Dailyhunt
Investments: మార్కెట్లు పడుతున్నా డెట్ ఫండ్స్ అద్భుతం.. రెండేళ్లలో ఎఫ్‌డీలకు మించి రిటర్న్స్!

Investments: మార్కెట్లు పడుతున్నా డెట్ ఫండ్స్ అద్భుతం.. రెండేళ్లలో ఎఫ్‌డీలకు మించి రిటర్న్స్!

Telugu Samayam 2 weeks ago

FD vs Debt Funds: మీరు పెట్టుబడుల కోసం ఏం ఎంచుకుంటుంటారు. ఇక్కడ ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. రిస్క్ ఉన్న పథకాలు.. రిస్క్ లేని పథకాలు ఉంటాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ అందిస్తుంటాయి.

ఇక్కడ నిర్దిష్ట కాల పరిమితికి నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రాబడి వస్తుంటుంది. ఇటీవల ఆర్బీఐ కీలక రెపో రేట్లను తగ్గిస్తున్న క్రమంలో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆకర్షణ కోల్పోతున్నాయి. వీటి వడ్డీ రేట్లు చారిత్రక కనిష్ఠాలకు పతనం అయ్యాయి. అందుకే ఇందుకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గగా.. ఇటీవల ఎస్బీఐ కూడా ఎఫ్‌డీ రేట్లు పెంచేసింది. అయినా ఇతర చాలా బ్యాంకులు, ప్రత్యామ్నాయ పథకాల కంటే రాబడి తక్కువగానే ఉంది. అందుకే మరోసారి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై దృష్టి మళ్లిస్తున్నారు ఇన్వెస్టర్లు.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఆకర్షణీయ స్థాయిలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ అందిస్తున్నాయి. దాదాపు 176 డెట్ మ్యూచువల్ ఫండ్స్.. రెండేళ్ల పరిమితిలో దాదాపు 6.5 శాతానికి మించి రిటర్న్స్ అందించడం విశేషం. దీంతో చాలా మంది ఇప్పుడు సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఎఫ్‌డీ కంటే కాస్త అధిక రాబడి వచ్చినా.. ఈ మార్కెట్ లింక్డ్ ఇన్‌స్ట్రుమెంట్లపై దృష్టి మళ్లిస్తుంటారు.

అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మెరుగ్గా అందించినా.. ఇక్కడ మార్కెట్ రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐ 46 రోజుల నుంచి 179 రోజుల డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ వడ్డీ రేటు 5.10 శాతం నుంచి 5.35 శాతానికి చేరింది. ఇక 180 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై 5.60 శాతం నుంచి 5.85 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది.

ఇక్కడ రెండేళ్ల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే చాలా వరకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అద్భుత స్థాయిలో రిటర్న్స్ ఇచ్చాయి. ఇ్కకడ 176 డెట్ ఫండ్స్.. ఎస్బీఐ రిటర్న్స్‌ను అధిగమించేశాయి. ఇంకా డెట్ ఫండ్స్.. రెండంకెల మేర రిటర్న్స్ కూడా ఇచ్చాయి. ఆదిత్య బిర్లా ఎస్ఎల్ క్రెడిట్ రిస్క్ ఫండ్, హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ రిస్క్ ఫండ్, డీఎస్పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ వరుసగా 14.18 శాతం, 13.07 శాతం, 12.75 శాతం మేర రాబడి అందించాయి. ఆదిత్య బిర్లా ఎస్ఎల్ మీడియం టర్మ్ ప్లాన్ 10.89 శాతం రాబడి అందించింది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నుంచి.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సేవింగ్స్ ఫండ్ 7.38 శాతం మేర రిటర్న్స్ అందించాయి. టాటా అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్ ఇక్కడ 6.5 శాతం రాబడి వచ్చింది.

గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పైన ఇచ్చింది సమాచారం మాత్రమే.. పెట్టుబడికి సిఫార్సు కాదు. కాబట్టి.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam