Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Intinti Ramayanam Today మే 30 ఎపిసోడ్: అవని ముందే మీనాక్షి చెంప పగలకొట్టిన పల్లవి.. 'ఈ వయసులో మొగుడు కావాల్సి వచ్చాడే'

Intinti Ramayanam Today మే 30 ఎపిసోడ్: అవని ముందే మీనాక్షి చెంప పగలకొట్టిన పల్లవి.. 'ఈ వయసులో మొగుడు కావాల్సి వచ్చాడే'

Telugu Samayam 2 weeks ago

Intinti Ramayanam May 30th Episode: పల్లవిని అవని కొట్టడం అనేది ఈ సీరియల్‌లో చాలా రొటీన్.. వారానికి రెండు మూడుసార్లైనా పల్లవిని నాలుగు పీకడం..

ఐదారు వార్నింగ్‌లు ఇవ్వడం చాలా కామన్. అయితే నేటి (మే 30) ఎపిసోడ్‌లో అవని ముందే మీనాక్షిని కొట్టింది పల్లవి.


ఆరాధ్య పుట్టినరోజు ఎపిసోడ్‌తో ఇంటింటి రామాయణం సీరియల్ సా..గుతోంది. ఈరోజు (మే 30) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. బొండంలో మందు మిక్స్ చేసుకుని తాగి ఎంజాయ్ చేయాలనుకుంటారు శ్రీకర్, కమల్‌లు. ఇంతలో పల్లవి, భానుమతిలు వచ్చి.. మీకేనా బొండం మాకులేదా? అంటూ లాక్కుని తాగుతారు. వాళ్లు లొట్టలేసుకుని లాగించేస్తారు. వీళ్లు తాగితే తాగారు.. ఏం రచ్చ చేస్తారో ఏంటో అని కంగారు పడతారు. వాళ్లు అనుకున్నట్టుగానే.. తాగుతూ తూలుతూ ఫంక్షన్ దగ్గరకు వెళ్లి రచ్చ రచ్చ చేస్తారు పల్లవి, భానుమతిలు. మగాళ్లు ఒట్టి మాయగాళ్లే అంటూ పాట అందుకుని డాన్స్ చేస్తారు. వాళ్లు డాన్స్ చేయడమే కాకుండా.. అవని, అక్షయ్‌లతో కూడా.. అబ్బనీ తీయనీ దెబ్బా అంటూ డాన్స్ చేయిస్తారు. ఇక పల్లవి, కమల్‌లు.. ఇదేమిటమ్మా మాయా మాయా అంటూ స్టెప్‌లు వేస్తారు. వాళ్లు చేశారు.. మేం చేశాం.. మీరు కూడా డాన్స్ చేయండి అంటూ.. ప్రణతి, భరత్‌లను కూడా లాగుతుంది పల్లవి. దాంతో రాములా రాములా అంటూ స్టెప్‌లు వేస్తారు భరత్, ప్రణతి. ఇక పల్లవి, భానుమతిలు తాగి ఊగడం చూసిన అవని.. మజ్జిగ తాగించి మత్తు వదిలిస్తుంది. నిజం చెప్పేయ్ అవనీ..

ఇక అవని.. గరిటె పట్టుకుని వంట చేస్తుంటే.. అక్షయ్ వచ్చి ఆగలేకపోతున్నాను అని అంటాడు అక్షయ్. ఛీ ఛీ.. అవేం మాటలు అని సిగ్గుపడిపోతుంది అవని. నేను అన్నది దాని గురించి కాదు కానీ.. రాజేశ్వరి, శ్రియ, భరత్ వీళ్లందర్నీ ఎలా తీసుకొచ్చావ్? ఏం చేశావ్ అని అడుగుతాడు. ఏదొకటి చేశానులే కానీ.. అవన్నీ ఇప్పుడెందుకు.. నాకంత టైమ్ లేదు అని అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది అవని. అసలు అవని ఏం చేసి ఉంటుంది అంటూ ఆలోచనలో పడతాడు అక్షయ్. అటు చక్రధర్.. 'ఇదే మంచి సమయం అవనీ.. అందరికీ నిజం చెప్పేయ్ అని అంటాడు. ఇప్పుడు చెప్తే ఆరాధ్య ఫంక్షన్ డిస్ట్రబ్ అవుతుంది.. ఫంక్షన్ కాగానే చెప్తాను అని అంటుంది అవని.


నేనేం చేసినా లోక కళ్యాణం కోసమేనండీ..

ఇక అక్షయ్.. అవని వెంటపడి.. వీళ్లందర్నీ ఎలా తీసుకుని వచ్చావో చెప్పు అని అడుగుతాడు. 'ఏం లేదండీ.. శ్రియకి ఫోన్ చేస్తే రానన్నది. దాంతో.. మామయ్య త్వరలోనే కోమాలో నుంచి బయటకు వస్తున్నారు.. ఆయన రాగానే ఎవరి ఆస్తి వాళ్లకి ఇస్తారు అని ఆశ కల్పించాను. ఆయన సృహలోకి వచ్చాక మీరు ఇక్కడ లేరంటే మామయ్య ఆలోచన మారిపోతుందని చెప్పాను. ఆ మాట చెప్పగానే పరుగెత్తుకుని వచ్చేసింది. అలాగే రాజేశ్వరి పిన్నికి.. భరత్‌ని తీసుకుని రాకపోతే.. పల్లవి మీకు పుట్టలేదనే నిజం అందరికీ చెప్పేస్తా అని అన్నారు.. దెబ్బకి భయంతో వచ్చేసింది.. శ్రియకి ఆశ కల్పించాను.. రాజేశ్వరి పిన్నికి భయం కల్పించాను. నేనేం చేసినా లోక కళ్యాణం, మన ఇల్లు బావుండాలనేనండీ' అని అంటుంది అవని.


నా కూతురు డ్రెస్ ముక్కలు చేసింది నువ్వేనని తెలుసు..

ఇక పల్లవి.. ఆరాధ్య కొత్త డ్రెస్‌ని ముక్కలుగా కత్తిరించేస్తుంది. అయితే కేక్ కటింగ్ టైమ్‌కి ఆ డ్రెస్‌తోనే ఆరాధ్య రావడం చూసి షాక్ అవుతుంది పల్లవి. డ్రెస్ అద్దిరిపోయిందని అందరూ అంటుంటే.. పల్లవి మాత్రం దిక్కులు చూస్తుంటుంది. ఇంతలో అవని వచ్చి.. 'ఆ డ్రెస్‌ని ముక్కలు చేసింది నువ్వేనని నాకు తెలుసు అని చెవిలో ఊదుతుంది. అయితే ఆ ముక్కలు చేసిన డ్రెస్‌ని మీనాక్షి సరి చేస్తుంది. ఆ డ్రెస్‌ని నేనే ముక్కలు చేశాననడానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతుంది పల్లవి. 'చెప్తే కమల్ నిన్ను తిరిమితరిమి కొడతాడు.. నీ కారణంగా నా కూతురి ఫంక్షన్ డిస్ట్రబ్ కావడం ఇష్టం లేదు కాబట్టి సైలెంట్‌గా ఉన్నాను.. ఫంక్షన్ అయిపోనియ్ అప్పుడు చెప్తా నీ సంగతి' అని అంటుంది అవని.


రా మీనాక్షీ.. ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడికి పెద్ద సమస్యే

నా సంగతి నువ్వు చెప్పడం కాదు.. నీ సంగతే నేను తేల్చుతా.. ఈ ఫంక్షన్‌లో నువ్వూ మీ అమ్మా అందరి ముందు తలదించుకునేట్టు చేస్తా.. అని అనుకుంటుంది పల్లవి. ఇక ఆరాధ్య కేక్ కట్ చేయడంతో అందరూ కలిసి కేక్ తినిపిస్తారు. ఇంతలో మన ఫిటింగ్ మాస్టర్ అవని.. 'నాన్నా రండీ అని చక్రధర్‌ని పిలుస్తుంది. అయితే మనోడికి ఇద్దరు పెళ్లాలు కాబట్టి.. ఏ పెళ్లంతో వెళ్తాడా అని అంతా చూస్తుంటారు. దాంతో చక్రధర్.. రా మీనాక్షీ అని ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపుతో రాజేశ్వరి రగిలిపోతుంటుంది. పల్లవి కూడా పగతో ఉడికిపోతుంది.


అద్దీ లెక్కా.. మీనాక్షి చెంప పగలకొట్టిన పల్లవి.. 'అమ్మమ్మ వయసులో మొగుడు కావాల్సి వచ్చాడా?

వెళ్లాలా వద్దా అని మీనాక్షి ఆలోచిస్తుంటే.. రా మీనాక్షీ రా అని మళ్లీ పిలుస్తాడు చక్రధర్. ఇక మీనాక్షి అడుగులో అడుగు వేసుకుంటూ.. చక్రధర్‌తో కలిసి.. ఆరాధ్యకి కేక్ తినిపిస్తుంటుంది. ఇంతలో పల్లవి ఆవేశంగా వచ్చి.. మీనాక్షిని లాగిపెట్టి కొడుతుంది. అది చూసి రాజేశ్వరికి సమ్మగా ఉంటే.. అవనికి సుర్రున కాలుతుంది. దాంతో మా అమ్మనే కొడతావా అంటూ తనకి అలవాటైన పద్దతిలో పల్లవిని కొడుతుంది అవని. ఆచెంపా ఈ చెంపా వాయించిపారేస్తుంది. దాంతో పల్లవి తిరగబడుతుంది. 'నీ అమ్మకీ సిగ్గులేదు.. నీకూ సిగ్గులేదూ.. పాతికేళ్లు మొగుడుకి దూరంగా ఉన్నావ్.. నీ మనవరాలితో అమ్మమ్మా అని పిలిపించుకునే వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చాడా?


నీలాంటిది బతకకూడదే..

మా డాడ్ పక్కన భార్యగా ఉండాల్సిన స్థానం.. నీది కాదు. అగ్నిసాక్షిగా తాళి కట్టిన మా మామ్‌ది. మా డాడ్‌తో కాపురంచేసి నువ్వు పిల్లల్ని కన్నావేమో కానీ.. నా అమ్మకి కట్టినట్టుగా అగ్నిసాక్షిగా మా డాడ్ నీ మెడలో తాళి కట్టాడా? అని దులిపేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో అయితే.. మీనాక్షి పీక పట్టుకున్న రాజేశ్వరి.. 'నీలాంటిది బతికి ఉండకూడదు అంటూ నిన్ను చంపేస్తానని చంపేయబోతుంది. మరి ఇలాంటి సీన్‌లో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వాలి కదా.. మన అవని ఏయ్.. ఆగు పిన్నీ అంటూ ఎంట్రీ ఇచ్చేస్తుంది. రాజేశ్వరిని వెనక్కి నెట్టేయడంతో పడిపోతుంది. కరెక్ట్ టైమ్‌కి పల్లవి వస్తుంది. మరి రాజేశ్వరి ఉన్నదో పోయిందో తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam