Intinti Ramayanam June 02nd Episode: రాజేశ్వరి కన్నకొడుకు భరత్. ఆవిషయం అతనికి కూడా తెలియదు. అవనికి చక్రధర్‌కి తెలిసినా కూడా చెప్పరు. అయితే రాజేశ్వరి కన్నుమూయడంతో..
భరత్ చేతులపైనే ఆమె దహన సంస్కారాలు జరగడం నేటి (జూన్ 02) ఎపిసోడ్‌లోని హైలైట్.
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకోవడంలో ముందుంటుంది అవని. కూతురు ఆరాధ్య పుట్టిన రోజుకి తన శత్రువులందర్నీ పిలుస్తుంది అవని. ఆమె అంటే అస్సలుగిట్టని రాజేశ్వరిని కూడా పిలుస్తుంది. కట్టుకున్న వాడు కళ్ల ముందే మీనాక్షితో ఉండటం చూసి తట్టుకోలేకపోయిన రాజేశ్వరి.. ఆమెను చంపేయాలని పీకపట్టుకుంటుంది. అయితే తగువులాటతో అవని తోసేయడంతో రాయిపై పడి తలకి బలమైన గాయం అవుతుంది. ఆసుపత్రికి తరిలించినా కూడా లాభం లేకపోవడంతో కన్నుమూస్తుంది రాజేశ్వరి. ఇక ఈరోజు (జూన్ 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ఈ చక్రధర్, అవనిలే మా అమ్మని చంపేశారు. వీళ్ల నీడ కూడా మా మామ్‌పై పడకూడదు అంటూ భోరున ఏడుస్తుంది పల్లవి. లేదమ్మా.. అత్తయ్యకి ఇలా జరిగినందుకు మామయ్య కూడా బాధపడుతున్నారు అది అర్థం చేసుకోలేకపోతున్నావ్.. మీ నాన్నని అలా అనడం కరెక్ట్ కాదు పల్లవీ.. అంటూ నీతి సూత్రాలు చెప్తుంటాడు అక్షయ్. ఇక ఓపక్క తల్లి చనిపోయి విలవిల్లాడుతున్న టైమ్‌లో కూడా అవని భజన ఆపరు కమల్, శ్రీకర్‌లు. 'అవని వదిన అందరూ బావుండాలనే కోరుకుంటుంది తప్పితే.. ఎవరికీ అన్యాయం చేయాలని కోరుకోదు.. అవని వదినను నిందించడం తప్పు పల్లవీ.. అవని వదినకు అత్తయ్య చనిపోవడానికి సంబంధం ఏంటి? వదినను ఏమీ అనొద్దు' అని అంటారు శ్రీకర్, పల్లవి. ఒడియమ్మా.. ఓ పక్క మనిషి చనిపోతే ఇప్పుడు కూడా అవని భజనే

ఇక ఆపండీ.. ఆపండీ.. అంటూ భోరున విలపిస్తుంది పల్లవి. మీరందరూ అవని గురించే మాట్లాడుతున్నారు తప్ప.. మా మామ్ చనిపోయిందనే బాధ మీలో ఎవరికీ లేదు. నా తల్లి ప్రాణం పోయినా కూడా.. మీరు ఈ హంతకురాలినే సమర్థిస్తున్నారు. ఈ చక్రధర్, అవనిలను ఆ దేవుడు క్షమించినా కూడా నేను క్షమించనూ.. క్షమించనూ అంటూ కుప్పకూలిపోతుంది పల్లవి. అమ్మా.. అమ్మా అంటూ విలవిల్లాడుతుంది పల్లవి. కట్ చేస్తే.. స్మశానంలో సీన్. నా భార్యకి నాపై కోపం తగ్గలేదు అంటూ ఆమె శవం దగ్గర ఏడుస్తూ ఉంటాడు చక్రధర్. చివరి క్షణం వరకూ నన్ను అర్థం చేసుకోకుండానే వెళ్లిపోయిందిరా అని కన్నీటిపర్యంతం అవుతాడు.
వద్దు నాన్నా వద్దు.. నిజం చెప్తే మన తలలు వేయి ముక్కలౌను గాక

అనంతరం అవని దగ్గరకు వచ్చి.. ఒకసారి ఇటు రామ్మా అంటూ పక్కకి తీసుకుని వెళ్తాడు. చనిపోయింది తన కన్నతల్లి అనుకుని పల్లవి బాధపడుతుంది.. తన కన్నతల్లి మీనాక్షి అని చెప్తే పల్లవికి కాస్త ఉపశమనం ఉంటుంది.. ఇప్పుడు ఆమెకి నిజం చెప్పడం చాలా అవసరం.. వెళ్లి చెప్పేస్తాను అని అంటాడు. దాంతో అవని.. మనం నిజం చెప్తే తల వేయిముక్కలౌను గాక అన్న శాపం ఉంది మర్చిపోయారా? అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి.. ఎప్పటిలాగే వద్దని ఆపేస్తుంది. చెప్పొద్దు నాన్నా అంటూ అడ్డంగా తలాడిస్తుంది అవని. ఇప్పుడు పల్లవి ఉన్న పరిస్థితుల్లో ఎవరేం చెప్పినా నమ్మదు. తన నమ్మకపోతే నిజం చెప్పినా ప్రయోజనం ఉండదు' అంటూ నోరునొక్కేస్తుంది అవని.
నువ్వు తలకొరివి పెట్టడానికి వీళ్లేదు..

అయ్యా దహనసంస్కారాలు చేయాలి.. ఈమె భర్త గారు రండి అని పిలుస్తాడు పంతులు. ఈమె భర్తని నేనే అంటూ ఊపించుకుంటూ వెళ్తాడు చక్రధర్. ఆగరా ఎక్కడికీ అంటూ అడ్డుపడుతుంది పల్లవి. 'నువ్వు మా మామ్‌కి తలకొరివి పెట్టడానికి వీళ్లేదు. కట్టుకున్న భార్యని వద్దనుకుని వెళ్లిపోయావ్.. భార్య వద్దనుకున్న నువ్వు.. తల కొరివి పెట్టడానికి ఎలా వస్తున్నావ్.. నువ్వు తల కొరివి పెట్టడానికి వీళ్లేదంతే' అని రంకెలు వేస్తుంది పల్లవి. ఇంతలో మన అవని హజ్బెండ్ అక్షయ్.. సంస్కృతి, సాంప్రదాయం అంటూ హితోపదేశం చేస్తాడు. ఆపవయ్యా చెప్పొచ్చావ్?? కట్టుకున్న భార్యని వదిలేసి వేరే దానితో ఉండటం సాంప్రదాయమా?
మా మామ్ ఆత్మ క్షోభిస్తోంది.. నేను ఎవరు చెప్పినా వినను

ఈ చక్రధర్ చేసిన తప్పుకి మా మామ్ నరకం అనుభవించింది. తను చనిపోయాక కూడా.. మా మామ్ ఆత్మని క్షోభ పెట్టడానికి తలకొరివి పెడతావా? మా మామ్‌ని వద్దనుకున్నారు కాబట్టి.. ఇతను ఆ మీనాక్షి మాత్రమే భర్త అని అంటుంది పల్లవి. ఇలాంటి సందర్భంలో పంతాలు పౌరుషాలు ఉండకూడదు పల్లవీ.. కర్మకాండలు భర్త నిర్వహించాలి అని అంటుంది అవని. 'ఆపెహే.. నువ్వు నాకు చెప్పకు.. అస్సలు మాట్లాడకు.. నాకు ఎవరు చెప్పినా వినను.. ఇతను మా మామ్‌కి తలకొరివి పెట్టడానికి వీళ్లేదు.. పో' అని అంటుంది పల్లవి. దాంతో వెనుతిరుగుతాడు చక్రధర్.
అమ్మకి తలకొరివి మా తమ్ముడు పెడతాడు.. అద్దిరిపోయే సీన్

దాంతో అవని.. భరత్ రాజేశ్వరి పిన్ని సొంత కొడుకు కాబట్టి తన కొడుకు చేతులపైనే కొరివి పెట్టిస్తేనే మంచిది అని అనుకుంటుంది. చనిపోయిన ఆమెకి భర్త కానీ.. కొడుకు కానీ కర్మకాండలు చేయాలి అని అంటుంది అవని. 'వద్దూ.. ఇతనితో కర్మకాండలు జరిపిస్తే మా మామ్ ఆత్మకి శాంతి కలగదు అని అంటుంది పల్లవి. మరి కర్మకాండలు ఎవరు జరిపిస్తారు అని పంతులు అడగడంతో.. భరత్ దగ్గరకు వెళ్లిన పల్లవి.. అతని చేయి పట్టుకుని తీసుకుని వచ్చి.. మా మామ్ చివరి రోజుల్లో భరత్‌ని కొడుకులా చూసుకుంది కాబట్టి భరత్ తలకొరివి పెడతాడు. అప్పుడే మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది అని అంటుంది పల్లవి.
మీ అమ్మకి తలకొరివి పెట్టవా.. వాటే సీన్

భరత్.. మా మామ్‌కి తలకొరివి పెట్టు. మా మామ్‌ని అమ్మా అని పిలుస్తావ్ కదా.. అమ్మ కోసం ఈ పని చేయలేవా? అని అంటుంది పల్లవి. దాంతో భరత్.. రాజేశ్వరికి తలకొరివి పెడతాడు. అమ్మా అమ్మా అంటూ భోరున ఏడుస్తారు భరత్, పల్లవిలు. మొత్తానికి సీన్ అయితే అద్దిరిపోయింది. రాజేశ్వరి అంటూ తల బాదుకుని ఏడుస్తాడు చక్రధర్. మొత్తానికి కన్నకొడుకు చేతులపైనే రాజేశ్వరికి దహన సంస్కారాలు జరుగుతాయి. ఏడొద్దు నాన్నా.. భర్తగా మీరు కొరివి పెట్టకపోయినా.. కన్నకొడుకు చేతులపై జరిపించుకున్నందుకు పిన్ని ఆత్మ శాంతిస్తుంది అని తండ్రి చక్రధర్‌ని ఓదార్చుతుంది అవని.

