Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ITRలో చిన్న తప్పు.. రూ.6.63 కోట్లు పెనాల్టీ కట్టాలని నోటీసు.. కానీ, రూపాయి కట్టకుండా బయటకు, ఎలాగంటే?

ITRలో చిన్న తప్పు.. రూ.6.63 కోట్లు పెనాల్టీ కట్టాలని నోటీసు.. కానీ, రూపాయి కట్టకుండా బయటకు, ఎలాగంటే?

Telugu Samayam 1 week ago

ITR Mistake: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఉద్యోగులు చేసే చిన్న పొరపాటు కొన్నిసార్లు భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుంది. కంపెనీ నుంచి వచ్చిన పర్క్విజిట్ (Perquisite) ఆదాయాన్ని పొరపాటున క్యాపిటల్ గేయిన్ గా చూపించినందుకు ఒక ఉద్యోగికి ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రూ.6.63 కోట్ల పెనాల్టీ వేసింది.

అయితే, ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ - ముంబై (ITAT) సదరు ఉద్యోగికి భారీ ఉపశమనం కల్పిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. తెలిసి ఉద్దేశపూర్వకంగా చేసిన మోసం కాదని, సద్భావనతో చేసిన సాంకేతిక పొరపాటుకు పన్ను దాచారనే నెపంతో అంత భారీ పెనాల్టీ విధించడం సరికాదని ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది. ఐటీ శాఖ విధించిన పెనాల్టీని రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో సదరు ఉద్యోగికి భారీ ఉపశమనం లభించినట్లయింది.

అసలు ఏం జరిగింది?

ముంబై వర్లీ ప్రాంతంలోని డాక్టర్ అన్నీబీసెంట్ రోడ్‌కు చెందిన క్రిష్ణన్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు చెందిన కంపెనీలో వర్క్ చేశారు. ఆ సమయంలో రూ.6.44 కోట్ల శాలరీ, ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ (ESOPs) ప్రయోజనాల రూపంలో ఆదాయం అందుకున్నారు. ఆ షేర్లను మూడు రోజుల తర్వాత విక్రయించగా రూ.5.67 కోట్లు వచ్చాయి. దీనిపై 20 శఆతం ట్యాక్స్ చెల్లించారు. అయితే, ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో తెలియకుండానే పొరపాటు చేశారు.

షేర్ల విక్రయం ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని ఈ పర్క్విజిట్ మొత్తాన్ని జీతం కింద కాకుండా పొరపాటున క్యాపిటల్ గెయిన్స్ విభాగంలో నమోదు చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ వ్యత్యాసాన్ని గుర్తించి ఉద్యోగి నిజాన్ని దాచిపెట్టి తక్కువ పన్ను కట్టేందుకు ప్రయత్నించారని భావించారు. దీనిపై సెక్షన్ 271 (1)(c) కింద ఏకంగా రూ.6.63 కోట్ల పెనాల్టీ విధించారు. ఈ మేరకు సెక్షన్ 148 కింద ట్యాక్స్ నోటీసులు జారీ చేశారు.

సదరు ఉద్యోగి ఈ పెనాల్టీని సవాలు చేస్తూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా వివరాలను సమగ్రంగా పరిశీలించిన ముంబై ఐటీఏటీ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగి తన ఫారమ్ 16లో, ఐటీఆర్‌లో కంపెనీ నుంచి వచ్చిన ఆదాయ వివరాలన్నింటినీ స్పష్టంగా వెల్లడించారు. ఎలాంటి ఆదాయాన్ని దాచలేదు. ఆదాయాన్ని కేవలం ఒక హెడ్ నుంచి మరొక హెడ్ కి మార్చి రాయడం వల్ల వచ్చిన అవగాహన లోపమే తప్ప ఇది ఆదాయపు పన్ను ఎగవేత కిందకు రాదని ట్రైబ్యునల్ పేర్కొంది. నిజాయితీగా సమాచారం ఇచ్చినప్పుడు జరిగిన ఈ వర్గీకరణ పొరపాటుకు అంత భారీ అపరాధ రుసుము విధించడం చెల్లదని స్పష్టం చేస్తూ రూ.6.63 కోట్ల పెనాల్టీని పూర్తిగా రద్దు చేసింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam