Karthika Deepam July 02 Episode: ఏది ఏమైనా.. కార్తీక్‌ని జ్యోత్స్న ఎంత ప్రేమించినా.. అతనిపైనే ఆశలన్నీ పెట్టుకున్నా కూడా.. ఇప్పుడు అతను దీపకి భర్త.
జాలిపడో.. సింపథీ చూపించో దీప మెడలో తాళి కట్టి పెళ్లాన్ని చేసుకున్నాడు. ఆ తరువాత కాపురం కూడా చేసి.. బిడ్డని కూడా కనబోతున్నారు. అయితే జ్యోత్స్న మాత్రం ఇప్పటికీ నువ్వే నా భర్తవి అంటోంది. ఈరోజు (జూలై 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే..
దీప సీఈవోగా డ్యూటీ ఎక్కేయడంతో జ్యోత్స్నకి రక్త కన్నీరు చూపిస్తున్నారు దీప, కార్తీక్, సూరజ్‌లు. కోరలు పీకేసిన పాములు చేసి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇక ఈరోజు (జూలై 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. దీప, జోత్స్న, కార్తీక్ ముగ్గురూ కలిసి భోజనం చేస్తుంటారు. జోత్స్న తింటున్న స్పూన్ కిందపడిపోవడంతో ఎదురుగా ఉన్న కార్తీక్ ప్లేట్‌లోని స్పూన్ తీసుకుని తింటుంటుంది. అది చూసిన దీప.. నిప్పులు కక్కుతూ.. కనుగుడ్లు గిరగిరా తిప్పేస్తూ 'ఆగవే' అని అరుస్తుంది. ఏమైంది దీపా అని కార్తీక్ అడిగ్గా.. 'దీనికి ఇంకా జబ్బు తగ్గలేదు బావా.. అంటూ జోత్స్న చేతిలో ఉన్న స్పూన్‌ని లాగేసుకుంటుంది. పక్కనే ఉన్న కార్తీక్.. ఏమైంది దీపా అని అడిగితే.. 'ఏమైందని అంటావ్ ఏంటీ.. తన స్పూన్ కింద పడిపోతే నీ ఎంగిలి స్పూన్ తీసుకుని తింటుంది' అని అంటుంది. ఆ మాటతో జ్యోత్స్న.. 'తింటే తప్పేంటి'? అని అంటుంది. 'నోరు ముయ్యవే.. కార్తీక్ నా భర్త' అని అంటుంది దీప. ఆ మాటతో జ్యోత్స్న.. నా మెడలో తాళి కడితో నాకు భర్త అయ్యేవాడు.. ఏం బావా.. నువ్వూ దీపా భార్యా భర్తలు కాకముందు.. భార్యాభర్తలు కావాల్సింది మనిద్దరమే కదా. చెప్పు బావా దీనికి.. మనిద్దరం ఎన్నిసార్లు ఎంగిలి తినలేదు..

నీ ఎంగిలి నేను ఎన్నిసార్లు తినలేదూ.. చెప్పు దీనికి. నువ్వు సగం తాగిన కూల్ డ్రింక్స్ నేను తాగేదాన్ని. ఇద్దరం కలిసి ఒకే ఐస్ క్రీమ్ తినేవాళ్లం' అని అంటుంది. దాంతో దీప.. 'ఇక చాల్లే ఆపు.. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన వాటిని కూడా నువ్వు ప్రేమా అనుకుంటే.. నిన్ను మించిన వెర్రిది మరొకర్తి ఉండదు' అని అంటుంది దీప. ఏయ్ నా ఇష్టం నేను తింటాను అని అంటుంది జ్యోత్స్న. పళ్లు రాలిపోతాయ్.. తిన్నావంటే అని తెగ రెచ్చిపోతుంది దీప. దీపా వదిలెయ్ అని కార్తీక్ అంటే.. 'ఏంటి వదిలేసేదీ.. నీ స్పూన్ ఎవరు తీసుకొంటున్నారో నువ్వు చూసుకోవా? అంటూ తెగ ఆవేశపడుతుంది దీప.
దీప ఎప్పటికీ కార్తీక్ పెళ్లం కాలేదు.. ఎప్పటికైనా నేనే కార్తీక్ పెళ్లాన్ని..

దాంతో జ్యోత్స్న.. 'ఊరికే ఆవేశపడకు దీపా.. నీతో నేను ఎప్పుడో ఛాలెంజ్ చేశాను.. కార్తీక్‌కి దీప అనేది ఎప్పటికీ భార్య కాలేదు. నేను పుట్టకముందే బావకి పెళ్లాన్ని అయ్యాను. ఏదొక రోజు నిజంగానే పెళ్లాన్ని అవుతాను' అని అంటుంది. 'నోరు ముయ్యలేదంటే.. స్పూన్ కాదు.. మొత్తం ప్లేట్ నోట్లోకి వెళ్లిపోతుంది చెప్తున్నా.. అని రెచ్చిపోతుంది దీప. ఇక కార్తీక్.. ఊరుకో దీపా అంటూ సూరజ్‌ని పిలిచి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. సూరజ్‌ని భోజనానికి పిలవడంతో.. జ్యోత్స్న ఆవేశంగా అక్కడ నుంచి తినకుండా వెళ్లిపోతుంది. అప్పుడు దీప కడుపు చల్లబడుతుంది. పెద్ద పెద్ద గుడ్లు తీసి గిరగిరా తిప్పేస్తుంటుంది. ఈమెకేదో జరగకూడని అన్యాయం జరిగిపోతున్నట్టు.
ఒడియమ్మా.. స్పూన్‌కే?? మరి ఆమె మొగుడ్నే లాక్కున్నావ్ నిన్నేమనాలి దీపా??

స్పూన్ తీసుకున్నందుకే దీప ఇంత గోల చేస్తే.. మరి జ్యోత్స్నకి కాబోయే మొగుడ్నే లాక్కుంది.. దానికి మరి జ్యోత్స్న కుట్రలు చేయడం.. తప్పేం కాదేమో అనిపిస్తుంది ఈ సీన్ చూస్తే. పాపం జ్యోత్స్న తినకుండా వెళ్లపోతుంటే.. 'ఎవరో పోతే మనకేంటి? నువ్వు రా బ్రదర్.. తిను' అని అంటాడు కార్తీక్. 'నా బైక్ నీ దగ్గరే ఉంచు బ్రదర్.. దీప సీఈవో కాబట్టి కంపెనీ కారు ఇచ్చింది.. ఇక నుంచి మా ఆవిడకి నేనే డ్రైవర్‌ని' అని అంటాడు కార్తీక్. దాంతో సూరజ్.. 'అంతా ఓకేనా? అని అంటాడు. 'ఇవన్నీ పట్టించుకోకు బ్రదర్.. నీకు ఈపాటికే అన్ని విషయాలు తెలిసే ఉంటాయి' అని దీపని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు కార్తీక్. అయితే మన కొత్త సీఈవో మాత్రం గుర్రుగా చూస్తుంటుంది.
నీకోసం ఎవరూ రారు రా..

ఇక జ్యోత్స్న బయట ఆటో కోసం చూస్తుంటే.. సూరజ్ వస్తాడు. ఆమెను చూసి..'అడగడానికి మొహమాటం ఎందుకు..? నీకోసం ఎవరూ రారు.. రా.. నేనే తీసుకొచ్చాను.. నేనే తీసుకెళ్తాను రా.. అని అంటాడు. జ్యోత్స్న ఎప్పటిలాగే కాస్త బెట్టు చేసి.. బైక్ ఎక్కుతుంది. మధ్యలో బైక్ ఆపిన సూరజ్.. నీతో మాట్లాడాలి దిగూ అని అంటాడు. ఇన్నిరోజులూ నీ ప్రవర్తన చూస్తే కోపం వచ్చేది.. కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు చేసింది ఏంటి? అది నాకు నచ్చడం లేదు. పెళ్లైన మగాడి వెంట పెళ్లికానిది ఆడది వెంటపడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ సొసైటీ దాన్ని ఏ పేరుతో పిలుస్తుందో తెలుసా? అని అంటాడు.
నువ్వో బజారు ** ఏమన్నావ్ రా!! 'నేను నీ మొగుడ్నే'.. షాకిచ్చిన సూరజ్

నాకు అవసరం లేదు.. ఎవరేం అనుకున్నా పర్లేదు అని అంటుంది జ్యోత్స్న. దాంతో సూరజ్.. 'నిన్ను ఒక బజారు ** అని అంటాడు. దాంతో షాకైన జ్యోత్స్న.. ఏంట్రా వాగుతున్నావ్ అని అంటుంది జో. ఈ మాట నేను అనకపోయినా.. జనం అనకుండా ఉండరు.. అదే మాట అంటారు.. అని అంటాడు సూరజ్. 'ఎవరేం అనుకుంటే నాకేంటి? అయినా నన్ను అడగడానికి నువ్వెవరివిరా అని కాలర్ పట్టుకుంటుంది జ్యోత్స్న. దాంతో సూరజ్.. 'నేను నీ మొగుడ్నే'.. అని అంటాడు సూరజ్. ఆ మాటకి షాకైన జ్యోత్స్న.. 'నువ్వు ఎలా అవుతావ్ రా నా మొగుడివీ.. నువ్వు నా మెడలో తాళి కట్టావా? అని అంటుంది.
నువ్వు నా పెళ్లానివి అని నా మనసు చెప్తుంది.. 'కార్తీక్ ఎలా అవుతాడే నీ మొగుడు'

మరి కార్తీక్ ఎలా అవుతాడే నీ మొగుడు.. నీ మెడలో తాళి కట్టాడా? అని అడుగుతాడు సూరజ్. తాళి కట్టాల్సిన పనిలేదు.. నా బావే నా భర్త అని నా ఫ్యామిలీ చెప్పింది.. నేను అలాగే పెరిగాను.. అందుకే బావనే నా భర్తగా ఊహించుకుంటున్నా అని అంటుంది జ్యోత్స్న. దాంతో సూరజ్.. 'నువ్వే నా భార్యవి అని నా మనసు చెప్తుంది.. నీ భార్యగా ఊహించుకోవచ్చా?? చెప్పవే చెప్పూ.. ఆడదాని మెడలో మగాడు తాళి కడితేనే మొగుడు అవుతాడు. ఊహించుకుంటేనో.. ఎవరో చెప్తేనో మొగుడు అవ్వడు.. నీ మెడలో తాళి కట్టని కార్తీక్ నీ మొగుడు అయినప్పుడు నేను కూడా నీకు మొగుడ్నే అవుతాను.. కార్తీక్ విషయంలో నీది తప్పు కాదంటే.. నాదీ తప్పు కాదు.
ఇప్పుడు చెప్పరా ఆ మాట.. తల పగలిపోద్ది

నువ్వు కార్తీక్‌ని మొగుడు అనుకో.. నేను నిన్ను నా పెళ్లం అనుకుంటా అని రెచ్చిపోతుంటాడు సూరజ్. దాంతో జ్యోత్స్నకి ఒళ్లు మండిపోయి.. పక్కనే ఉన్న పెద్ద రాయి తెచ్చి మొహాన కొట్టబోతూ.. ఇప్పుడు అనరా.. ఆ మాట మళ్లీ అనరా.. ఈ రాయితో నీ తల పగలకొట్టకపోతే నా పేరు మార్చుకుంటా అని అంటుంది జో. 'నువ్వు మార్చుకోవాల్సింది పేరు కాదు.. మనసు' అని అంటాడు సూరజ్. 'నా మనసు నా ఇష్టం అది మారదు' అని అంటుంది జో. 'ఏంటీ నీ ఇష్టం.. ఆ రోజు గిఫ్ట్ షాప్‌లో నా వస్తువుపై ఆశపడినప్పుడే చెప్పాను.. మనది కానిదానిపై మనసు పడొద్దని.
కార్తీక్ భార్య దీపే.. కడుపులో బిడ్డ కూడా పెరుగుతుంది.. 'అయితే వినరా చెప్తా'

నా వస్తువు నీది ఎలా కాదో.. కార్తీక్ కూడా నీ వాడు కాదు. అతను దీప భర్త. వాళ్ల అనురాగానికి గుర్తుగా దీప కడుపులో బిడ్డ కూడా పెరుగుతున్నాడు. నేను నీ మొగుడ్ని అని అన్నందుకే నువ్వు రాయి తీసుకుని వచ్చావ్' అని అంటాడు సూరజ్. ఆ మాట మళ్లీ అని ఉంటే.. నిజంగానే నీ తల పగలకొట్టేదాన్ని.. అని జ్యోత్స్న అంటుంది. ఆ మాటతో సూరజ్.. 'అయితే దీపకి నీపై కోపం రావడంలో తప్పేం లేదే.. దీప కోపం తప్పు అంటే.. నన్ను నీ మొగుడ్ని అని ఒప్పుకో.. అది తప్పు కాదంటే వాళ్ల జీవితంలో నుంచి తప్పుకో.. అంతేకానీ.. వేరొకరి సొంతం అయిన మనిషిపై మనసు పడటం.. మనిషి లక్షణం కాదు.
తాళి సింపతీతో కట్టాడు సరే.. మరి కాపురం ఎలా చేస్తున్నాడూ..

మామూలుగా నువ్వు బంగారానివే.. కానీ నీ విలువని నువ్వే తగ్గించుకుంటున్నావ్.. వయసుకి మించిన ఆవేశం.. అర్హతని మించిన అహంకారంతో.. నిన్ను నువ్వే తగలబెట్టేసుకుంటున్నావ్. పోనీ నీ ఇష్టాన్ని గౌరవిద్దాం అనుకుంటే.. నువ్వు కార్తీక్‌ని కోరుకుంటున్నావ్ కానీ.. కార్తీక్ నిన్ను కోరుకోవడం లేదు. నువ్వు అంటే వన్ పర్సెంట్ ఇష్టం కూడా దీప మెడలతో తాళి కట్టేవాడు కాదు' అని అంటాడు సూరజ్. అది సింపతీతో తాళి కట్టించుకుంది అని అంటుంది జ్యోత్స్న. 'తాళి అయితే సింపథీతోకట్టించుకుందనే అనుకుందాం.. కాపురం అయితే సింపతీతో చేయరు కదా.. ఆడదాని మెడలో తాళి కట్టాలంటే చచ్చేంతవరకూ ఉండే ఇష్టం ఉండాలి.
పెళ్లైన మగాడి వెంట పడటం ఏంటే సిగ్గులేనిదానా??

అలాంటి ఇష్టం. కార్తీక్‌కి దీపపై ఉంది. ఇష్టం ఉంది కాబట్టే తాళి కట్టాడు.. ఇష్టం ఉంది కాబట్టే కాపురం చేశాడు.. ఇష్టం ఉంది కాబట్టే తండ్రి అయ్యాడు.. నేను మగాడ్ని కాబట్టి ఇలా మాట్లాడుతున్నా.. అదే ఆడదాన్ని అయ్యి ఉంటే.. పెళ్లైన మగాడి వెంట పడటం ఏంటే సిగ్గులేని దానా?? అని తిట్టేదాన్ని అని అంటాడు సూరజ్. దాంతో సూరజ్‌పై చేయి లేపుతుంది జో. 'నువ్వు కొట్టినా తిట్టినా ఇదే నిజం.. ఈ విషయం మీ ఇంటి వాళ్లకి ఎంత వరకూ తెలుసో నాకు తెలియదు.. తెలిస్తే బాధపడతారేమో.. కానీ ఇది నీ జీవితం.. నువ్వేం చిన్నపిల్లవేం కాదు.

