Illu Illalu Pillalu August 05th Episode: అమ్మ బాబోయ్.. నర్మద మళ్లీ బోర్డు మీద స్కెచ్‌లు వేస్తుందయ్యో. ఆపరేషన్ డీపీ అంటూ మళ్లీ బోర్డుపై బొమ్మలేస్తుంది.
ధీరజ్, ప్రేమలు విడిపోవడం వెనుక ఎవరున్నారో కనిపెట్టేస్తానంటూ ఇన్విస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈమె బోర్డుపై బొమ్మలేస్తుందంటే అది చివరికి తుస్సే. ఎందుకంటే ఈమె హీకేదేం ఉండదు. ఆ కుట్ర చేసింది శ్రీవల్లేనని తెలుసుకుంటుంది. చివరికి చందు, మామయ్యకి తెలిస్తే వల్లీ కాపురం కూలిపోతుందని వదిలేస్తుంటుంది. ఆ మాత్రం దానికి మరి ఇంత బిల్డప్ ఎందుకూ అంటే.. ఈరోజు (ఆగస్టు 05) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ చూడాల్సిందే.
గతంలో అమూల్యని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు విశ్వక్. శ్రీవల్లితో చేతులు కలిపి.. అమూల్యని కిడ్నాప్ చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఆ ఇష్యూలో జైలుకి కూడా వెళ్లొచ్చాడు విశ్వక్. అయితే ఇప్పుడు అమూల్యని నిజంగానే ప్రేమిస్తున్నా.. ఆమె మాత్రం దేకను కూడా దేకడం లేదు. ఈరోజు (ఆగస్టు 05) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. అమూల్యకి నచ్చజెప్పే ప్రయత్నంలో ఆమె చేయి పట్టుకుంటాడు విశ్వక్. దాంతో అమూల్య.. "ఎంత ధైర్యంరా నా చేయి పట్టుకోవడానికి చంపేస్తాను" అంటూ వార్నింగ్ ఇస్తుంది. "అది కాదు అమూల్య ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నీతో మాట్లాడాలి. అందుకే ఇంతలా బతిమిలాడుతున్నాను. ఇంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్" అంటూ బ్రతిమిలాడతాడు చేస్తాడు విశ్వక్. "ఎవడ్రా.. అసలు నువ్వు ఎవడ్రా నాతో మాట్లాడటానికి. నీతో నాకు మాటలేంటీ" అంటుంది అమూల్య కోపంగా. "మా చెల్లెలు ప్రేమ గురించి.. మీ అన్నయ్య ధీరజ్ గురించి.." అంటాడు విశ్వక్. "ఏంటీ.. ఏమన్నావు" అంటుంది అమూల్య ఆశ్చర్యంగా. "ధీరజ్ అంటే మా చెల్లెలి మనసులో ఎంత ప్రేమ ఉందో.. ధీరజ్ తో గొడవ అయ్యి విడిపోయినందుకు తను ఎంత నరకం చూస్తుందో నేను కళ్లారా చూస్తున్నాను. ప్రేమ, ధీరజ్‌లను మనం ఒక్కటి చేద్దాం.. ప్లీజ్ నా మాట విను

నాకు తెలిసి మా చెల్లెలి గురించి మీ అన్నయ్య కూడా అంతే బాధ పడుతూ ఉండి ఉంటాడు. ఆ బాధ వాళ్లకు దూరం చేద్దాం. మళ్లీ వాళ్లను దగ్గర చేద్దాం. అందుకోసం మనిద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం" అంటాడు విశ్వక్. ఆ మాటతో అమూల్య.. "ఏంట్రా మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టావా. నన్ను నమ్మించి మోసం చేయడం కోసం ఇప్పుడు ఈ అవకాశం వాడుకుందామని చూస్తున్నావా" అంటుంది అమూల్య. "లేదు అమూల్య. నేను నిజంగానే చెప్తున్నాను" అంటాడు విశ్వక్. "ఏ ఛీ ఆపు. చెల్లెలి కాపురం సమస్యల్లో పడిపోయిందనే బాధ కూడా లేకుండా దాన్ని కూడా అడ్వాంటేజ్ గా తీసుకుందామని చూస్తున్నావా. సిగ్గు అనిపించడం లేదా ఛీ" అంటూ అసహ్యించుకుంటుంది అమూల్య.
నిన్ను ఇలా నమ్మాలిరా.. గతంలో కూడా ఇలాగే కట్టు కథలు చెప్పావ్..

"నా చెల్లెలి కాపురం సమస్యల్లో పడిందని బాధపడుతున్నాను కాబట్టి.. ఒక అన్నయ్యలాగా నా చెల్లెలి కాపురం చక్కదిద్దాలని బాధ్యత తీసుకున్నాను కాబట్టి నిన్ను హెల్ప్ అడుగుతున్నాను" అంటాడు విశ్వక్. "ఒకప్పుడు కూడా ఇలాగే చెప్పావు. మన రెండు కుటుంబాలు కలవాలని కోరుకుంటున్నాను. అది మన పెళ్లితోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నానని.. ఆ మాట నిజమని నమ్మినందుకు నా భవిష్యత్తును సగం కోల్పోయాను. మా నాన్నను చావు చివరి వరకు తీసుకెళ్లారు. ఒక్కసారి నమ్మితే అయ్యో పాపం అంటారు. రెండోసారి కూడా నమ్మితే పిచ్చిదని అంటారు. మరీ నీ గురించి తెలిసి కూడా రెండోసారి ఎలా నమ్మమంటావు రా " అని నిలదీస్తుంది అమూల్య.
ఛీ ఛీ నువ్వూ నీ కుటుంబం మారిదంటే అదో పెద్ద బూతురా..

లేదు అమూల్యా.. నేను నిజాయితీగానే చెప్తున్నా.. ఒకప్పుడు మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నేను నీ జీవితంతో ఆడుకోవాలని చూసిన మాట నిజమే. కానీ కోర్టులో నువ్వు నాకు పెట్టిన బిక్షతో నేను మారాను. ఇప్పుడు మా చెల్లెలిని మీ అన్నయ్యను కలపాలని నేను పడుతున్న తపనలో నా చెల్లెలి మీద ప్రేమ నిజాయితీ తప్ప ఎలాంటి మోసం లేదు. దయచేసి అర్థం చేసుకో" అంటూ రిక్వెస్ట్ చేస్తాడు విశ్వక్. "ఏ ఛీ ఆపు. మీ కుటుంబం మారింది అంటేనే అది పెద్ద బూతు రా. మీ వాళ్లు మారామని మా ఇంటికి వచ్చి మాతో గొడవ పెట్టుకుని మా వదినను మీ ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు. మీరు మారారు అని నమ్మితే అంతకంటే పెద్ద తప్పు, బుద్దితక్కువ పని మరొకటి ఉండదు " అంటుంది అమూల్య కోపంగా.
నువ్వు కాళ్లు పట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నా నమ్మనురా.. 'లేదు అమూల్యా.. లేదూ'

"అమూల్య.. మా వాళ్లు అలా చేసి ఉండోచ్చు. కానీ నేను నిజంగానే మారాను. మా చెల్లిని, మీ అన్నయ్యను కలపాలని నేను మనస్పూర్తిగా అనుకుంటున్నాను. దయచేసి నాకు హెల్ప్ చేయ్ " అంటూ రిక్వెస్ట్ చేస్తాడు విశ్వక్. "ఏయ్ ఆపు. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా, కాళ్లు పట్టుకున్నా సరే నిన్ను ఈ జన్మలో నమ్మను. చూడు ఈ వంక పెట్టుకుని నువ్వు నాతో మాట్లాడాలని చూశావనుకో.. ఉదయం మా అన్నయ్య మాత్రమే కొట్టాడు. ఈసారి మా ఇంట్లో వాళ్లందరూ కొడతారు" అంటూ వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్లిపోతుంది అమూల్య. దీంతో విశ్వక్ నిస్సహాయంగా నిలబడి చూస్తూ ఉంటాడు.
ప్రేమ కోసం బాధలో.. మందు కొట్టిన ధీరజ్

కట్ చేస్తే.. తిరుపతితో కలిసి ఫుల్లుగా డ్రింక్ చేస్తుంటాడు ధీరజ్. " రేయ్ అల్లుడు ముద్దు ముద్దుగా పాలు తాగినట్లు మెల్ల మెల్లగా తాగేవాడివి కదరా.. ఇప్పుడేంట్రా ఇంత కసిగా ఇలా జిప్ జిప్ మని తాగుతున్నావు" అంటాడు తిరుపతి ఆశ్చర్యపోతూ. " బుసలు కొడుతుంది మావ.. లోపల ఈగో భయంకరంగా బుసలు కొడుతుంది" అంటాడు ధీరజ్ తాగి ఊగుతూ. " అయితే ఇంకో పెగ్ వెయ్ అల్లుడు ఇగో ఇంటికి వెళ్లిపోతుంది" అంటాడు తిరుపతి. " కానీ ప్రస్టేషన్ పరిగెత్తుకుంటూ వస్తుంది మావ.. తిడతాను. కొడతాను.. పర్లేదా" అని అడుగుతాడు ధీరజ్. " ఏం పర్లేదు. నువ్వు నా ముద్దుల చిన్నల్లుడివిరా. గడ్డి అన్నాకా ఎండిపోవడం. గుడ్డు అన్నాక పగిలిపోవడం. అల్లుడు అన్నాక మామను కొట్టడం చాలా సహజం.
అబద్దాలు ఆడితే చంపేస్తా.. రేయ్ అల్లుడూ ఏంట్రా ఇదీ.. నువ్వేసెయ్

నువ్వు వేసేయ్.. పెగ్గుల మీద పెగ్గులు వేసేయ్ " అంటూ ఇంకా ఎంకరేజ్ చేస్తుంటాడు తిరుపతి. దీంతో ధీరజ్ ఫుల్లుగా మందు కొట్టేస్తాడు. తర్వాత " ఏయ్.. తప్పు కదా.. అలా చేయడం తప్పు కదా" అంటాడు ధీరజ్. " తప్పే అల్లుడు. నీకంటే నేను ఎక్కువ పెగ్గులు వేయడం తప్పే" అంటాడు తిరుపతి. " ఏయ్.. అది కాదు. ఇతను ఎవరు. నీకు ఏమవుతాడు అని అడిగినప్పుడు నువ్వు చెప్పకపోవడం తప్పా కదా. ఇందుమూలంగా నేను ప్రశ్నిస్తున్నాను " అని అడుగుతాడు ధీరజ్ ప్రేమ మాటలు గుర్తు చేసుకుంటూ. " దట్స్ ఆల్ యువర్ ఆర్డర్. అయినా నన్నెవరు అడిగారు. పిచ్చ హ్యాపీగా చెప్తాను కదా" అంటాడు తిరుపతి. " చంపేస్తాను. నా గురించి అడిగితే హ్యాపీగా చెప్పేస్తావా.. అబద్దాలు ఆడితే చంపేస్తాను" అంటాడు ధీరజ్. దీంతో ఏం అర్థం కాక చూస్తూ ఏంటీ అల్లుడు అని కంగారు పడుతూ ఉంటాడు తిరుపతి.
చూస్తుందయ్యో.. చెలరేగిపోయాడు

ఇక ఇదంతా ప్రేమ తన ఇంటి బాల్కానీ నుంచి చూస్తూ ఉంటుంది. " అబద్దాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు " అంటాడు ధీరజ్. " నాకు ఆడపిల్లలు పుడతారా. అయినా నేను పిల్లలను ఎలా కంటాను " అంటాడు తిరుపతి ఏం అర్థం కాక. " ఏయ్.. కనకపోతే నేను ఊరుకుంటానా. నాలుగు పీకైనా సరే కనేలా చేస్తాను. ఇతను నీకు తెలుసా.. ఏమవుతాడని సెక్యూరిటీ అడిగినప్పుడు ఇంతంత గుడ్లు వేసుకుని ఉరిమి ఉరిమి చూసిందే తప్పా.. ఇతను నా మొగుడు, ప్రాణనాథుడు అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్ లాగా.. డెప్త్ తో, ఎమోషనల్ గా చెప్పావా.. చెప్పు చెప్పు" అంటాడు ధీరజ్. " హో.. ఇంత ప్రస్టెషన్ అంతా మా అమ్మాయి గురించా. ఒక్క నిమిషం అల్లుడు " అంటూ వెళ్లి చీర కప్పుకుని వస్తాడు తిరుపతి.
ఒసేయ్ ప్రేమా చంపేస్తానే నిన్నూ..

" ఏం మావ.. ఏంటీ ఈ అవతారం చెండాలంగా" అంటాడు ధీరజ్ తిరుపతిని చూస్తూ. " నేను ఇప్పుడు నీ మామను కాదు. భామని.. నీ ప్రేమని. బెలూన్ లో గాలి ఎక్కువైనా.. మనసులో ఫ్రస్టేషన్ ఎక్కువైనా ఫట్ మని పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీ మనసులో నన్ను ప్రేమ అనుకుని నీ మనసులో ఉన్న ఫ్రస్టేషన్ మొత్తం తీసేయ్ " అంటాడు తిరుపతి. " కాన్సెప్ట్ అదిరింది. ఓసే రాక్షసి.. నేను మొగుడిని అని చెప్పకుండా సెక్యూరిటీతో గెంటేయిస్తావటే హా" అంటూ తిరుపతి చేతిని గట్టిగా కొరికేస్తాడు ధీరజ్. " ఓరేయ్ అల్లుడు ఇంత గట్టిగా కొరికేసావేంట్రా" అంటాడు తిరుపతి ఏడుస్తూ. " ఏయ్.. నువ్వు ఇప్పుడు మామవి కాదు.. ప్రేమవి. క్యారెక్టర్ మర్చిపోతున్నావు" అంటాడు మళ్లి కొడతాడు ధీరజ్. ఇక ప్రేమపై ఉన్న కోపాన్ని చూపిస్తూ తిరుపతిని గట్టి గట్టిగా కొరుతుండడంతో తిరుపతి పారిపోతాడు.
వచ్చావా శత్రుదేశపు యువరాణీ.. ఎందుకే నీకంత పొగరూ

దీంతో ప్రేమ ఇంటి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. రోడ్డుపై ప్రేమను చూసి ఆగిపోతాడు ధీరజ్. " అమ్మా.. మీ ఆయనకు నీ మీద బోలెడంత ప్రేమ ఉందమ్మా.. చూశావా ఎలా కోరికేస్తున్నాడో" అంటాడు తిరుపతి. " గుడ్ మార్నింగ్. శత్రుదేశపు యువరాణిగారు. ఇంకా నిద్రపోకుండా రోడ్డు మీద నైట్ వాకింగ్ ఏంటీ.. హో. దెయ్యాలు నైట్ లోనే కదా తిరిగేది. ఆ చూపేంటే చేపను మింగేసే తిమింగలం లాగా. మొగుడ్నే చూస్తావా నువ్వు ఆ చూపు దించు. అవునే.. మొగుడు అంటే గుర్తొచ్చింది. నన్ను మొగుడు అని సెక్యూరిటీ చెప్పడానికి నీకెందుకే అంత ఈగో.. ఏం చూసుకోనే నీకు అంత పొగరు. అందం చూసుకోనా.. నా అందంతో పోలిస్తే నీది అసలు అందమే కాదే. మరి ఎందుకే నీకు అంత టెక్కు.
సెక్కురిటీ వాడు అడిగితే మొగుడని చెప్పలేదా?

లేదులే అందగత్తవే.. అందానికి అడ్రస్ ఫ్రూవ్ లాంటిదానివే. " అంటూ ప్రేమ బుగ్గలు పట్టుకుని లాగుతుంటాడు ధీరజ్. దీంతో కోపంగా తోసేస్తుంది ప్రేమ. "కానీ పొగరుకు పర్యాయ పదంలాంటిదానివి. అందుకే సెక్యురిటీతో మొగుడు అని చెప్పలేదు. మొగుడు అని చెప్పడానికి ఏంటే నీ ప్రాబ్లమ్ " అని గట్టి గట్టిగా అడుగుతాడు ధీరజ్. దీంతో ప్రేమ గట్టిగా తోసేస్తుంది ప్రేమ. " మావ.. మొగుడు అనే భయం, గౌరవం లేకుండా ఎలా తోసేసిందో చూశావా. మరి నువ్వు ఇట్టా అలిగి మీ ఇంటికి వెళ్లిపోవచ్చా. సెక్యూరిటీ అడిగితే మొగుడు అని చెప్పకుండా ఇలా తోసేస్తావా" అంటాడు ధీరజ్ బాధగా.

