బిగ్ బాస్ 9 విజేత కళ్యాణ్ పడాల ప్రస్తుతం బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ అనంతరం కొన్ని షోలు చేశాడు. రీసెంట్‌గా కుకు విత్ జాతిరత్నాలు అంటూ కొన్ని వారాలు సందడి చేశాడు.
ఆ తరువాత కుకు షో నుంచి కళ్యాణ్ తప్పుకున్నాడు. కళ్యాణ్ పడాల హీరోగానూ కొన్ని ప్రాజెక్టులు రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇక ఇప్పుడు కళ్యాణ్ పడాల తన కలను నిజం చేసుకున్నాడు. మధ్య తరగతి వ్యక్తికి సొంతింటి కల, కొత్త కారు కొనడం అనే కల ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కళ్యాణ్ ఓ కొత్త కారుని తీసుకున్నాడు.
ఈ మేరకు తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'కొన్ని సార్లు జీవితంలో మనం కన్న కలలు నిజం అవుతాయని కొన్ని సందర్భాలు నిరూపిస్తాయి.. ఇది కేవలం కారు మాత్రమే కాదు.. ఇదొక మరుపురాని ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకం 'బిగ్ బాస్ 9 తెలుగు' ద్వారా లభించిన ఒక వరం, మీలో ప్రతి ఒక్కరి నుండి నాకు లభించిన నిస్వార్థమైన ప్రేమకు ఒక నిదర్శనం. ప్రతి ఓటు, ప్రతి సందేశం, ప్రతి ప్రార్థన, మద్దతు నన్ను ఈ క్షణం వరకు నడిపించాయి. ఈ ఆనందం నాది ఎంతైతే మీదీ అంతే. ఇదంతా మీ వల్లే.. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని పోస్ట్ వేశాడు.
ఇక కళ్యాణ్ పడాల సొంతంగా కారు కొన్నాడా? లేదంటే ప్రైజ్ మనీలో భాగంగా బిగ్ బాస్ టీం ఈ కారుని ఇచ్చిందా? అన్నది తెలియడం లేదు. కళ్యాణ్ తన పోస్టులో ఇచ్చిన హింట్స్ చూస్తే, ట్యాగ్ చేసిన పేర్లను చూస్తుంటే ఇది బిగ్ బాస్ టీం ప్రైజ్ మనీ అన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇంకో సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఇంత ఆలస్యంగా ప్రైజ్ మనీ ఇస్తారా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ పడాల సొంతంగా కారు కొంటే.. స్టార్ మా, ఎండోమైల్ షైన్‌లను ఎందుకు ట్యాగ్ చేస్తాడని మరి కొందరు అనుకుంటున్నారు.
ఏది ఏమైనా కూడా కళ్యాణ్ పడాల ఈ కొత్త కారుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. కారు సొంతం చేసుకోవడంతో కళ్యాణ్ పడాల అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కంగ్రాట్స్ అన్నా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఇక కళ్యాణ్ పడాల నుంచి బిగ్ సర్ ప్రైజ్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారం.

