మాస్ మహారాజా రవితేజ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత విలువలతో నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే అద్భుతమైన ప్రజాదరణ దక్కించుకుంది. రవితేజ సినీ ప్రస్థానంలోనే సరికొత్త మైలురాయిగా నిలిచిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
* టాలీవుడ్‌లోకి తాప్సీ రీఎంట్రీ.. 'కొరియన్ కనకరాజు' డైరెక్టర్‌తో సరికొత్త హారర్ థ్రిల్లర్!
పాన్-ఇండియా స్థాయిలో కన్నడ స్టార్ యశ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'టాక్సిక్' వంటి గట్టి పోటీ బరిలో ఉన్నప్పటికీ, 'ఇరుముడి' తన ప్రభంజనాన్ని కొనసాగించడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం రూ.200 కోట్ల టార్గెట్ వైపు దూసుకుపోతోంది. ఈ చిత్రంలో 'త్రినాథ్' అనే పాత్రలో రవితేజ పండించిన గుండెల్ని హత్తుకునే ఎమోషన్స్ ప్రేక్షకులను ఎంతగానో కదిలించాయి. అలాగే బేబీ నక్షత్ర నటన ఈ చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. డైరెక్టర్ శివ నిర్వాణ టేకింగ్, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, సీలేరు ప్రాంతంలోని అందమైన లొకేషన్లు సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచాయి. హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో సాయికుమార్, స్వాసిక తమ పరిధి మేర నటించి మెప్పించారు.
* 'ఎల్లమ్మ' హీరోయిన్ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్... దేవిశ్రీకి జోడీగా యంగ్ బ్యూటీ ఫిక్స్!
థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలోనే ఈ చిత్ర డిజిటల్ రిలీజ్‌కి సంబంధించిన ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓటీటీ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని భారీ మొత్తానికి దక్కించుకుంది. థియేట్రికల్ రన్ నాలుగు వారాల నిబంధన ముగిసిన అనంతరం సెప్టెంబర్ 18 నుంచి 'ఇరుముడి' చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒరిజినల్ తెలుగు వెర్షన్‌తో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లోనూ ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, అలాగే మళ్లీ మళ్లీ ఈ ఎమోషనల్ డ్రామాను వీక్షించాలనుకునే వారికి ఇది గొప్ప శుభవార్త. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'ఇరుముడి' ఓటీటీ వేదికపై డిజిటల్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

