Dailyhunt
Intinti Ramayanam Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: పల్లవి నీ సొంత చెల్లెలనే నిజాన్ని నమ్మలేకపోతున్నావా.. అవనికి షాకిచ్చిన అక్షయ్

Intinti Ramayanam Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: పల్లవి నీ సొంత చెల్లెలనే నిజాన్ని నమ్మలేకపోతున్నావా.. అవనికి షాకిచ్చిన అక్షయ్

Telugu Samayam 2 weeks ago

Intinti Ramayanam Today: ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్‌లో అటు మీనాక్షి ఇటు చక్రధర్ ఇద్దరికీ ఘోర అవమానం జరుగుతుంది. మీనాక్షి తన సొంత తల్లి అనే నిజం తెలియక పల్లవి నోటికొచ్చినట్లుగా వాగుతుంది.

మీనాక్షిని అనరాని మాటలు అంటుంది. మరోవైపు చక్రధర్‌ని తండ్రి అని కూడా చూడకుండా భరత్ అవమానిస్తాడు. ఇక భరత్.. రాజేశ్వరి అత్తయ్య కొడుకు అన్న విషయం అవనికి చెప్పి అక్షయ్ షాకిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.


Intinti Ramayanam April 02nd Episode: కళ్యాణం పూర్తయిన తర్వాత మీనాక్షిని గుడి బయట నిల్చోబెట్టి పల్లవి మాటలతోనే వాయించేస్తుంది. నువ్వు మా డాడ్‌కి భార్యవని అందరికీ తెలియడం కోసం మా డాడ్‌తో కలిసి తాళిబొట్టు ఇవ్వాలని ప్లాన్ చేశావ్... లేకపోతే మా డాడ్‌తో కలిసి ఎందుకొచ్చావ్.. మా డాడ్‌తో నిజం చెప్పించి మా మామ్-డాడ్ మధ్య చిచ్చు పెట్టావ్.. అయినా నీ భర్త ఎవరన్నది అందరికీ చెప్పాలనుకోవడానికి నువ్వు ఏమైనా వయసులో ఉన్న ఆడదానివా.. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవరాలు అందరూ ఉన్న ఈ వయసులో నీకు నీ భర్తతో పనేంటి.. నీ భర్త గురంచి అందరికీ చెప్పి నువ్వు ఉద్ధరించేంది ఏంటి.. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ఏంటనేది తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా.. దేవుడి గుడిలో భార్యభర్తలుగా తాళిబొట్టు ఇవ్వడానికి మా డాడ్ వచ్చేటట్టుగా చేశావంటే రేపు మా డాడ్‌తో కాపురం చేయాలని చూస్తున్నావా.. మా డాడ్‌తో కాపురం చేసి ఈ వయసులో మళ్లీ పిల్లల్ని కనాలనుకుంటున్నావా.. ఆడదానివేనా నువ్వు.. కొంచెమైనా సిగ్గుందా నీకు.. నీ భర్తతో నీకు ఎలాంటి సంబంధం వద్దని చెప్పిన నువ్వు.. మళ్లీ ఇలా మా డాడ్‌తో కలిసి తాళిబొట్టు ఇచ్చావంటే నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదని అర్థమవుతుంది.. కొంచెం కూడా సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు లేవన్నమాట.. అసలు నువ్వు మనిషివేనా.. నీకు చెప్తే అర్థం కాదా.. థూ.. అంటూ ఊసి పల్లవి వెళ్లిపోతుంది. ఈ మాటలకి మీనాక్షి అక్కడే కూలబడిపోతుంది.అవని భజన షురూ

ఇక అందరూ ఇంటికి రాగానే ఎప్పటిలా అవని భజన మొదలుపెడతారు. రాములవారి కళ్యాణం బాగా జరిగింది.. చాలా సంతోషంగా ఉంది అవని.. అంటుంది పార్వతి. మీ అమ్మ మొక్కు తీరుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డావ్.. ఇప్పుడు మొక్కు తీరింది కదా హ్యాపీనా.. అని అక్షయ్ అడుగుతాడు. అది ఎప్పుడో భరత్ పుట్టినప్పుడు మొక్కుకున్న మొక్కు అంట అండి.. ఇన్నేళ్ల తర్వాత తీరింది.. మా అమ్మ మొక్కు గురించి చెప్పగానే మీరు కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు.. చాలా థాంక్స్ అండీ.. అంటుంది. నువ్వు అన్నయ్యకి థాంక్స్ చెప్పడం కాదు వదిన.. మేమే నీకు థాంక్స్ చెప్పాలి.. దేవుడి కళ్యాణం చూడటమే అదృష్టం అనుకుంటే నువ్వు నా చేత పల్లవి చేత దేవుడికే బట్టలు ఇప్పించావ్.. థాంక్స్ వదిన.. అంటాడు కమల్.


వెళ్లి వంట చెయ్

దేవుడి కళ్యాణం చూసి అందరూ హ్యాపీగా ఉంటే నువ్వేంటి మాడిపోయిన చపాతీలా ఫేసు పెట్టావ్.. మా వదిన ఏం చేసినా కూడా తన గొప్పగా ఎప్పుడూ చెప్పుకోదు.. మా వదినని చూసి నేర్చుకోవాల్సింది నువ్వే.. అని పల్లవితో అంటాడు కమల్. పల్లవి.. ఇంటికొచ్చేసరికి ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు.. వెళ్లి త్వరగా వంటపని చూడు.. అంటుంది పార్వతి. పల్లవి కోపంగా లుక్ ఇచ్చేసరికి ఏంటి అలా చూస్తున్నావ్.. చెప్పేది నీకే.. వెళ్లి వంటపని చూడు.. అని పార్వతి అంటుంది. హలో అమ్మ చెప్పింది కదా.. నాకు అయితే రైస్ వద్దమ్మా చపాతీ చెయ్.. అన్నయ్యా నీక ఏం కావాలని అందర్నీ పేరు పేరున అడిగి కమల్ ఒక పెద్ద లిస్ట్ చెప్తాడు. ఇదంతా చూసి పల్లవి ఫేస్ మాడుతుంది.. కానీ అవని మాత్రం పల్లవి వైపు జాలిగా చూస్తుంది.


నాకు ఈ పరిస్థితి రావడానికి అవనినే కారణం

చక్రధర్ చెప్పిన మాటలు తలచుకొని అవని ఎమోషన్ అవుతుంది. మరోవైపు కిచెన్‌లో పల్లవి పని చేస్తూ తిట్టుకుంటుంది. పండగ రోజు కూడా నాకు ఈ చాకిరి తప్పడం లేదు.. నా బతుకు పనిమనిషి కంటే దారుణంగా అయిపోయింది.. నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మా డాడ్, ఆ అవని.. అని తిట్టుకుంటుంది. ఇంతలో అవని అక్కడికి వస్తుంది. మా అమ్మే తన కన్నతల్లి అని తెలిస్తే పల్లవి ఎలా రియాక్ట్ అవుతుంది.. తన మీద ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుంటుందా.. నేను తన సొంతక్కని తెలిసి నన్ను అభిమానంగా చూసుకుంటుందా.. అసలు తను ఎలా రియాక్ట్ అవుతుందో.. అనుకుంటుంది.


పల్లవికి చేయి కోసుకోగానే

ఒక్కదానివే అన్నీ చేసేసరికి ఆలస్యం అవుతుంది.. నేను అన్నం, కూర వండుతాను.. నువ్వు చపాతీ పిండి కలుపు.. అని అవని చెప్తుంది. అవసరం లేదు.. ఇంటి పని, వంటపని నాకు నువ్వు ఇచ్చిన పనిష్మెంట్‌యే కదా.. నన్ను రాచిరంపాన పెడుతున్నది చాలదన్నట్లు.. మళ్లీ అందరిముందు నాకేదో హెల్ప్ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వాలని వచ్చావా.. ఏం అవసరం లేదు.. అని పల్లవి కోపంగా బెండకాయలుకోస్తూ వేలు కోసుకుంటుంది. కోపాన్ని మనుషుల మీద చూపిస్తే ఏం కాదు.. కానీ పని మీద చూపిస్తే ఇలానే ఉంటుంది.. బాగా తెగిందా ఏది చూడనివ్వు.. అని అవని అంటుంది.


సొంత చెల్లి అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నావ్

ఏం అక్కర్లేదు నేను ఏదో సొంత చెల్లెల్ని అయినట్లు నా మీద ఏం జాలి చూపించక్కర్లేదని పల్లవి విసుక్కుంటుంది. నా మీద కోపాన్ని చూపిస్తేనో, నన్ను తిడితేనో గాయం మానదు.. పసుపు పెడితే తగ్గుతుందని అవని పెట్టబోతుంది. ఏం అవసరం లేదు.. నాకు నీ సింపథీ అవసరం లేదని చెప్పానా.. అని పల్లవి అంటుంది. సరే పసుపు పెట్టుకుంటే రక్తం కారకుండా, సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది.. నువ్వు అయినా పెట్టుకో.. అని డబ్బా అక్కడ పెట్టి అవని వెళ్లిపోతుంది. నాకు ఈ కష్టాలు, బాధలు అన్నీ నీవల్లే.. నా వేలు తెగినందుకు చాలా సంతోషంగా ఉంది కదా.. ఛ.. అని పల్లవి అంటుంది.


ఆయన నీకు భర్త కానీ నాకు తండ్రి కాదు

మరోవైపు మీనాక్షి వాళ్లు ఇంటికొచ్చేసరికి ఫోన్ చూసి నవ్వుకుంటుంటాడు భరత్. వాళ్లతో పాటు చక్రధర్ కూడా వస్తాడు. ఈయన మన ఇంటికి రావాల్సిన పనేంటి.. ఈయన ఎందుకొచ్చాడు మన ఇంటికి.. అంటూ భరత్ ఫైర్ అవుతాడు. రేయ్ భరత్ ఇంటికొచ్చిన మనిషి గురించి మంచి, మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నావురా.. రాములవారి కళ్యాణం దగ్గర అక్షింతలు తీసుకొచ్చి మీ దంపతుల మీద వేసి ఆశీర్వదిస్తే మీకు సంతానం కలుగుతుందని నేనే మీ నాన్నగారిని తీసుకొచ్చానురా.. అంటుంది మీనాక్షి. నాకు నాన్నేంటి.. ఆయన నీకు భర్తేమో కానీ నాకు నాన్న కాదు.. ఇన్నేళ్లుగా మనం కష్టాలు పడటానికి, అవమానాలు భరించడానికి ఈయనే కదా కారణం.. ఈయన మనకి చేసిన మోసానికి ఏ శిక్ష వేసినా తక్కువేనమ్మా.. ఈయన ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది.. అలాంటివాడు నన్ను ఆశీర్వదిస్తే చెడు జరుగుతుందే తప్ప ఎలాంటి మంచి జరగదు..


ప్రణతి చెప్పినా సరే

ఈయన చేసిందంతా మర్చిపోయావా అమ్మా నువ్వు.. అయినా నువ్వు చేసిన ద్రోహం సరిపోదు అన్నట్లు మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తున్నావా.. మేము సంతోషంగా, ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా.. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు.. బయటికి పో.. అని చక్రధర్‌తో అంటాడు. రేయ్ భరత్.. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి నువ్వు.. నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది.. మీ నాన్నగారు చేసింది తప్పేరా కాదనట్లేదు.. కానీ చేసిన తప్పు తెలుసుకున్నారు కాబట్టే ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు.. భరత్ మీ నాన్న మారార్రా అర్థం చేసుకోరా.. అని మీనాక్షి బతిమాలుతుంది. మీ అమ్మగారు చెప్తుంది నిజమే భరత్.. మావయ్య గారు నిజంగా మారారు కాబట్టే అత్తయ్య కూడా అర్థం చేసుకున్నారు.. అవని వదిన కూడా అర్థం చేసుకుంది కాబట్టే మావయ్యని నాన్న అని పిలుస్తుంది.. నువ్వు ఇంకా పాత విషయాన్ని మర్చిపోకుండా పంతానికి పోవడం మంచిది కాదు భరత్.. అని ప్రణతి అంటుంది.


నువ్వే వెళ్లిపోమని చెప్పు

నోరుముయ్.. నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్.. నువ్వు చెప్తే తప్ప నేనే చేసిది కరెక్టో కాదో తెలుసుకోలేనంత పిచ్చివాడ్ని అనుకున్నావా నేను.. మాట్లాడకు.. అంటూ ప్రణతిపై రెచ్చిపోతాడు. నువ్వు ఈయనకి సపోర్ట్ చేస్తున్నావ్ కాబట్టే నేను వెళ్లమంటే వెళ్లడని నాకు అర్థమైంది.. నువ్వే వెళ్లమని చెప్తావా లేక నా పద్ధతిలోనే బయటికి పంపించాలా.. మాట్లాడవేంటమ్మా.. వెళ్లిపోమని చెప్పు ఆయని.. అంటూ మీనాక్షి మీద ఫైర్ అవుతాడు. వెళ్లిపోమని చెప్పేదాన్నే అయితే నాతో పాటు ఇంటికి ఎందుకు తీసుకొస్తానురా.. ఏ భార్య అయినా భర్తని గౌరవించాలి అనుకుంటుంది తప్ప.. పొమ్మని చెప్పలేదురా.. అర్థం చేసుకోమని చెప్తుంటే ఎందుకు నాన్న అంత పొగరుగా మాట్లాడుతున్నావ్.. అని మీనాక్షి అంటుంది.


కొడుకు కంటే భర్త ఎక్కువైపోయాడా?

నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందమ్మా.. ఈయన ఇన్నాళ్లుగా నిన్ను, నన్ను అనాథలుగా వదిలేసి వెళ్లిపోయాడు.. నీ భర్త ఎవరో నువ్వు, నా తండ్రి ఎవరో నేను చెప్పుకోలేని విధంగా అడ్రెస్ లేని వాళ్లలా చేశాడు.. అలాంటివాడు 25 ఏళ్ల తర్వాత వచ్చి నేను నీ భర్తనని నలుగురు ముందు చెప్పేసరికి నీకు నీ కొడుకు కన్నా నీ భర్తే ఎక్కువైపోయాడన్నమాట.. కన్నకొడుకు మీద ఉన్న ప్రేమ కన్నా నీకు నీ భర్త మీద ఉన్న గౌరవమే ఎక్కువన్నమాట.. నువ్వు ఇలా మారిపోతావని అనుకోలేదమ్మా.. నువ్వు ఇలాంటి మోసగాడ్ని సమర్థిస్తున్నావంటే నీకు నీ కొడుకు మీద ఉన్న ప్రేమ తగ్గిపోయిందన్నమాట.. నీ భర్త మీదున్న ప్రేమ పెరిగిపోయిందన్నమాట.. ఇన్నాళ్లూ మా అమ్మకి నేనంటే ప్రాణం అనుకున్నానమ్మా.. ఇలాంటి మోసగాడి కోసం కొడుకును కూడా పట్టించుకోలేని విధంగా మారిపోతావని అనుకోలేదమ్మా.. అని భరత్ అంటాడు.


భరత్‌కి లాగి ఒక్కటిచ్చిన మీనాక్షి

ఈ మాటలకి రేయ్ భరత్.. అంటూ లాగి ఒక్కటిస్తుంది మీనాక్షి. ఒక భర్తగా నీకు, ఒక తండ్రిగా నా కొడుక్కి నేను ఎలాంటి న్యాయం చేయలేకపోయాను.. అలాంటప్పుడు భరత్ అన్నదాంట్లో తప్పేముంది మీనాక్షి.. అది వాడి ఆవేదన తప్ప ఆవేశం కాదు మీనాక్షి.. మన బిడ్డని కొట్టి నువ్వు తప్పు చేశావ్.. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు మీనాక్షి.. అంటాడు చక్రధర్. రేయ్ భరత్.. మీ అమ్మని ఎంత మాట అన్నావ్.. నేను కొడుకుని పట్టించుకోని దానిలా కనిపిస్తున్నానా.. ఈ అమ్మని నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా భరత్.. నా కొడుకు నా ప్రాణం అనుకున్నాను కాబట్టి నిన్ను బతికించుకోవడం కోసం ముక్కోటి దేవతల్ని మొక్కుకున్నాను రా..


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam