Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కీలక సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్..!

కీలక సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్..!

Telugu Samayam 1 day ago

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ స్టార్ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.

బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో బుమ్రా నెగ్గాడు. ఈ మేరకు జస్‌ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ తాజాగా ప్రకటించింది! దీంతో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో అతడు ఆడటం ఖాయమైంది.

"జస్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అతడు ఫిట్‌నెస్ టెస్టులను క్లియర్ చేశాడు. ఇప్పటికే శ్రీలంక సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో ఉన్న బుమ్రా.. రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్‌తో రెండో వన్డే సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. దీంతో లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేకు దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి.. సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2025-2027 సైకిల్‌లో టీమిండియా ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ కీలకం. అందుకే పూర్తిస్థాయి జట్టుతో ఈ సిరీస్‌ ఆడాలని బీసీసీఐ భావిస్తోంది. బుమ్రా తుది జట్టులో ఉంటే శ్రీలంక బ్యాటర్లకు సవాల్‌ విసరడం ఖాయం. ప్రస్తుత డబ్ల్యూటీసీ సీజన్‌లో భారత్‌ ఇంకా 9 టెస్టులను ఆడనుంది. ఇందులో కనీసం 7 మ్యాచుల్లో గెలిస్తేనే ఫైనల్‌కు చేరేందుకు అవకాశం ఉంటుంది.

భారత్, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా భారత జట్టు శ్రీలంక గడ్డ మీద రెండు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15న ప్రారంభం కానుండగా.. కోలంబో వేదికగా జరిగే రెండో ఆగస్టు 23-27 తేదీల మధ్య జరగనుంది.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు:


శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నార్ బ్రార్, దేవ్‌దత్ పడిక్కల్, సారాన్ష్ జైన్.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam