Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Janmashtami 2026: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే వేణుమాధవుడి ప్రత్యేక ఆశీస్సులు!

Janmashtami 2026: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే వేణుమాధవుడి ప్రత్యేక ఆశీస్సులు!

Telugu Samayam 4 days ago

Janmashtami 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ హర్ష, వజ్ర యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో మీ రాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే వేణుమాధవుడి అనుగ్రహం లభిస్తుందనే ఆసక్తకిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Janmashtami 2026: హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 04 సెప్టెంబర్ 2026 శుక్రవారం నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. ఇదే రోజున బలరాముని జయంతి వేడుకలు కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శ్రీ కృష్ణుడు అర్ధరాత్రి వేళ రోహిణి నక్షత్రం సమయంలో జన్మించాడు కాబట్టి, రాత్రి వేళలో కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదిలా ఉండగా.. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ కృష్ణాష్టమి వేళ వేణుగోపాలుడి వేడుకల సమయంలో కొన్ని అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ సమయంలో కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల కన్నయ్య ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.మేష రాశి (Aries)

మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. ఈ పవిత్రమైన రోజున గులాబీ రంగు వస్త్రాలను ధరించాలి. అనంతరం నుదుటిపై కుంకుమ పెట్టుకోవాలి. చిన్ని కృష్ణుడికి సమర్పించే నైవేద్యంలో పిండి పదార్థాలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎదురయ్యే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.


వృషభ రాశి(Taurus)

వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి ఈ రాశి వారు గోకులాష్టమి రోజున బాల గోపాలుడికి పాలు, తేనే కలిపి స్నానం చేయించాలి. అనంతరం పసుపు చందనం తిలకం రాయాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. అదే విధంగా శ్రీ కృష్ణుడితో పాటు రాధను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది.


మిథున రాశి(Gemini)

మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కృష్ణాష్టమి వేళ వేణు మాధవుడికి ఎర్రని రంగు దుస్తులను సమర్పించాలి. మీరు తయారు చేసే నైవేద్యంలో లడ్డూలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


కర్కాటక రాశి(Cancer)

కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున శంఖంలో నీటితో బాల గోపాలుడికి స్నానం చేయించాలి. అలాగే చిన్ని కృష్ణుడికి సమర్పించే నైవేద్యంలో పిండి పదార్థాలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.


సింహ రాశి(Leo)

సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ కన్నయ్యకు వెన్న, నెయ్యి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగా మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఆనందం పెరుగుతుంది.


కన్య రాశి(Virgo)

కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి గంగాజలంలో పాలు కలిపి గోకులాష్టమి వేళ బాలగోపాలుడికి స్నానం చేయించాలి. అదే విధంగా చెరకు రసంతో అభిషేకం చేయాలి. ఈ పవిత్రమైన రోజున ఆకుపచ్చని వస్త్రాలను ధరించాలి. మీరు సమర్పించే నైవేద్యంలో పెరుగు, పిండి పదార్థాలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.


తులా రాశి(Libra)

తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేళ వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పాలతో బాల కృష్ణుడికి స్నానం చేయించాలి. ఈరోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.


వృశ్చిక రాశి(Scorpio)

వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణ జన్మాష్టమి వేళ గంగాజలంతో బాల గోపాలుడికి స్నానం చేయించాలి. ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. మీరు చేసే పూజలను సక్రమంగా నిర్వహించాలి. మీరు సమర్పించే ప్రసాదంలో కొబ్బరి బర్ఫీని చేర్చాలి. ఇలా చేయడం వల్ల మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.


ధనుస్సు రాశి(Sagittarius)

ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేళ బాల గోపాలుడికి పెరుగుతో స్నానం చేయించి, ఎర్రని దుస్తులు ధరించాలి. అలాగే పసుపు కలిపిన పాలతో అభిషేకం చేయించాలి. అదే విధంగా మీరు సమర్పించే నైవేద్యంలో లడ్డూలను చేర్చాలి. ఇలా చేయడం వల్ల మీ బంధువుల నుంచి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎవరితో అయినా ఏమైనా వివాదాలుంటే అవి ముగిసిపోతాయి.


మకర రాశి(Capricorn)

మకర రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ ఆవు పాలతో బాల గోపాలుడి ప్రతిమకు అభిషేకం చేయాలి. అలాగే పూజ క్రతువును సక్రమంగా నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పనుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam