దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్.. కెరీర్ ప్రారంభం నుంచీ తనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టే సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఓవైపు స్టార్ హీరోల పక్కన నటిస్తూనే, మరోవైపు యంగ్ హీరోలకు జోడీగా నటిస్తోంది. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, విమెన్ సెంట్రిక్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమపై దృష్టి సారించిన జాన్వీ కపూర్.. కోలీవుడ్ లో సినిమా చేయనున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. 'దేవర' సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఇటీవలే 'పెద్ది' చిత్రంలో అచ్చియమ్మ పాత్రలో అలరించింది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాల్లో నషస్తోంది. ఈ క్రమంలో అమ్మడు తమిళంలో ఓ భారీ ఆఫర్ దక్కించుకుందని అంటున్నారు. కోలీవుడ్ విలక్షణ దర్శకుడు పా.రంజిత్ తో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇది సినిమా కాదని, ఒక వెబ్ సిరీస్ అని టాక్ నడుస్తోంది.
పా.రంజిత్ రూపొందించనున్న వెబ్ సిరీస్ కోసం జాన్వీ కపూర్ ను సంప్రదించగా.. దానికి ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. దీనికి సర్కునం దర్శకత్వం వహిస్తారట. ఈ మధ్యనే ఆయన దుషారా విజయన్ తో 'ఎగ్జామ్' అనే సిరీస్ ని తెరకెక్కించారు. ఇప్పుడు జాన్వీతో ఓ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
* డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వివాహ వేడుక.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ సందడి..
సామాజిక అంశాలు, దళితుల జీవన పోరాటాలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై పా. రంజిత్ సినిమాలు తీస్తుంటారు. తన సినిమాల ద్వారా ప్రజల్లో ఎంతో కొంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆయన సినిమాల్లో బలమైన పాత్రలు ఉంటాయి. ఒకవేళ ఆయన రూపొందించే సిరీస్ లో జాన్వీ నటించేది నిజమే అయితే.. ఇది ఆమె కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

