ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాడడం అనేది నేడు అందరి ఇళ్ళల్లో కామన్ అయిపోయింది. వీటిని వాడడం వల్ల గదిలోని గాలి ఒకేచోట ఉండిపోకుండా బయటికి పంపి తాజా గాలి వచ్చేలా చూస్తుంది.
కిచెన్, బాత్రూమ్‌లో ఎక్కువగా వాడే ఈ ఫ్యాన్స్ లోపలి గాలిని బయటికి పంపి బయటి గాలిని లోపలికి వచ్చేలా చేస్తాయి. దీంతో గాలి తాజాగా ఉంటుంది. కాస్తా ఊపిరి ఆడుతుంది. అందుకే, చాలా మంది ఈ ఫ్యాన్స్ వాడుతున్నారు. మరి ఈ ఫ్యాన్స్‌ని మనం అలానే ఎన్నిరోజులు వాడతాం. ఇవి చక్కగా పనిచేయాలంటే రెగ్యులర్‌గా క్లీనింగ్ చేయాలిగా. అందుకోసం కొన్ని చిట్కాలు.
ఇదివరకటి రోజుల్లో పెద్ద స్థలాల్లో ఇల్లులు కట్టుకునేవారు. బాత్‌రూమ్‌లు బయట ఉండేవి. ఇంటికి పెద్ద పెద్ద కిటికీలు ఉండేవి. ఏంచక్కా ఇంట్లోకి గాలి వస్తూ పోతూ ఉండేది. కానీ, ఇప్పుడు పల్లెటూరు అయినా, పట్నమైనా సరే చిన్న చిన్న స్థలాల్లోనే ఇండ్లు కట్టుకుంటున్నారు. ఏ సమయమైనా సరే వాష్‌రూమ్ వెళ్లేందుకు వీలుండేటట్లుగా ఇంట్లోనే బాత్‌రూమ్‌లు కట్టుకుంటున్నారు. దీంతో లోపలి గాలి అంత త్వరగా బయటికి పోదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్‌ని మనం బాత్‌రూమ్‌లలో వేడి నీటితో వచ్చే ఆవిరి, తేమని బయటికి గోడలు పాడవ్వకుండా చూస్తాయి. అంతేకాకుండా చెడు వాసనలు కూడా లోపలే అలానే ఉండిపోకుండా చేస్తాయి. గీజర్ వంటివి వాడినప్పుడు ఆ వేడి కూడా బయటికి చేస్తాయి.
ఇక కిచెన్‌లోనూ వంట చేసేటప్పుడు వచ్చే వేడి, వాంట తాలూకూ వాసనలు వెంటనే బయటికి పంపపుతాయి. పొగ, నూనె ఆవిర్లు గోడలకి, సామాన్లకి అతుక్కోకుండా చేస్తాయి. అలా చేయడమే కాకుండా బయటి తాజా గాలి లోపలికి వచ్చేలా చేస్తాయి. ఇవి చాలా ముఖ్యం. కాబట్టి, నేడు చాలా మంది ఇళ్ళల్లో ఈ ఫ్యాన్స్‌ని వాడుతున్నారు. మరి ఇవి సమర్థవంతంగా పనిచేయాలంటే వాటిని ఎప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేయాలిగా. దానికోసం ఎలా క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతాయో ఇప్పుడు చూద్దాం.పవర్ ఆఫ్ చేయడం

మనం ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే క్లీన్ చేయడానికి ముందుగా పవర్ బటన్‌ని ఆఫ్ చేసి ప్లగ్ తీయాలి. నీటితో తుడవం కదా ఎందుకులే ఆఫ్ చేయడం అనుకుంటే పొరపాటే. కాబట్టి, ముందుగానే ఎలాంటి సమస్యలు రాకుండా పవర్ ఆఫ్ చేయాలి.
పొడి దుమ్ముని దులపడం

ఇప్పుడు ముందుగా పొడిగా ఉండే దుమ్ముని దులపండి. బ్రష్ అటాచ్‌మెంట్ ఉన్న దుమ్ముని దులపడానికి వాక్యూమ్ లేదా పొడిగుడ్డని వాడండి. అలా దులిపితేనే దుమ్ము చక్కగా క్లీన్ అవుతుంది. అంతేకానీ, దానిని క్లీన్ చేయడానికి ముందుగానే తడిగుడ్డని వాడొద్దు. అలా చేస్తే అది ఇంకా జిడ్డుగా మారుతుంది. కాబట్టి, ముందుగా పొడిగా ఉన్న దుమ్ము మొత్తాన్ని క్లీన్ చేయండి.
విడదీసి క్లీనింగ్

ఫ్యాన్స్‌ని దులిపాక కవర్, బ్లేడ్స్‌ని వేటికి అవి జాగ్రత్తగా విడదీయండి. ఇలా చేయడం వల్ల వాటిని చక్కగా క్లీన్ చేయడానికి వీలు అవుతుంది. సాధ్యమైనంత వరకూ విడదీయండి. అది కష్టమనుకుంటే అలానే దులపండి. ఒక్కొక్కటిగా మెల్లిగా విడదీస్తే క్లీనింగ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది.
నీటిలో నానబెట్టి తుడవడం

విడదీసిన భాగాలన్నింటినీ క్లీన్ చేయడానికి ఓ బేసిన్‌లో వేడి నీరు డిష్ సోప్ వేయండి. కాస్తా వెనిగర్ కూడా వేయండి. దీని వల్ల జిడ్డు వదులుతాయి. ఈ నీటిని స్ప్రే బాటిలో వేసి స్ప్రే చేసుకుంటూ తుడవండి. మీ ఫ్యాన్ మెటల్‌ని బట్టి వాటిని నీటిలో నానబెట్టొచ్చు కూడా. ప్లాస్టిక్ లాంటివి అయితే హ్యాపీగా నానబెట్టి క్లీన్ చేయొచ్చు. నానిన తర్వాత చక్కగా క్లీన్ అవుతాయి. మనం రుద్దినప్పుడు కొన్ని మొండి మరకలు ఉంటాయి. వాటిని దూరం చేయడానికి కొబ్బరినూనె, కిరోసిన్ వంటి ఆయిల్స్‌ని వేయాలి. ఆ తర్వాత రుద్దాలి. ఇలా చేస్తే జిడ్డు మరకలు క్లీన్ అవుతాయి.
రుద్దడానికి బ్రష్

ఫ్యాన్స్‌లోని మూలమూలల్లో క్లీన్ చేయడానికి మెత్తని బ్రష్, పాత టూత్‌బ్రష్‌లు వాడొచ్చు. భాగాల్లోని మూలమూలల్లో బ్రష్‌తో రుద్ది మంచి నీటితో కడగాలి. మోటర్ హౌసింగ్‌పై నీరు పడకుండా నీటిలో ముంచి పూర్తిగా పిండి కాస్తా తడిగా ఉన్న గుడ్డతో తుడవండి. దీనిని మనం రెక్కలు తుడిచినట్లుగా నీరు పోయడం, నీటిలో నానబెట్టడం చేయొద్దు. ఇలా చేస్తే ఫ్యాన్ పాడవుతుంది.
ఆరబెట్టి ఫిట్ చేయడం

ఇలా క్లీన్ చేసిన ఫ్యాన్‌ని ముందుగా పూర్తిగా ఆరనివ్వాలి. దాదాపు 24 గంటలపాటు ఆరినా పర్లేదు. ఏమాత్రం తడి ఉండకూడదు. ఆ తర్వాత మరోసారి పొడిగుడ్డతో తుడిచి ఆ తర్వాత మళ్ళీ ఫిట్ చేయాలి. గుర్తుంచుకోండి మోటార్, రెక్కలు పూర్తిగా ఆరిన తర్వాతే ఫిట్ చేయాలి. అప్పుడే మళ్లీ దాన్ని వాడాలి.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.

