Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లక్షకు 2 లక్షలు.. 3 లక్షలకు 6 లక్షలు.. 3 నెలల్లో పెట్టుబడిని డబుల్ చేసిన క్రేజీ స్టాక్

లక్షకు 2 లక్షలు.. 3 లక్షలకు 6 లక్షలు.. 3 నెలల్లో పెట్టుబడిని డబుల్ చేసిన క్రేజీ స్టాక్

Telugu Samayam 1 week ago

Multibagger Stock: భారత స్టాక్ మార్కెట్లో కొన్ని స్మాల్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షంలా మారుతుంటాయి. తాజాగా అలాంటి కోవకే చెందిన ఒక మల్టీబ్యాగర్ స్టాక్ దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తోంది.

అదే బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్. కేవలం 3 నెలల కాలంలోనే ఈ షేరు ఏకంగా 100 శాతానికిపైగా పెరిగి ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేయడం విశేషం. అంటే ఈ స్టాక్‌లో 3 నెలల కిందట రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు రూ. 2 లక్షలు వచ్చాయి. అదే విధంగా రూ. 3 లక్షలు జమ చేస్తే రూ. 6 లక్షలకుపైగా వచ్చాయి. అసలు ఈ స్టాక్ ఇటీవల ఇంతలా ఎందుకు దూసుకెళ్లింది. కారణాల్ని తెలుసుకుందాం.

స్టాక్ దూసుకెళ్లేందుకు కారణాలివే..

  • మొదటిది వేదాంత అల్యూమినియం నుంచి భారీ ఆర్డర్ రావడం. అవును బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ స్టీగ్ ఎనర్జీ సర్వీసెస్ (ఇండియా) తాజాగా దిగ్గజ సంస్థ వేదాంతా అల్యూమినియం మెటల్స్ నుంచి ఏకంగా రూ. 1437.17 కోట్ల భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. వేదాంతాకు చెందిన 1215 మెగా వాట్ల పవర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతల్ని ఈ సంస్థకు అప్పగించారు. ఈ ఆర్డర్ ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
  • కేవలం ఈ ఒక్క ఆర్డరే కాదు. గత నెలలో వేదాంత థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించి రూ. 1219.85 కోట్ల కాంట్రాక్ట్, ఇంకా రూ. 406.43 కోట్ల మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్ని ఈ సంస్థే దక్కించుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లతో కంపెనీ ఫైనాన్షియల్స్ మరింత బలంగా మారాయి.
  • ఇంకా భారత మార్కెట్లోని ప్రముఖ ఇన్వెస్టర్లలో ఒకరైన ఆశిష్ ధావన్ ఈ కంపెనీలో తన వాటాను ఏకంగా 6.30 శాతానికి పెంచుకున్నారు. పెద్ద ఇన్వెస్టర్లు నమ్మకం చూయించడంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ షేరు కొనేందుకు ఎగబడ్డారు.

ప్రస్తుతం బ్లూస్ప్రింగ్ షేర్ ధర రూ. 124.50 గా ఉండగా.. 3 నెలల్లో 112 శాతానికిపైగా పెరిగింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 131.82, కనిష్ఠ ధర రూ. 43.98 గా ఉంది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 1.86 వేల కోట్లుగా ఉంది. దీని ప్రధాన బిజినెస్ రంగాలు చూస్తే ఫెసిలిటీ మేనేజ్మెంట్, టెలికాం, పవర్ ప్లాంట్ సర్వీసెస్.

Disclaimer: స్టాక్ మార్కెట్లలో పెట్టబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి ఏదో మొక్కుబడిగా ఇన్వెస్ట్ చేయొద్దు. సెబీ గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అప్పుడే మంచి రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam