Dailyhunt
IPL ఆల్‌టైమ్ రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో ఆర్సీబీ స్టార్.. సీఎస్కే మ్యాచ్‌తో చరిత్ర సృష్టించేందుకు సిద్ధం!

IPL ఆల్‌టైమ్ రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో ఆర్సీబీ స్టార్.. సీఎస్కే మ్యాచ్‌తో చరిత్ర సృష్టించేందుకు సిద్ధం!

Telugu Samayam 5 days ago

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లోనూ అదే జోష్ కొనసాగిస్తోంది. ఆ జట్టు కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఐపీఎల్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు.

చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కి ముందు భువనేశ్వర్ కుమార్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ఐపీఎల్ కెరీర్‌లో భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు 199 వికెట్లు సాధించాడు. 191 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ తరఫును చాలా కాలం కీ రోల్ పోషించి కెరీర్‌లో 199 వికెట్లు పడగొట్టాడు. ఇంకొక్క వికెట్ తీస్తే 200 క్లబ్‌లోకి చేరతాడు. యుజ్వేంద్ర చాహల్ తర్వాత ఐపీఎల్‌లో 200 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ నిలవనున్నాడు. యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో 224 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

పేస్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన భువీని మెగా వేలంలో ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ రిలీజ్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ఫస్ట్ ఛాయీస్‌గా భువనేశ్వర్‌ను దక్కించుకుంది.

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు.. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఏడు వికెట్లు పడగొట్టి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా భువనేశ్వర్ కుమార్ స్పెల్‌కి ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్‌పై నాలుగు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కి ముందు భువనేశ్వర్‌ కుమార్‌ని 200 వికెట్ల మైలురాయి ఊరిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సీఎస్కేపై వికెట్లు తీసి ఈ రికార్డును అందుకుంటాడా? లేక ఇంకో మ్యాచ్ కోసం ఎదురుచూడాలా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam