Dailyhunt
హనుమంతుడికి ఇష్టమైన రాశులు - వీరి వ్యక్తిత్వం ఎందుకు ప్రత్యేకం?

హనుమంతుడికి ఇష్టమైన రాశులు - వీరి వ్యక్తిత్వం ఎందుకు ప్రత్యేకం?

Telugu Samayam 1 month ago

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ద్వాదశ రాశులలో నాలుగు రాశుల వారిపై ఎల్లప్పుడూ హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హనుమంతునికి ఇష్టమైన రాశిచక్రాల వివరాలేంటో తెలుసుకుందాం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, హనుమంతుని అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ధైర్యం, బలం పుష్కలంగా లభిస్తాయని నమ్ముతారు. ప్రస్తుత కలియుగంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ దేవుడిని నమ్ముకుంటే కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారుు. ఎవరైతే భక్తి శ్రద్ధలో పూజిస్తారో వారికి తప్పకుండా ఆంజనేయుని అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయుడు తమ వ్యక్తిగత జాతకంలో గ్రహాల అశుభ ప్రభావాలను కూడా తగ్గిస్తాడని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం, కొన్ని రాశుల వారు అంజనీ పుత్రుని ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారు. వీరు స్వభావరీత్యా నిర్భయంగా, శక్తివంతంగా ఉంటారు. ఈ కారణంగా వీరు ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉంటారు. ఈ సందర్భంగా ఆ రాశులేంటో ఇప్పుడే చూసెయ్యండి.మేష రాశి(Aries)

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమంతుడు, కుజుడి మధ్య సంబంధాలు మంచిగా ఉంటాయి. ఈ కారణంగా మేష రాశి వ్యక్తులకు హనుమంతుని అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కుజుడి కారణంగా మీరు చాలా ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. హనుమంతుని ఆశీస్సులతో క్లిష్టమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. తమ లక్ష్యాలను సాధించడంలో పట్టుదలను కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలో అయినా, ఎంత కష్టం వచ్చినా వెనుకడుగు అనేదే వేయరు.


సింహ రాశి(Leo)

సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, హనుమంతుడు సూర్యుడిని తన గురువుగా భావించాడు. అందుకే సింహ రాశి వ్యక్తులకు హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ లభించనుంది. ఈ కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం, శక్తి పెరిగే అవకాశం ఉంది. మీ నాయకత్వ నైపుణ్యాలు, ఆకట్టుకునే వ్యక్తిత్వాలు వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశాలున్నాయి. వీరి నిర్ణయాత్మక నిర్ణయాల కారణంగా మంచి విజయం లభించే అవకాశం ఉంది.


వృశ్చిక రాశి(Scorpio)

వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు హనుమాన్ ప్రత్యేక ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. వీరు హనుమంతుని అనుగ్రహంతో తమ తెలివితేటలను పెంచుకుంటారు. అనేక విషయాలను లోతుగా ఆలోచిస్తారు. అనేక సందర్భాల్లో చాలా ఓపికగా వ్యవహరిస్తారు. వీరు తమ పని పట్ల నిజాయితీ, అంకితభావంతో ఉండటం కారణంగా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది.


కుంభ రాశి (Aquarius)

కుంభ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. శని దేవుని ప్రభావంతో వీరు చాలా నిజాయితీగా, న్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ కారణంగా వీరికి హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఆంజనేయుడు ప్రత్యేక ఆశీస్సుల కారణంగా వీరికి అనేక కష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వీరు సమాజం ప్రయోజనాల కోసం ఉత్తమమైన పనులు చేసే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ''సమయం తెలుగు'' దృవీకరించడం లేదు.
Read Latest Astrology News and Telugu News


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam