Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కొరియన్ కనకరాజు' ట్రైలర్ టాక్: డ్యూయల్ రోల్‌లో వరుణ్ తేజ్ రచ్చ.. థియేటర్లో నవ్వుల జాతరే

'కొరియన్ కనకరాజు' ట్రైలర్ టాక్: డ్యూయల్ రోల్‌లో వరుణ్ తేజ్ రచ్చ.. థియేటర్లో నవ్వుల జాతరే

Telugu Samayam 1 month ago

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, కంటెంట్ సినిమాల స్పెషలిస్ట్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు'.

ఇండో-కొరియన్ నేపథ్యంలో అత్యంత వినూత్నంగా తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్‌కు లభించిన అద్భుత స్పందన తర్వాత, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది.

* చిరంజీవి ఎంత సాయం చేశారో నాకు తెలుసు.. పావలా శ్యామల కుమార్తె ఆరోపణలపై సురేష్ కొండేటి ఫైర్

అనంతపురం టూ కొరియా
ట్రైలర్ పరిశీలిస్తే.. అనంతపురానికి చెందిన ఒక సాధారణ కుర్రాడి జీవితం, కొరియన్ మాఫియా ప్రపంచంలోకి ఎలా ప్రవేశించింది? అక్కడ ఎదురైన విచిత్రమైన, వినోదాత్మక పరిస్థితులు ఏమిటి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా రూపొందినట్లు స్పష్టమవుతోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తన మార్క్ హారర్, కామెడీ, యాక్షన్ అంశాలను కలగలిపి ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు.


వరుణ్ తేజ్ మేకోవర్
ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండు పూర్తిగా భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరించబోతుండటం విశేషం. ఒకవైపు రాయలసీమ యాస, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో ఉండే అనంతపురం యువకుడిగా కనిపిస్తూనే.. మరోవైపు స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ స్వాగ్‌తో ఉండే కొరియన్ మాఫియా డాన్‌గా అదరగొట్టారు. ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసాన్ని వరుణ్ చూపించిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్‌కు ఈ విభిన్నమైన కథాంశంతో కెరీర్‌ గొప్ప మలుపు తిప్పుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదుర్స్
ట్రైలర్‌లో ప్రముఖ నటుడు సత్య చెప్పే పంచ్ డైలాగులు, ఆయన కామెడీ టైమింగ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. హీరోయిన్ రితికా నాయక్ తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్, హారర్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రముఖ నిర్మాణ సంస్థ 'యూవీ క్రియేషన్స్' అత్యంత భారీ స్థాయిలో, రిచ్ విజువల్స్ మరియు సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ 'కొరియన్ కనకరాజు', వరుణ్ తేజ్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam