Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జబర్దస్త్‌లోకి బాబు మోహన్ ఎంట్రీ.. పగలబడి నవ్విన నాగబాబు

జబర్దస్త్‌లోకి బాబు మోహన్ ఎంట్రీ.. పగలబడి నవ్విన నాగబాబు

Telugu Samayam 1 week ago

బర్దస్త్ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్‌లో బాగానే ట్రెండ్ అవుతోంది. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో సెలెబ్రిటీలు వచ్చి స్పెషల్ స్కిట్లు చేశారు.

శ్రీనివాసమంగాపురం టీం కూడా వచ్చి సందడి చేసింది. కిరిటీ దామరాజు కూడా స్పెషల్ పర్ఫామెన్స్ చేశాడు. ఇక బాబు మోహన్ వేసిన స్కిట్‌ను చూసి నాగబాబు అయితే పడీ పడీ నవ్వుకున్నాడు. బాబు మోహన్ ప్రతీ సారి ప్రాంప్టింగ్ కోసం ప్రయత్నించడం, ఇంట్లో బెడ్రూంలోకి కూడా ప్రాంప్టింగ్ కోసం రావడం ఇలా అన్ని సీన్లకు నాగబాబు పగలబడి నవ్వేశాడు.

నా 41 ఏళ్ల కెరీర్‌లో ఇలా ఎప్పుడూ జరగలేదు.. ఇలా ప్రాంప్టింగ్ ఎవ్వరూ ఇవ్వేలేదు అని బాబు మోహన్ అన్నారు.. మీరు రెగ్యులర్‌గా యాక్ట్ చేసి ఉంటే ఇంతగా నవ్వు వచ్చేది కాదు.. ఆ ప్రాంప్టింగ్ చెప్పు అని అడిగే తీరు బాగుందంటూ.. నాగబాబు కడుపుబ్బా నవ్వేశాడు. ఇక ఎందుకు? ఏమిటి? ఎలా? అని బాబు మోహన్ తన స్టైల్లో డైలాగ్ చెప్పాడు. ఇక రాకెట్ రాఘవ స్కిట్ మాత్రమే కాకుండా మిగిలిన వారి స్కిట్లు కూడా అదిరిపోయినట్టు అనిపిస్తోంది. బుల్లెట్ భాస్కర్, రాం ప్రసాద్ వేసిన స్కిట్లు కూడా ఫుల్ ఎంటర్టైనింగ్‌గానే కనిపిస్తున్నాయి.

రాం ప్రసాద్ వేసిన స్కిట్లోనే కిరిటీ దామరాజు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. అందులో రాం ప్రసాద్ అండ్ టీం వేసిన పంచ్‌లకు ఇంద్రజ అయితే కడుపుబ్బా నవ్వేశారు. అరేయ్ కాస్త గ్యాప్ ఇవ్వండ్రా అని అనేసింది. కిరిటీ దామరాజుని కూడా నాగబాబు బాగానే మెచ్చుకున్నాడు. డీజే టిల్లు సార్.. ఏయ్ బాబు లెవ్.. అని రాం ప్రసాద్ అంటాడు. అవును అని నాగబాబు కూడా నవ్వుకున్నాడు. చాలా రోజులకు మంచి ప్రోమో చూశాను.. చాలా నవ్వుకున్నాం.. ప్రోమో బాగుంది అని యూట్యూబ్‌లో కామెంట్లు కనిపిస్తున్నాయి.

ప్రోమో సూపర్.. చాలా రోజుకుకి చాలా నవ్వు వచ్చింది, జబర్దస్త్ ప్రోమో చాలా బాగా ఉంది.. ది గ్రేట్ కమెడియన్ బాబు మోహన్ గారు రావడం చాలా బాగుంది.. మిగతా నటులు కూడా సూపర్.. భవిష్యత్తులో ఇలాగే జబర్దస్త్ బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, ప్రోమో సూపర్ గా ఉంది.. బాబూమోహన్ గారు మీరు సూపర్ అండి.. నాగబాబు గారు వచ్చాక జబర్దస్త్ మళ్ళీ ట్రాక్ లో కి వచ్చింది వెరీ గుడ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది హైపర్ ఆది స్కిట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam