Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం... తల్లి మోహిని మణి కన్నుమూత

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం... తల్లి మోహిని మణి కన్నుమూత

Telugu Samayam 1 week ago

మిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని మణి వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా శనివారం ఉదయం కన్నుమూశారు.

ఈ బాధాకరమైన వార్త తెలియగానే తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. గత కొంతకాలంగా వయో సహజమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మోహిని మణి (84) చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కుమారులు అజిత్ కుమార్, అనూప్ కుమార్, అనిల్ కుమార్ ఉన్నారు.

* వాచ్‌మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్!

అజిత్ తండ్రి పి.ఎస్. మణి (పి. సుబ్రమణ్యం) కూడా 2023లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లి మరణవార్త విన్న వెంటనే దుబాయ్‌లో ఉన్న నటుడు అజిత్ కుమార్ హుటాహుటిన చెన్నైకి పయనమయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోహిని మణి మృతి పట్ల తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అజిత్ కుమార్ కేవలం వెండితెరపైనే కాకుండా, అంతర్జాతీయ మోటార్ రేసింగ్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన కథానాయకుడిగా మగిజ్ తిరుమేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'విదాముయార్చి', అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇటు సినిమాలతో పాటు ప్రొఫెషనల్ కార్ రేసింగ్‌లోనూ అజిత్ సత్తా చాటుతున్నారు.

* 'నాన్నకు భయపడి ఆ అబద్ధం చెప్పా... అజ్ఞానమే నాకు వరమైంది': చిరంజీవి క్రమశిక్షణపై చరణ్ ఓపెన్ టాక్

ఇటలీలో జరిగిన అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో ఆయన "జెంటిల్‌మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. అలాగే దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 24H కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో అజిత్ రేసింగ్ బృందం మూడో స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆయన దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో కలిసి 'AK 64' అనే మరో భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు తుది దశకు చేరుకున్న తరుణంలో అజిత్ కుమార్ తల్లి మరణించడం ఆయన కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. ఈ కష్టసమయంలో అజిత్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam