ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.
ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.
ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఓవరాల్‌గా 30 మ్యాచ్‌లు జరిగాయి. అందులో రెండింతలు కేకేఆర్ జట్టే విజయాలు సాధించింది. సన్‌రైజర్స్ జట్టు కేవలం పది విజయాలు సాధిస్తే, కోల్‌కతా 20 మ్యాచ్‌లలో గెలిచింది. 2024 ఐపీఎల్ ఫైనల్‌లోనూ సన్‌రైజర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.
ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌లలో కేకేఆర్ నాలుగు సార్లు గెలిస్తే, సన్‌రైజర్స్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. 2024 ఐపీఎల్‌లో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు గెలవగా, గత సీజన్‌లో ఒకటి సన్‌రైజర్స్, మరొకటి కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచింది.
ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే ఒక్కొక్క మ్యాచ్ ఆడాయి. రెండు జట్లు కూడా 200కు పైగా పరుగులు నమోదు చేయడంతో ఈడెన్ గార్డె్న్స్‌లోనూ భారీ స్కోర్ నమోదవుతుందని అందరూ నమ్మకంతో ఉన్నారు. సన్‌రైజర్స్ తన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 201 పరుగులు చేయగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్‌పై 220 బాదేసింది. అయితే, ఈ రెండు జట్లు అంత భారీ స్కోర్ చేసినప్పటికీ మ్యాచ్ ఓడిపోవడం గమనార్హం.
సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కనిపిస్తున్న ఒకే ఒక లోపం బౌలింగ్ వైఫల్యం. ఇరు జట్లు కూడా బ్యాటింగ్‌లో బలంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్ విషయంలో వెనుకబడే ఉన్నాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమవ్వడం ఆ జట్టుకు భారీ నష్టంగా మారింది. కేకేఆర్ కీలక పేసర్లు గాయాలతో బయటకెళ్లడం ఆ జట్టుకు మైనస్‌గా మారింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అంచనా
అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబానీ, కార్తీక్ త్యాగి.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనా
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దుబే, హర్షిత్ పటేల్, డేవిడ్ పైన్/ జీసన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ.
