Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇకపై టోల్‌ప్లాజాను ఫ్రీగానే దాటొచ్చు.. కానీ, ఒక కండీషన్ ఈ- పాస్ ఉండాల్సిందే!

ఇకపై టోల్‌ప్లాజాను ఫ్రీగానే దాటొచ్చు.. కానీ, ఒక కండీషన్ ఈ- పాస్ ఉండాల్సిందే!

Telugu Samayam 2 weeks ago

టీవల కాలంలో టోల్‌ప్లాజాల సంఖ్య ఎక్కువైంది. నేషనల్ హైవేల నిర్మాణాలతో మరిన్ని పెరిగే అవకాశం కూడా ఉంది. టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ కట్టాల్సిందే.

అది ఎంత దగ్గరయినా సరే టోల్ కట్టే దాటాల్సి ఉంటుంది. అయితే, 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారు ఇకపై టోల్ కట్టాల్సిన పని ఉండదు. కాకపోతే దీంట్లో ఒక చిన్న కండీషన్ కూడా ఉంది. అది పాటిస్తే ఇకపై టోల్ కట్టకుండానే తిరగొచ్చు.

20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారు ప్రతిసారీ టోల్ కట్టకుండా ఒకేసారి కొంత మొత్తం చెల్లించి లోకల్ పాస్‌లు తీసుకుంటే సరిపోతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఆదేశాల జారీ చేసింది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే పాసులు జారీ చేస్తామని.. ప్రస్తుతం ఇది 15 కిలోమీటర్ల పరిధి మేరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఆన్‌లైన్ పాస్‌లు పొందాలి అనుకునే వారు ఎక్కడకి వెళ్లకుండానే కేవలం ఇంటి దగ్గర ఉండే తీసుకోవచ్చు. వాహనదారులు రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. దాని కోసం ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, వాహనం నెంబర్, ఫాస్టాగ్ వివరాలు ఎంటర్ చేస్తే జీఐఎస్ ఆధారిత తనిఖీ ద్వారా దరఖాస్తుదారుడు 20 కిలోమీటర్ పరిధిలో ఉన్నాడా? లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఇచ్చిన వివరాలు సరైనవయితే ఫాస్టాగ్‌కు లింక్ అవుతుంది. అనంతరం ఎన్‌హెచ్ఏఐ అధికారులు తనిఖీ చేసి ఆమోదం తెలిపిన తర్వాత కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి ఈ - పాస్‌ కార్డులు రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నారు. త్వరలోనే అన్ని టోల్‌ప్లాజాల్లో జారీ ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. యల్లో నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలకు మాత్రం ఇది వర్తించదు. సొంత వైట్ ప్లేట్ ఉన్న వాహనాలకే ఈ లోకల్ పాస్ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీని కోసం నెలకు రూ. 350 నుంచి రూ. 360 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam