Dailyhunt
క్యూఆర్ స్కాన్‌తో ATMలో డబ్బులు తీస్తున్నారా.. ఇక ఫ్రీ కాదు.. లిమిట్ దాటితే రూ.23 ఛార్జ్ పడుద్ది!

క్యూఆర్ స్కాన్‌తో ATMలో డబ్బులు తీస్తున్నారా.. ఇక ఫ్రీ కాదు.. లిమిట్ దాటితే రూ.23 ఛార్జ్ పడుద్ది!

Telugu Samayam 2 weeks ago

New ATM Rules: దేశీయ బ్యాంకులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం నిబంధనల్లో కీలక మార్పులు అమలులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు కొత్త నిబంధనలను ప్రకటించాయి.

కొత్త నిబంధనల ప్రకారం నగదు ఉపసంహరణలు, ట్రాన్సాక్షన్ ఛార్జీలపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. ప్రైవేట్ సెక్టార్ లెండర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పటికే కొత్త నిబంధనలను ప్రకటించింది. ఏటీఎం కేంద్రాల్లో యూపీఐ ఆధారిత క్యాష్ విత్ డ్రాయల్స్ ఇకపై నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్ల లిమిట్‌లోకే వస్తాయని స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఈ యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ విత్ డ్రావల్స్‌ని ప్రత్యేక కేటగిరీగా పరిగణించేవారు. అయితే, ఇకపై నెలలో ఇచ్చే ఉచిత ట్రాన్సాక్షన్ల పరిధిలోకి తీసుకురానున్నారు. అంటే లిమిట్ దాటితే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.23 ఛార్జ్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నిబంధనల ప్రకారం నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి 5గా ఉంటుంది. అయితే ఈ ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లు పూర్తయితే ఆ తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 23 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఇది మెట్రో నగరాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలకు 5 ట్రాన్సాక్షన్లు ఉచితంగా ఉంటాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఈ పరిమితి 3 మాత్రమే. అయితే నాన్ మెట్రో నగరాల్లో ఇయితే ఐదు ట్రాన్సాక్షన్ల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే, ఇక నుంచి యుపీఐ ఆధారిత క్యూఆర్ స్కాన్ నగదు విత్ డ్రా సైతం ఈ లిమిట్ లోకి తీసుకురావడంతో పరిమితి అనేది తెలియకుండానే త్వరగా పూర్తయిపోతుంది. ఉచితంగానే కదా అని గమనించకుండా విత్ డ్రా చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్ కి రూ.23 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.



మరోవైపు.. పబ్లిక్ సెక్టార్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై రోజు వారీ నగదు ఉపసంహరణ పరిమితిని సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం కార్డు రకాన్ని బట్టి కస్టమర్లు రోజుకు రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఉపసంహరించవచ్చు. ఇంతకు ముందు కొన్ని కార్డులకు రోజుకు రూ.1 లక్ష వరకు విత్ డ్రాకి అనుమతి ఉండేది. రిస్క్ మేనేజ్మెంట్‌ను మెరుగుపరిచేందుకు ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. అలాగే జియో పేమెంట్స్ బ్యాంక్ ఇటీవలే కొత్త క్యూఆర్ కోడ్ ఆధారిత క్యాష్ విత్ డ్రాయల్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కస్టమర్లకు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన నగదు తీసుకోవచ్చు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam