనా ప్రభావతి నిజ స్వరూపాన్ని బయటపెట్టేసింది. 'అత్తయ్య గారికి అంత మంచి మనసు లేదు.. నా పుట్టింటి మీద అంత జాలి, దయ, కరుణ ఏమీ లేవు' అని మీనా చెప్పింది. 'ఆ కేసుని వెనక్కి తీసుకునేందుకు లాయర్ దగ్గర అమ్మ రెండు లక్షలు తీసుకుంది' అని బాలు అసలు నిజం చెప్పాడు. 'మేం చచ్చీ చెడీ నాలుగున్నర లక్షలు జమ చేసి లాయర్‌కి ఇస్తే.. అందులో రెండు లక్షలు తీసుకున్న అత్తయ్య గారిని ఏమనాలి? అపర త్యాగమూర్తి అనాలా? ఒక వేళ లాయర్ రెండు లక్షలు ఇవ్వకపోతే.. మా తమ్ముడిని జైలుకి పంపించేవారు.. అవునా?' అని మీనా ఎమోషనల్ అయింది. 'వీడు (మనోజ్) నలభై లక్షలు తీసుకెళ్లినప్పుడు.. నగలు ఎత్తికెళ్లినప్పుడు వెనకేసుకు వచ్చావ్.. అప్పుడు నీ (ప్రభావతి) మీద ఎన్ని కేసులు పెట్టాలి?.. అంత ఎందుకు.. ఆ రెండు లక్షలు పోయాయ్ అని కేసు పెడదాం.. అవి నిజంగానే పోయాయా? నా భార్యని దొంగని చేసేందుకు అబద్దం ఆడుతున్నావో బయట పడుతుంది?' అని బాలు అనడంతో ప్రభావతికి ఏం చేయాలో తోచలేదు. 'చెప్పమ్మ.. మామూలు టైంలో అందరినీ దబాయిస్తుంటావ్ కదా? ఇప్పుడెందుకు ఇలా సైలెంట్‌గా ఉన్నావ్' అని రవి.. 'శివ మీద కేసు వెనక్కి తీసుకున్నప్పుడు ఆంటీ.. అంత మంచి పని ఎలా చేస్తుందా? అని అనుకున్నా.. రెండు లక్షలు లంచం తీసుకుని కేసు వెనక్కి తీసుకుందా? బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?' అని శృతి అంటుంది. 'మా అమ్మని అంటారేంటి? అది లాయర్ ఇచ్చిన రెండు లక్షలు.. అవి ఎత్తుకెళ్లింది ఎవరు?' అని మనోజ్ అంటే.. 'మీరే.. అవి మీరే ఎత్తుకెళ్లారు.. ఆ దొంగ బుద్ది మీకే ఉంది' అని మీనా ఫైర్ అయింది. 'అవును.. ఆ రెండు లక్షల కేసుతో పాటుగా.. మన నగలు ఎత్తుకెళ్లారనే కేసు కూడా పెడదాం.. 40 లక్షల కేసు కూడా ఉంది' అని బాలు, మీనాలు బెదిరించారు. 'ఆ నలభై లక్షలు రికవరీ అయ్యాయ్ అని తెలిస్తే.. నన్ను నడి బజార్లో నిలబెట్టి అమ్మేస్తాడు వీడు' అని బాలు గురించి మనోజ్ తనలో తాను మాట్లాడుకున్నాడు. 'మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావ్.. మామయ్య గారు ఉన్నారు కదా?' అని మనోజ్‌ని రోహిణి అడ్డుకుంది.
పరువునష్టం దావా వేస్తా..

'అవును.. ఆ డబ్బు లాయర్ ఇచ్చాడు.. ముందు నేను కేసుని ఒప్పుకోలేదు.. కానీ లాయర్ మాత్రం యాభై వేలు, లక్ష ఇస్తాను అన్నాడు.. రెండు లక్షలు ఇస్తాను అన్నాడు.. డబ్బు వస్తుందంటే ఎవరు కాదంటారు.. ఆ రెండు లక్షలు తీసుకున్నాను.. కామాక్షి ఇంట్లో దాచి పెట్టాను' అని సిగ్గు లేకుండా చెప్పింది ప్రభావతి. 'నోర్మూయ్.. డబ్బు వస్తుందంటే ఎలాంటి నీచమైన పనైనా చేస్తావా? ఇంకో రెండు లక్షలు ఎక్కువ ఇస్తే.. ఎవరినైనా చంపమంటే చంపేస్తావా? ఇంకా ఏదో ఘన కార్యం చేసినట్టు.. గర్వంగా, ఠీవీగా చెబుతున్నావా? ఆడదానివేనా? అసలు ఇలాంటి పనులు చేస్తున్నందుకు బయటకు గెంటేయాలి.. 'నీ (ప్రభావతి) వల్ల నాకు ఐదు లక్షలు నష్టం.. అందులో నువ్వే రెండు లక్షలు లంచం తీసుకున్నావ్.. నాకు నా ఐదు లక్షలు కావాలి.. లేదంటే లాయర్ దగ్గర రెండు లక్షల లంచం తీసుకున్నావ్ అని ఇంకో కేసు పెడతా' అని ప్రభావతిని బాలు బెదిరించాడు. 'అనవసరంగా శివని దొంగని చేశావ్.. ఉత్తపుణ్యానికి నా భార్య మీద దొంగతనం మోపావ్.. అందరి ముందు నా భార్య పరువు తీశావ్.. దొంగతనం జరగకుండా.. దొంగ కేసులు పెట్టేవాళ్లు కూడా దొంగలే.. అదే లాయర్‌ని పట్టుకుని పరువునష్టం దావా కేసు వేస్తాను..' అని బాలు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మొత్తం డబ్బు బాలుకి ఇవ్వాల్సిందే..

'అత్తయ్య గారి మీద కేసు పెట్టి.. మన ఇంటి పరువు తీస్తావా?' అని రోహిణి అంటే.. 'నా భార్య మీద కేసు పెడతాను అన్నప్పుడు ఇంటి పరువు గుర్తు రాలేదా?.. నాకు కచ్చితంగా నాలుగున్నర లక్షలు ఇవ్వాల్సిందే' అని బాలు తెగేసి చెప్పాడు. 'అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది' అని ప్రభావతి అంటే.. 'ఇవ్వాల్సిందే' అని సత్యం అంటాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది? అని అమ్మ తరుపున మనోజ్ మాట్లాడితే.. మరి నువ్వు ఇవ్వరా? అని బాలు అనేశాడు. దీంతో మనోజ్ సైలెంట్ అయ్యాడు. కూలి పనులకు వెళ్తావో.. మనోజ్‌లా గుడి ముందు అడుక్కుంటావో నాకు తెలీదు.. ఆ డబ్బు ఇవ్వాల్సిందే అని ప్రభావతిని సత్యం హెచ్చరిస్తాడు. అక్కడితో ఆ చర్చ ముగుస్తుంది. 'రోహిణి.. మన బిజినెస్ బాగా నడుస్తోంది.. మనం త్వరలోనే మిలీనియర్లం అవుతామేమోననిపిస్తోంది' అని మనోజ్ అంటే.. 'ఆ గుణ గాడే మిలీనియర్ అయ్యేలా ఉన్నాడు' అని రోహిణి తన మనసులో అనుకుంటుంది. 'ఇంత చిన్న ఇంట్లో ఉండటం నా వల్ల అవ్వడం లేదు' అని మనోజ్ అంటే.. అలాంటి రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం అని రోహిణి చెబుతుంది. ఇంతలో ప్రభావతి మనోజ్ రూంలోకి వస్తుంది. 'నాలుగున్నర లక్షలు ఇవ్వాల్సిందే అని మీ మామ గారు చెప్పారు.. దాని గురించే ఆలోచిస్తున్నా.. ఈ విషయంలో నువ్వే (మనోజ్) నాకు హెల్ప్ చేయాలిరా' అని ప్రభావతి అంటే.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా అని మనోజ్ దాట వేసే ప్రయత్నం చేస్తాడు. ఆ డీజీఎం వాళ్లు డబ్బులు ఇచ్చి ఉంటారు కదా.. అందులోంచి కొన్ని ఇవ్వురా అని ప్రభావతి అడుగుతుంది. అది కుదరదు అమ్మా.. అలా చేస్తే డీల్స్ పోతాయి అని మనోజ్ అంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదరా.. అని ప్రభావతి అంటుంది.
మలేషియా మామని అడుగు..

'నా కోడలు ఉండగా.. నిన్ను అడిగి వేస్ట్.. మీ మలేషియా మామయ్య ఉన్నాడు కదా?.. ఆయన్ను అడిగి ఇవ్వమ్మా.. అలా అడిగితే ఇలా ఇచ్చేస్తాడు..' అని ప్రభావతి అంటే.. 'ఫోన్ కలవడం లేదు.. సిగ్నల్ లేదేమో.. కాల్ కలిసినప్పుడు అడుగుతాను.. డబ్బులిస్తే మీకు పంపిస్తాను' అని రోహిణి ఏదో చెప్పి మాయ చేస్తుంది. 'వెంటనే మనం మలేషియా వెళ్దాం.. నేను కూడా మీ నాన్న గారిని, మా అన్నయ్య గారిని చూడలేదు కదా?.. చూసినట్టు ఉంటుంది.. మాట్లాడినట్టు ఉంటుంది.. ఒకేసారి కోటి లేదా రెండు కోట్లు తెచ్చుకోవచ్చు కదా' అని ప్రభావతి అంటే.. రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'అమ్మో కోటి రూపాయలా? అత్యాశకి అత్త వేషం వేసినట్టున్నారీవిడ.. ఇప్పుడు గనుక ఈమెను ఆపకపోతే.. డైరెక్ట్‌గా మలేషియా వెళ్లి.. అడ్రెస్ చెప్పు అని అంటారేమో' అని రోహిణి తనలో తాను భయపడిపోయింది. 'టికెట్ బుక్ చేయ్ అమ్మా' అని రోహిణిని ప్రభావతి అడుగుతుంది. 'అవేమైనా బస్ టికెట్స్ అనుకుంటున్నావా? ఆధార్ కార్డు చూపించి వెళ్దామని అనుకుంటున్నావా?' అని మనోజ్ అంటే.. 'ఏ అలా తీసుకెళ్లరా?' అని ప్రభావతి అమాయకంగా అడిగింది. 'మలేషియా వెళ్లాలి అంటే పాస్ పోర్ట్, వీసా కావాలి.. నీ దగ్గర కనీసం పాస్ పోర్ట్ కూడా లేదు' అని మనోజ్ అంటే.. 'అవన్నీ రోహిణి చూసుకుంటుంది లే' అని ప్రభావతి అంటుంది. 'ఇప్పుడు మనం కేసులో ఉన్నాం.. అక్కడికి వెళ్తే.. వాళ్లు కూడా ఇరుక్కుంటారు..' అని రోహిణి చెబుతుంది. 'సరే ఎలాగైనా ఆ డబ్బు వచ్చేలా చేయండి.. నేను కష్టాల్లో ఉంటే మీరే కదా సాయం చేయాలి' అని రోహిణితో ప్రభావతి అంటుంది. 'మా మామయ్య తీర్థయాత్రలకు వెళ్లాడు.. ఇప్పట్లో దొరకడు' అని రోహిణి చెబుతుంది. 'సరే ఎలాగైనా డబ్బు కావాలి.. నేనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ రెండు లక్షలు ఎవరో దొంగతనం చేశారు అని కేసు పెడతాను' అని ప్రభావతి అనడంతో రోహిణి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 'ఏంటి.. ఆ దొంగల మీద కేసు పెడతారా?.. అలా కేసు పెడితే.. పోలీసులే సగం డబ్బు నొక్కేస్తారు' అని రోహిణి అంటుంది. 'మరీ అలా జరగదు.. నువ్వు కంప్లైంట్ ఇవ్వు అమ్మా' అని మనోజ్ అంటాడు. దీంతో రోహిణి మరింతగా భయపడుతుంది.
అప్పుడు రౌడీ.. ఇప్పుడు హీరో..

'పడుకున్న బాలుని చూస్తూ మీనా తనలో తాను ఇలా అనుకుంది. 'నేను పెళ్లి పీటల మీద ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు నా జంటగా నా జీవితంలోకి వచ్చారు.. అప్పుడు మీరు రౌడీ.. ఇప్పుడు నా హీరో.. అప్పుడు మన ఆలోచనలు వేరు.. ఇప్పుడు మన ఇష్టాలన్నీ ఒక్కటయ్యాయి.. ఒకరికి కోసం ఒకరం అయ్యాం.. చుట్టూ ఉన్న వాళ్లు మనల్ని చూసి కుళ్లుకుంటారేమో గానీ.. అప్పుడప్పుడు మన మధ్య తెలియని దూరం వచ్చి పోతుంటుంది.. నా మీద మాట పడనివ్వరు.. ఈగ వాలనివ్వరు.. నన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తుంటారు.. నేరుగా ఇవన్నీ అడగాలని ఉంటుంది. కానీ సిగ్గు వస్తుంటుంది.. అందుకే మీరు ఇలా నిద్రపోతోన్నప్పుడు మీ గుండెని అడుగుతుంటాను' అని మీనా తనలో తాను అనుకుంటూ.. బాలు గుండె మీద నిద్రపోతుంది. ఇంతలో బాలు నిద్ర లేచి.. 'ఏంటి ఇంకా నిద్రపోలేదా?.. గుండెల్లో అయినా, గుండె మీద అయినా స్థానం నీదే కదా? ఎంతసేపైనా ఉండొచ్చు' అని అంటాడు. భార్యకు ఇంతకంటే హాయినిచ్చే చోటు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు అని మీనా అంటుంది.
అది వస్త్రం కాదు.. అల్లుకున్న బంధం..

'మీరు నా కోసం తీసుకొచ్చిన చీర కారులో చిక్కుకుని చినిగిపోయింది' అని మీనా అంటుంది.. 'నీ కోసం రెండు కుటుంబాలు, పది మంది కష్టపడి కనిపెడితే.. నువ్వు మాత్రం ఆ చీర గురించి ఆలోచిస్తున్నావా?' అని బాలు అంటాడు. 'అది కేవలం చీర కాదు.. చీరలో అల్లుకున్న నూలు పోగులు చూడటం లేదు.. మనిద్దరి మధ్య అల్లుకున్న బంధాన్ని చూస్తున్నాను.. అది కేవలం ఆరు గజాల వస్త్రం కాదు.. నా ఆరో ప్రాణమైనా మా వారు నా కోసం ప్రత్యేకంగా కొన్న చీర.. మన ప్రేమకు గుర్తుగా దాచుకోవాలని అనుకున్నాను' అని మీనా అంటుంది. 'ఆ చీర ముక్క మీ వద్దే ఉంది కదా?' అని మీనా అనడంతో బాలు షాక్ అవుతాడు. 'ఆ ముక్క నా దగ్గరే ఉందని నీకెలా తెలుసు?' అని బాలు ప్రశ్నిస్తాడు. 'గుడిలో రాములవారిని మీరు వేడుకుంటున్నప్పుడు మీ కళ్లలోని బాధను, నా మీదున్న ప్రేమను చూశాను' అని మీనా అంటుంది. 'రాముడు దేవుడు ఎందుకు అయ్యాడో నాకు అప్పుడు అర్థమైంది. నువ్వు కొన్ని గంటలు కనిపించకపోతే నాకు ఏమీ తోచలేదు.. ఎంతో కంగారు పడ్డాను.. కానీ రాముడు మాత్రం సీతమ్మ కోసం ఎన్నో రోజులు వేచి చూశారు.. కష్టాలు పడి, యుద్దం చేశారు.. అలా ఎవరైనా ప్రేమించగలరా?' అని బాలు అంటే.. 'మీరు ప్రేమిస్తున్నారు కదా?' అని మీనా అంటుంది. ఇక ఆపై బాలు ఒళ్లో తలవాల్చి మీనా హాయిగా నిద్రపోయింది.
కర్మ సిద్దాంతం అంటే ఇదే..

మనం చేసిన పనులు మనకే తిరిగి వస్తాయి.. కర్మ సిద్దాంతం అంటే ఇదేనేమో అని రోహిణితో విద్య అంటుంది. 'ఆ శివ దొంగతనం చేసే వీడియోని గుణకి ఇచ్చావు.. అది అటు తిరిగి ఇటు తిరిగి మీ అత్త ఇంట్లోంచి వెళ్లే పరిస్థితి వచ్చింది.. లాయర్ దగ్గర మీ అత్త రెండు లక్షలు తీసుకుని ఆ కేసుని వెనక్కి తీసుకుంటే.. ఆ రెండు లక్షలు నువ్వు కొట్టేశావ్.. ఇప్పుడు మీనా వాళ్లకి మూడు లక్షలు నువ్వే ఎక్స్ట్రా గా ఇవ్వాల్సి వస్తోంది.. దీన్నే కర్మ ఈజ్ బ్యాక్ అని అంటారు' అని రోహిణి పుండు మీద విద్య కారం చల్లినట్టు అనేసింది.
నీ వల్లే సమస్య మొదలు..

'నేనే ఇరిటేషన్‌లో ఉన్నాను.. నువ్వు ఎందుకు ఇలా అంటున్నావ్.. మా అత్త ఇప్పుడు మలేషియా మామయ్య దగ్గరకు వెళ్దామని అంటోంది.. ఇప్పుడు ఆ డబ్బులు నేనే ఇవ్వాల్సి వస్తోంది' అని రోహిణి అంటుంది. అందుకే చెడపకురా చెడేవు అని పెద్దలు అంటారు అని విద్య కౌంటర్ వేస్తుంది. అంటే నేను చెడ్డదాన్ని అని అంటావా?.. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ పోతోన్నాయ్ అని రోహిణి బాధపడుతుంది. 'అసలు నువ్వు ఆ శివ వీడియో లీక్ చేయకుండా ఉండే ఇదంతా జరిగేది కాదు.. నీ దగ్గర మొదలైన సమస్య.. మళ్లీ నీ దగ్గరకే వచ్చింది' అని విద్య కౌంటర్ వేసింది. 'ఆ రెండు లక్షలు నేనే కామాక్షి అత్తకు ఇస్తాను' అని రోహిణి చెబుతుంది. డబ్బులు కావాలంటే తాళి బొట్టు తాకట్టు పెట్టాల్సిందే అని విద్యని గోల్డ్ షాప్‌కి తీసుకెళ్తుంది రోహిణి. 'ఇప్పుడు నకిలీ తాళి బొట్టు వేసుకుంటే.. మళ్లీ అది కూడా బయటపడితే ఏం చేస్తావ్.. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావ్' అని విద్య చెబుతుంటే రోహిణి మాత్రం వినకుండా తన దారిలో తాను వెళ్తుంది. 'ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించే టైం లేదు.. నువ్వెప్పుడు ఇలానే అపశకునపు మాటలు మాట్లాడాతావ్' అని విద్య నోరుని మూయిస్తుంది రోహిణి. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్లీ కామాక్షి ఇంట్లో సీన్ పడుతుంది.
రోహిణికి కామాక్షి కౌంటర్లు..

ఎప్పుడు వచ్చినా ఏదో టెన్షన్ పడుతూ ఉంటావ్.. ఎవ్వరికీ తెలియకుండా దొంగలా వచ్చి వెళ్తుంటావ్.. అయినా ఈ మధ్య మా ఇంటికి పదే పదే వస్తున్నావ్ అని రోహిణికి కామాక్షి కౌంటర్లు వేస్తుంది. ఇక కామాక్షి తన ధోరణిలో మాట్లాడుకుంటూ పోతే.. రోహిణికి విసుగు వస్తుంది. 'నేను ఈ మధ్య మీ ఇంటికి పదే పదే వస్తున్నాను.. ఎందుకంటే.. మీలో మా అమ్మని చూసుకుంటున్నాను.. నా మనసు బాగా లేకపోతే ఇక్కడికి వస్తే హాయిగా ఉంటుంది' అని కామాక్షికి బిస్కెట్లు వేసే ప్రయత్నం చేసింది. 'అత్తయ్యని ఇంట్లో అందరూ తిట్టారు.. బాలు, మీనాలకు ఐదు లక్షలు ఇవ్వాల్సిందే అని మామయ్య గారు కండీషన్ పెట్టారు' అని రోహిణి చెప్పడంతో కామాక్షి షాక్ అవుతుంది. 'ఐదు లక్షలా?.. డబ్బులున్నప్పుడు నీళ్లలా ఖర్చు పెడుతుంది.. ఇప్పుడు ఐదు లక్షలు ఎలా తెస్తుంది?' అని కామాక్షి అనుకుంటుంది. 'అత్తయ్య అమాయకురాలు.. అత్తయ్యకి సాయం చేయాలని అనుకుంటున్నాను.. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే అత్తయ్య, మామయ్య విడిపోతారేమో అని అనిపిస్తుంది' అని అమాయకురాలిగా రోహిణి నటిస్తుంది..

