పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించే ప్రతీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూనే ఉంది. ఆయన నటిస్తున్న సినిమా నుంచి చిన్న అప్‌డేట్ వచ్చినా అభిమానుల్లో ఆనందోత్సాహాలు అంబరాన్ని తాకుతాయి.
ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా చార్మినార్ అనగానే అందరికీ హైదరాబాద్ పాతబస్తీ గుర్తుకొస్తుంది. కానీ త్వరలోనే ఐటీ హబ్ గచ్చిబౌలి ప్రాంతంలోనూ మరో చార్మినార్ దర్శనమివ్వబోతోంది. అయితే ఇది అసలైన చారిత్రక కట్టడం కాదు.. 'ఫౌజీ' చిత్రికరణ కోసం నిపుణులు ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న ఒక భారీ సినిమా సెట్.
* బాలయ్య గాయపడటంతో ప్లాన్ మొత్తం మార్చేసిన కొరటాల... షూటింగ్ ఎప్పటి నుంచంటే
గచ్చిబౌలి-లింగంపల్లి ప్రధాన రహదారిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిజమైన చార్మినార్‌ను తలపించేలా ఈ సెట్‌ను రూపొందిస్తున్నారు. అసలు చార్మినార్ వద్దే నేరుగా షూటింగ్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, చిత్ర బృందం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ప్రభాస్‌కు ఉన్న అపారమైన క్రేజ్ దృష్ట్యా పాతబస్తీలో చిత్రీకరణ చేపడితే వేలాదిగా తరలివచ్చే అభిమానుల కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు, భద్రతాపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే ఈ భారీ వ్యయంతో కూడిన సెట్‌ను గచ్చిబౌలిలో నిర్మించారు.
తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 3 నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక షెడ్యూల్ దాదాపు 25 రోజుల పాటు సాగనుంది. ఈ చిత్రీకరణలో ప్రభాస్ నేరుగా పాల్గొని కీలకమైన సన్నివేశాల్లో నటించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా మొత్తం షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయినట్లేనని సమాచారం. అనంతరం ఎటువంటి ఆలస్యం లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడానికి మేకర్స్ వేగంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ నెట్టింట వస్తున్న వార్తలకు నిర్మాతలు చెక్ పెట్టారు.
* ఆ పాత్ర చేయడానికి కారణమదే.. 'రామాయణ' శూర్పణఖ రోల్‌పై రకుల్ క్రేజీ రియాక్షన్
మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన వై. రవిశంకర్ ఇటీవల స్పందిస్తూ.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమేడిసెంబర్ 3న 'ఫౌజీ' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు. దీంతో వస్తున్న రూమర్లకు తెరపడటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సుమారు రూ.700 కోట్ల క్రేజీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని అత్యంత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఇమాన్వి కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

