Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Krishna Janmashtami Astrology: ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ ఏకంగా ఏడు అరుదైన యోగాలు.. ఈ 6 రాశులకు జాక్‌పాట్ ఖాయమా?

Krishna Janmashtami Astrology: ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ ఏకంగా ఏడు అరుదైన యోగాలు.. ఈ 6 రాశులకు జాక్‌పాట్ ఖాయమా?

Telugu Samayam 2 days ago

Krishna Janmashtami Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈసారి సెప్టెంబర్ 4న శుక్రవారం నాడు శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేళ అరుదైన ఏడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి.

ఈ సమయంలో కొన్ని రాశుల వారికి భారీ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.


Krishna Janmashtami Astrology: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన శుక్రవారం నాడు శ్రీ క్రిష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈసారి రోహిణి నక్షత్ర కాలంలో చంద్రుడు తన ఉచ్చరాశి అయిన వృషభరాశిలో, గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో, సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలో, శుక్రుడు కూడా తన సొంత రాశి తులా రాశిలో నివాసం ఉంటారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున కుజుడు, శుక్ర గ్రహాల మధ్య నవపంచమ యోగం ఏర్పడనుంది. చంద్రుడు, గురు గ్రహాల మధ్య గజకేసరి యోగం, శుక్రుడు మాళవ్య రాజయోగాలను ఏర్పరచనున్నారు. దీంతో పాటు జయంతి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం, హర్ష యోగం, హంస యోగం, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో వృషభం సహా కొన్ని రాశుల వారు తిరుగులేని విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.వృషభ రాశి(Taurus)

శ్రీ క్రిష్ణ జన్మాష్ఠమి రోజున రోహిణి నక్షత్రంలో చంద్రుడి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో హర్ష యోగం, సర్వార్ధ సిద్ధి యోగం అనే శుభ కలయిక కూడా ఏర్పడనుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి మనశ్శాంతిని పెంచుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గ్రహాల కలయికతో మీకు ఆకస్మిక లాభం రావొచ్చు.

మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు రావడం లేదా మీరు కోల్పోయిన డబ్బు తిరిగి పొందడం జరగొచ్చు. మీరు చేసిన పనికి మంచి ఫలితాలు రావొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం పొందొచ్చు. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు రావొచ్చు.


కర్కాటక రాశి(Cancer)

కర్కాటక రాశి వారికి ఈసారి శ్రీ కష్ణ జయంతి వంటి పవిత్రమైన రోజున శుభ ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో గురుడు సంచారం చేస్తూ, ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగం ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా మెరుగుపడుతుంది. చాలా కాలం పాటు ఒత్తిడి, ఆందోళనల నుంచి విముక్తి పొందే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది.


సింహ రాశి(Leo)

సింహ రాశి వారికి శ్రీ క్రిష్ణ జయంతి రోజున ఏర్పడే శుభ యోగాల ప్రభావంతో అన్ని అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా సంతోషిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. మీరు కొత్త బాధ్యతలను స్వీకరించి బాగా రాణిస్తారు.

ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు సాధ్యమవుతాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.


కన్య రాశి(Virgo)

కన్య రాశి వారికి శ్రీ క్రిష్ణ జయంతి రోజున మాళవ్య రాజయోగం ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనుల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టుల ద్వారా లాభాలు పెరగొచ్చు. మీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.

మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


తులా రాశి(Libra)

తులా రాశి వారికి శ్రీ క్రిష్ణ జయంతి రోజున ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శుక్రుడి అనుగ్రహంతో మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం రావొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.

మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా బలపడొచ్చు. దీంతో మీరు చాలా సంతోషిస్తారు.


ధనస్సు రాశి(Sagittarius)

శ్రీ క్రిష్ణ జయంతి రోజున ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. మీ ప్రేమ, వైవాహిక జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ఈ అద్భుతమైన రోజు మీకు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. మీ ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రయాణాలు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు.
గమనిక : ఇక్కడ అందించిన భక్తి, జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Read Latest Astrology News and Telugu News​


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam