Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam Today జూలై 07 ఎపిసోడ్: మాలిని ఎంట్రీతో కథలో ఉత్కంఠ.. సూరజ్ బలం, బలగం ఈమెనే! భయపెడుతుందయ్యో

Karthika Deepam Today జూలై 07 ఎపిసోడ్: మాలిని ఎంట్రీతో కథలో ఉత్కంఠ.. సూరజ్ బలం, బలగం ఈమెనే! భయపెడుతుందయ్యో

Telugu Samayam 5 days ago

Karthika Deepam July 07 Episode: కార్తీకదీపం కథలోకి కొత్త క్యారెక్టర్లు క్యూ కడుతున్నాయి. రీసెంట్‌గా సూరజ్ ఎంట్రీ ఇచ్చాడు. నేటి (జూలై 07) ఎపిసోడ్‌లో మరో కొత్త క్యారెక్టర్ మాలిని ఎంట్రీ ఇచ్చింది.

అసలు ఈమె ఎవరు?సూరజ్‌కి ఈమెకి ఉన్న లింక్ ఏంటీ? సూరజ్-జోల పెళ్లి చేయడానికి ఈమెకి ఉన్న సంబంధం ఏంటో నేటి ఎపిసోడ్‌లో చూద్దాం.


సూరజ్‌పై అనుమానంతో లాగిపెట్టి కొట్టడతాడు శివన్నారాయణ. ఇది నిన్నటి ఎపిసోడ్ హైలైట్ కాగా.. ఈరోజు (జూలై 07) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. కిచెన్‌లో ఉన్న దీప.. సూరజ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. తాతకి సూరజ్‌కి అనుమానం ఉన్నట్టే.. సుమిత్ర అమ్మకి కూడా అనుమానం ఉంటే అని కార్తీక్‌ని అడుగుతుంది దీప. దాంతో కార్తీక్.. 'మీ అమ్మకేమో కానీ నాకైతే ఉంది.. సూరజ్‌పై అనుమానం అని అంటాడు కార్తీక్. ఆ మాటతో షాక్ అవుతుంది దీప. 'నీకు నమ్మకంగా ఉన్న వ్యక్తిపై నాకు అనుమానం ఏంటని అనుకుంటున్నావా? అసలు సూరజ్ ఎవరో తెలియదు.. ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు.. ఎవరి తాలూకానో కూడా తెలియదు.. అతని గురించి ఏమీ తెలియని మనిషి మన శత్రువుతో చేతులు కలపడని నమ్మకం ఏంటి? అని అడుగుతాడు కార్తీక్. కాసేపు దక్షణమూర్తి.. మన తాత శత్రువు అని అనుకుందాం. మన తాత శత్రువు అంటే మనకీ శత్రువే. కానీ సూరజ్ మన శత్రువుతో మాట్లాడుతున్నాడంటే.. అనుమానం రావడంలో తప్పేం ఉంది? అని అంటాడు కార్తీక్. కొట్టేటంత అనుమానమా? అని అంటుంది దీప. తాత పెట్టే పరీక్షలు కఠినంగానే ఉంటాయి. సొంత వాళ్లమైన మనకే తప్పలేదు.. బయట వాళ్లని ఎలా క్షమిస్తాడు? అని అంటాడు కార్తీక్. కన్నతండ్రి ఎదురుగా ఉన్నా.. సుమిత్ర గురించి దీప ఎమోషనల్

ఏమో బావా మనలో మనం గొడవలు పడాలనే దక్షణమూర్తి తాత ఇదంతా చేయిస్తున్నాడని అనిపిస్తుంది అని అంటుంది దీప. అవును గొడవలు పెట్టడమే కాదు దీపా.. మనతో పోటీకి కూడా దిగాను.. మన రెస్టారెంట్స్‌కి పోటీగా కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నాడు అని అంటాడు కార్తీక్. అయినా తాత ఓకే చెప్పలేదు కదా అని దీప అంటే.. 'చెప్పడూ.. దక్షణమూర్తి తాతతో పోటీ అంటే బురదలో రాయి లెక్క అని అనుకుంటారు.. అందుకే ఇంటికి వచ్చి రెచ్చిపోయినా వదిలేశారు' అని అంటాడు కార్తీక్. కన్నతండ్రి ఎదురుగా ఉన్నా మాట్లాలేకపోతున్న ఆ కూతురు సుమిత్ర గారి మనసు ఎంత బాధపడి ఉంటుంది బావా? అని అంటుంది దీప.


చెంప దెబ్బలు తిన్నావ్.. ఏమైంద్రా నీ సెల్ఫ్ రెస్పెక్ట్

తాత కొట్టినందుకు బ్రదర్ బాధపడుతూ ఉంటాడేమో అని అనుకుంటాడు కార్తీక్. అయితే సూరజ్‌లోమాత్రం ఎలాంటి బాధ ఉండదు. ఎప్పటిలాగే ఆఫీస్‌కి వెళ్తుంటే.. జ్యోత్స్న వస్తుంది. 'నువ్వు ఇక బ్యాగ్ సర్దుకోవాల్సిన టైమ్ వచ్చేసింద్రోయ్.. ఇంత జరిగిన తరువాత కూడా సిగ్గులేకుండా ఎలా ఉండగలుగుతున్నావ్.. నీ ఈగో నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తుందా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైందిరా? అందరిలో నిన్ను మా తాత చెంపదెబ్బ కొట్టిన తరువాత.. నువ్వు మళ్లీ తలెత్తుకుని తిరగగలవా? లగేజ్ తీసుకుని దయచేయొచ్చు' అని అంటుంది జ్యోత్స్న. 'చూడు బేబీ.. నాకు ఎలాంటి కోపం లేదు.. కొట్టినందుకు హాయిగా ఉంది' అని అంటాడు సూరజ్.


నన్ను కొనేటంత ఖలేజా ఎవరికీ లేదే..

కొట్టడం ఆనందం ఇవ్వడం ఏంట్రా.. నువ్వు నిజంగానే దక్షణమూర్తికి అమ్ముడుపోయావా? అని జ్యోత్స్న అంటుంది. కాపేపు వాగడం ఆపుతావా? నన్ను కొనేటంత ఖలేజా ఇక్కడ ఎవరికీ లేదే.. ఒక వేళ కొనడానికి వచ్చినా అమ్ముడుపోవడానికి ఈ సూరజ్ రెడీగా లేడు. నేను దిగివచ్చేది అభిమానానికి మాత్రమే. మీ తాత నన్ను కొట్టడంలో అనుమానం మాత్రమే చూశావ్.. కానీ నేను అభిమానం మాత్రమే చూశాను. శివన్నారాయణ గారు.. నన్ను మాత్రమే ఎందుకు అనుమానించలేదూ.. వాళ్లపై ఎందుకు చేయి చేసుకోలేదు. మన అనుకున్న వాళ్లపైనే అనుమాన పడతాం.. మన అనుకున్న వాళ్లపైనే చేయి చేసుకుంటాం.. సూరజ్ అనేటోడ్ని నచ్చే కదా.. ఏకంగా ఇంట్లో పెట్టుకున్నారూ' అని అంటాడు సూరజ్.


అర్థం కాదు.. అర్థాంగిని చేసుకుంటా..

ఆయన కొట్టింది నాపై ఉన్న కోపంతో కాదు.. దక్షణమూర్తి గారిపై ఉన్న కోపంతో. ఆయన కొట్టిన దెబ్బ నా చెంపకి తగిలింది కానీ.. నా మనసుకి కాదు అని అంటాడు సూరజ్. మా తాతని ఇంతలా అర్థం చేసుకుని నన్ను ఎందుకురా అర్థం చేసుకోవడం లేదూ అని జో అంటే.. 'నిన్ను అర్థం చేసుకోకపోవడం ఏంటీ.. అర్థాంగిని కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను' అని అంటాడు సూరజ్. ఆ మాటతో జోకి మండిపోతుంది. 'నువ్వు సరేనంటే వెంటనే పెళ్లి చేసుకుందాం డార్లింగ్' అని అంటాడు సూరజ్. ఆశకి కూడా హద్దు ఉండాలి.. నన్ను అందుకునే ఛాన్స్ నేను ఎవ్వరికీ ఇవ్వను అని అంటుంది జో.


నా లాంటి ఏంజెల్‌ని అందుకోవాలంటే..

'కుమారిగానే మిగిలిపోతావా? అని సూరజ్ అంటే.. 'నాలాంటి దానిపై ఆశపడితే జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోతావ్' అని అంటుంది జో. ఏంటీ నాతోనే ఛాలెంజ్‌నా అని సూరజ్ అంటే.. 'నాలాంటి ఏంజెల్‌ని అందుకోవాలంటే వాడికి నా అంత స్థాయి ఉండాలి.. రీ రేంజ్ నాకు సరిపోదు. మీరంతా ప్లాట్ ఫామ్ బ్యాచ్.. నీకు మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటే.. నీ స్థాయికి తగ్గట్టుగా ఏ ఇడ్లీ కొట్టుదాన్నో చేసుకో.. నీ స్థాయి అదీ నీకు గుర్తు చేస్తున్నా' అని అంటుంది జో. మరి నీ వెనుక ఏం ఉంది నీ స్థాయి ఏంటి అని సూరజ్ అంటే.. ' ఇదే నా స్థాయి అంటూ తన వెనుకున్న పెద్ద బంగ్లాని చూపిస్తుంది జో.


నువ్వు శివన్నారాయణ మనవరాలివి కాదు..

హో నీ వెనుక మీ తాత సంపాదించిన ఆస్తి ఉంది.. నువ్వు శివన్నారాయణ మనవరాలివి అన్న ఒకే ఒక్క విషయం పక్కనపెడితే.. రోడ్డుపై అరటిపళ్లు అమ్ముకోవడానికి కూడా పనికి రావు. ఎందుకంటే వ్యాపారం చేయాలంటే మంచి మనసు ఉండాలి.. నీ దగ్గర లేనిదే అదీ.. అని అంటాడు సూరజ్. నా మనసు గురించి నువ్వెవడ్రా మాట్లాడటానికి అని జో అంటే.. 'నిన్ను పెళ్లి చేసుకోబోయే మొగుడ్నే అని అంటాడు సూరజ్. 'ఆ మాట అంటేచంపేస్తా' అని జో అంటే.. 'ఏం చూసుకునే నీకు అంత పొగరూ.. నువ్వు శివన్నారాయణ మనవరాలివే కాదు.. నువ్వు అనామకురాలివి' అని అంటాడు సూరజ్.


మన పెళ్లి జరిగేది ఈ ఇంట్లోనే.. ఛాలెంజ్

ఆ మాటతో జోత్స్నలో వణుకు మొదలౌతుంది. ఎందుకంటే ఈమె శివన్నారాయణ మనవరాలు కాదు కాబట్టి. రేయ్.. నా వెనుక పది తరాలు కూర్చుని తిన్నా కూడా తరగనంత ఆస్తి ఉంది.. అసలు నీకు నాకు పొంతన ఏంటిరా? నన్ను అందుకోవాలని ప్రయత్నించకు.. జీవితాంతం పెళ్లి కాకుండా పోతావ్ అని అంటుంది జోత్స్న. 'సర్లే అదీ చూద్దాం.. పెళ్లి మాత్రం మనం ఈ ఇంట్లోనే చేసుకుందాం అని అంటాడు సూరజ్. 'రేయ్.. ఇక ఆపరా.. నీ మాటలు ఎవరైనా వింటే.. కాళ్లు విరగ్గొడతారు.. అర్హతను మించి ఆశపడకు.. నా మాట విని పోరా' అని అంటుంది జోత్స్న. సర్లే.. తదాస్తూ.. నిన్ను నన్ను కలపడానికి తదాస్తు దేవత భూమిపైకి అడుగుపెడుతుంది అని అంటాడు సూరజ్.


మాలిని మరో కొత్త ఎంట్రీ.. సూరజ్, జోల పెళ్లి చేసే తదాస్తు దేవత

సూరజ్ అలా అన్నాడో లేదో.. ఇలా తదాస్తు దేవత ప్రత్యక్షం అవుతుంది. మళ్లీ ఓ కొత్త క్యారెక్టర్ అన్నమాట. ఆమె ఎవరో కాదు మాలిని. ఆమె ఎంట్రీ అయితే మామూలుగా లేదు. ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన మాలిని.. 'ఈ రెస్టారెంట్‌ని కొనాలని వచ్చాను.. నాకు కాఫీ వచ్చింది.. హోటల్ కూడా నచ్చింది.. మార్కెట్ వాల్యూ రెండు కోట్లు.. నేను రెండున్నర కోట్లు ఇస్తాను.. ఖాళీ చేసి వెళ్లిపోతే బావుంటుంది' అని అంటుంది మాలిన. 'సారీ నేను ఈ హోటల్‌ని అమ్మను అని అంటాడతను. 'సరే నాలుగు కోట్లు ఇస్తానని అంటుంది మాలిన. మీరు ఎంత ఇచ్చినా అమ్మను అని అంటాడు రెస్టారెంట్ ఓనర్.


అది మీ దగ్గరే ఉంచండి.. వామ్మో మాలిని వార్నింగ్

సమయం చాలా విలువైనది.. వృధా చేయొద్దు మళ్లీ కలుద్దాం.. నైస్ డే.. రాజీ పడని మీ తత్వం నాకు నచ్చింది.. మీరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.. ఆ విజిటింగ్ కార్డ్ మీ దగ్గరే ఉంచండి.. అవసరం పడొచ్చు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది మాలిని. కట్ చేస్తే అటు దీప అండ్ కో బ్యాచ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటే సూరజ్ వెళ్లి.. 'దీప గారూ.. రేపు ఆఫీస్‌కి రెండు గంటలు ఆలస్యంగా వస్తాను' అని తెగ నటించేస్తుంటాడు. అది చూసిన జో.. 'రెండు గంటలు కాకపోతే.. రెండు రోజులు ఆలస్యంగారా.. నువ్వే పెద్ద ఎంప్లాయ్‌లా ఫీల్ అయిపోతున్నావ్ ఏంటీ అని అంటుంది. నేను ఏది చేసినా కూడా సిన్సియర్‌గానే చేస్తాను అని అంటాడు సూరజ్. సర్లే కానీ.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని కార్తీక్ అంటే.. జో అందుకుని.. నీకు సొంత వాళ్లు ఎవరూ లేరు కదా.. ఎవర్ని కలవడానికి వెళ్తున్నావ్ అని అంటుంది. మరి సూరజ్ సమాధానం అయితే 'పెళ్లి చూపులకు' అని అనొచ్చు. ఔనో కాదో తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam